ignored
-
క్యాన్సర్ కాదని తేలిగ్గా కొట్టిపడేసే సీరియస్ సంకేతాలేంటంటే..?
గుండె జబ్బులు తర్వాత అత్యంత ప్రమాదకరమైన వ్యాధులో క్యాన్సర్ ఒకటి. దీని కారణంగా 2020లో దాదాపు 10 మిలయన్ల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా రొమ్ము, ఊపిరితిత్తులు, పెద్దప్రేగు, ప్రోస్టేట్ తదితర క్యాన్సర్లతో మరణించిన వారి సంఖ్యే ఎక్కువ. చాలా వరకు ఈ వ్యాధులను నిర్థారించడంలో రోగి జాప్యం ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారణం అని చెబుతున్నారు వైద్యులు. క్యాన్సర్ లక్షణాలు కొన్నిసార్లు అంత తేలిగ్గా బయటపడవు. మరికొన్ని సార్లు మనమే ఏదో సమస్య ఉంది అనిపిస్తున్నా సాధారణమైనదిగా భావించి కొట్టిపరేస్తాం. అలా నిర్ల్యంగా కొట్టిపరేసే క్యాన్సర్‌కి సంబంధించిన సీరియస్ సంకేతాలు ఏంటంటే.. అమెరికన్ సోసైటీ ప్రకారం ప్రతి ఒక్కరూ తమ శరీరంపై శ్రద్ధ వహిచక తప్పదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్ని లక్షణాలు మిస్ అయినప్పటికీ మరికొన్ని ప్రతి ఒక్కరికి తెలుస్తాయని అన్నారు. అవేంటంటే.. ఎముకల్లో నొప్పి, వాచిన.. ముఖ్యంగా అదే పనిగా ఎముకలు నొప్పిగా లేదా కదపలేనట్లు అనిపించినప్పుడు. భరించలేని నొప్పి ఉండి ఆ ప్రాంతంలో వాచినా అది ఎముకల క్యాన్సర్‌కి సంకేతం. ఇంకొకవ విషయం ఏంటంటే క్రమేణ నొప్పి తీవ్రమై రాత్రి వరకు కొనసాగుతుంది. ఇలా ఉంటే తక్షణమే చెకప్ చేయించుకోవాలి. మింగడంలో ఇబ్బంది.. ఇక ఆహారం మింగడంలో ఇబ్బంది ఉన్నా, కడుపు నిండిన అనుభూతి కలిగిన తేలిగ్గా తీసుకోవద్దు. వేగంగా తిన్నప్పుడు మింగడంలో వచ్చే ఇబ్బంది వేరు తరుచుగా మింగడంలో ఇబ్బంది రావడం వేరని నిపుణులు అంటున్నారు. తగినంతగా నమలకపోవడం వల్లే వచ్చే సమస్య కూడా వేరుగా ఉంటుంది. అసధారణ రీతీలో మింగడంలో వచ్చే నొప్పి ఎసోఫాగియల్ క్యాన్సర్‌కి సంకేతం అని చెబుతున్నారు. మొదటి స్టేజ్‌లో గుర్తిస్తే సాధారణ క్యాన్సర్‌లా నయం చేయొచ్చే లేదంటే ప్రమాదమేనని తెలిపారు. దద్దర్లు లేదా ఎలర్జీ.. శరీరంపై దద్దర్లు వచ్చిన నిర్లక్ష్యం చేయొద్దు. అలెర్జీలు, ర్యాష్‌లు అనేకరకాల వ్యాధులకు సంకేతమట. లుకేమియా లేదా బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు ఇలానే కనిపిస్తాయట. అంతేగాదు అసాధారణ రక్త కణాలు ప్లేట్లెట్ల ఉత్పత్తికి అంతరాయం కలిగి చర్మంలోకి లీక్ అవ్వకుండా కేశనాళికలని నిరోధించడంతో పగిలిపోతాయి. దీంతో చర్మంపై ఎరుపు లేదా గోధుమ రంగు మచ్చలను చూస్తారు. కళ్ల నొప్పి.. కళ్లల్లో నొప్పిని కూడా అంతగా పట్టించుకోం. ఏ ఐడ్రాప్స్ వాడేసి తగ్గిపోయిందనుకుంటాం. కంటి క్యాన్సర్ ఎక్కువగా ఐబాల్‌లోని కణాలు, కనురెప్పలు, కన్నీటి నాళాల సమీపంలో ప్రారంభమువతుంది. సాధార నొప్పితో ప్రారంభమవ్వడంతో దీన్ని అంత సులభంగా గుర్తిచలేమని వైద్యులు చెబుతున్నారు గుండెల్లో మంట.. గుండెల్లో లేదా ఛాతీలో మంటని గ్యాస్ నొప్పిగా తీసిపారేస్తాం. చిన్నగా వస్తుంది ఈ నొప్పి. దీంతో కాసేపటికి సర్దుకుంటుందని పట్టించుకోం. ఇలా వచ్చి ఎక్కిళ్లు వచ్చి ఇబ్బంది పడినా అది అన్నవాహిక లేదా కడుపు క్యాన్సర్‌కి సంకేతమని చెబుతున్నారు. వృషణాలు వాచిన.. ఇక గజ్జల్లో నొప్పి, వాపులు లేదా గడ్డలు వచ్చినా..వృషణ క్యాన్సర్‌కి సంకేతం. కొందరిలో ఆ భాగం బరువుగా ఉండటం లేదా వృషణం తగ్గిపోవడం జరుగుతుంది. అలాగే గజ్జల్లో నిస్తేజంగా నొప్పి వస్తుండటం జరుగుతుంది. గురక.. గురక కూడా క్యాన్సర్‌కి సంకేతమనని అంటున్నారు. ఒక విధమైన గురక వచ్చి ఊపిరి పీల్చుకోవడంలో సమస్య ప్రారంభమవుతుంది. ఇది ఊపిరితిత్తులు లేదా థైరాయిడ్ క్యాన్సర్‌కి దారితీస్తుందని చెబుతున్నారు. సాధారణ గురకలా కాక చాలా పెద్దగా వస్తూ ఊపిరి పీల్చుకోవడంలో సమస్యలొస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. గమనిక: ఇవి అధ్యయనంలో వెల్లడైన విషయాలు మాత్రమే. ఇది కేవలం అవగాహన కోసం ఇచ్చిందే. ఆయా క్యాన్సర్ల గురించి పూర్తి విశ్లేషణాత్మకంగా వైద్యులను సంప్రదించి తెలుసుకోవాల్సిందే. (చదవండి: ఉత్తమ ఆహార నగరాల జాబితాలో చోటు దక్కించుకున్న ఐదు భారతీయ నగరాలు ఇవే!) -
మర్చిపోయారా? లేక తొలగించారా? కన్ఫ్యూజ్ చేస్తున్న రైనా..!
-
టీడీపీ బంద్ పిలుపును పట్టించుకోని ప్రజలు
సాక్షి, అమరావతి: టీడీపీ బంద్ పిలుపును ప్రజలు పట్టించుకోలేదు. కొంతమంది కార్యకర్తల హడావుడి తప్ప స్పందన కరవైంది. టీడీపీ నేత పట్టాబి వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో బంద్ ప్రభావం ఎక్కడా కనిపించలేదు. బంద్‌కు మద్దతు ఇవ్వలేమని వ్యాపార, విద్యాసంస్థలు స్పష్టం చేశాయి. ఆర్టీసీ బస్సులు యథావిధిగా తిరుగుతున్నాయి. టీడీపీ బంద్ వల్ల ప్రజలకు ఉపయోగం లేనందున బంద్‌కు సహకరించలేమని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇప్పటికే ప్రకటన విడుదల చేసింది. -
అర్జీ ఇచ్చినా పట్టించుకోని చంద్రబాబు
బంజారాహిల్స్: టీడీపీ అధినేత చంద్రబాబుకు కష్టం చెప్పుకుందామని వస్తే కలవకపోగా తానిచ్చిన అర్జీలు కూడా పట్టించుకోవడంలేదని, ఇదేమిటని ప్రశ్నించడానికి వెళ్తే పోలీసులు అనుమతించడం లేదని ఒక వ్యక్తి హైదరాబాద్‌లోని ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు ఇంటి సమీపంలో తచ్చాడుతుండగా జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైఎస్సార్ జిల్లా రాజంపేట సమీపంలోని పెనమలూరు మండలం చక్రంపేటకు చెందిన సిరిగిరి సుబ్బారెడ్డి (40) తనకు తన కుటుంబసభ్యుల నుంచి ప్రాణహాని ఉన్నట్లు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై చంద్రబాబుకు కూడా ఫిర్యాదు చేసేందుకు గత బుధవారం హైదరాబాద్ వచ్చి జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసం వద్ద పోలీసులకు అర్జీ ఇచ్చారు. చంద్రబాబు నుంచి కబురు వస్తుందేమోనని నాలుగు రోజుల నుంచి సమీపంలోని ఫుట్‌పాత్‌పై పడుకుంటున్నాడు. ఆదివారం తన అర్జీ సంగతి తెలుసుకునేందుకు చంద్రబాబు నివాసం వద్దకు వెళ్లారు. చంద్రబాబు పీఏ రాలేదని, ఆయన కార్యాలయంలోనే అర్జీ ఉందని అక్కడి పోలీసులు తెలిపారు. తనను చంద్రబాబు వద్దకు తీసుకెళ్లకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఆందోళన చేశాడు. దీంతో అతడిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. తాను గోడు చెప్పుకుందామని వస్తే చంద్రబాబు, ఆయన కొడుకు, పీఏ ఎవరూ కలవడం లేదని సుబ్బారెడ్డి వాపోయారు. తనకు న్యాయం జరగకపోతే బాబు ఇంటిముందే ఆత్మహత్య చేసుకుంటానని పేర్కొన్నారు. చదవండి: ‘ఎంత కృతజ్ఞత లేని వాడివి నీవు.. చంద్రం’ లాయర్ల హత్య: ఏరోజు ఏం జరిగిందంటే..? -
ఐటీ, పారిశ్రామిక రంగాలకు నిరాశే..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పారిశ్రామిక, ఐటీ రంగాల ద్వారా ఆర్థికాభివృద్ధి సాధిం చేలా రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రణాళికలకు కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలు నిరాశను మిగిల్చాయి. ఆహారశుద్ధి, ఎయిరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, లాజిస్టిక్స్, ఐటీ తదితర రంగాలను ప్రోత్స హించడం ద్వారా ఆర్ధికాభి వృద్ధి, ఉద్యోగ కల్పన సాధ్యమని రాష్ట్ర ప్రభు త్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఫార్మాసిటీ, జహీరాబాద్ నిమ్జ్‌లో మౌలిక సౌకర్యాలకు నిధులు, ఆహారశుద్ధి, టెక్స్టైల్ పార్కులకు నిధులు, పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి, విభజన చట్టం హామీ మేరకు బయ్యారంలో స్టీల్ ప్లాంటు, ఐటీఐఆర్ ప్రాజెక్టు తదితరాల కోసం కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిధులను ఆశించింది. హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 16,375 కోట్లు కాగా, మౌలిక సౌకర్యాల కల్పనకు రూ.6వేల కోట్లు ఇవ్వాలని ప్రతిపాదించినా బడ్జెట్ ప్రతిపాదనల్లో ఈ ప్రస్తావన లేదు. ఐటీ రంగానికి గాను 2013లో ఐటీఐఆర్ ప్రాజెక్టుకు రూ.3,275 కోట్లు అవసరమవు తాయని అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం నిధుల కోసం ఏళ్ల తరబడి కేంద్రానికి లేఖలు రాస్తోంది. రాష్ట్ర పారిశ్రామిక విధానం టీఎస్‌ఐపాస్‌లో పేర్కొన్న విధంగా రాష్ట్రంలో 6 పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించగా, తొలి దశలో హైదరాబాద్–వరంగల్ కారిడార్ అభివృద్ధిని త్వరితగతిన చేపట్టాలని రాష్ట్రం భావిస్తోంది. శనివారం ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్–2020–21లో వీటి ఊసు లేకపోవడంపై పరిశ్రమల శాఖ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ‘ఎలక్ట్రానిక్స్’కు ఊతం ఎలక్ట్రానిక్స్ సెమీ కండక్టర్ల తయారీ రంగాన్ని ప్రోత్సహించి సిలికాన్ వ్యాలీ తరహాలో హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. తాజా కేంద్ర బడ్జెట్లో మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ పరికరాలు, సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించేందుకు ఓ విధానం ప్రకటిస్తామన్న నేపథ్యంలో కొంత లబ్దిచేకూరనుంది. సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో 250 ఎకరాల్లో ఇప్పటికే మెడికల్ డివైజెస్ పార్కును ఏర్పాటు చేయగా, బడ్జెట్లో దానికి ఊతమిస్తామని కేంద్రం ప్రకటించింది. బడ్జెట్లో నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్ ద్వారా వచ్చే నాలుగేళ్లలో రూ.1480 కోట్లు ఖర్చు చేస్తామని ప్రతిపాదించారు. దీంతో కాకతీయ టెక్స్టైల్ పార్కు అభివృద్ధికి కేంద్రం నుంచి సహకారం నామమాత్రంగా లభించే సూచనలున్నాయి. ఆరు ఎయిర్‌పోర్టుల అభివృద్ధి వచ్చే నాలుగేళ్లలో రూ.1.03లక్షల కోట్లతో వివిధ రంగాల్లో మౌలిక వసతులు కల్పిస్తామన్న కేంద్రం.. ఉడాన్ పథకం ద్వారా దేశ వ్యాప్తంగా 2024 నాటికి వంద ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేస్తామని బడ్జెట్లో పేర్కొంది. రాష్ట్రంలో ఇప్పటికే 6 ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా సర్వే నిర్వహించింది. జక్రాన్‌పల్లి (నిజామాబాద్), అడ్డాకుల (మహబూబ్‌నగర్), పునుకుడుచెర్ల (భద్రాద్రి కొత్తగూడెం)లో కొత్త ఎయిర్‌పోర్టుల ఏర్పాటుతో పాటు బసంత్‌నగర్ (పెద్దపల్లి), మామునూరు (వరంగల్), ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుల అభివృద్ధి పనులు వేగవంతమయ్యే అవకాశం ఉంది. -
నేరేడ్మెట్లో మేధా హాస్పిటల్ డాక్టర్ల నిర్లక్ష్యం
-
వడ్డీకి ఎగనామం!
పంట రుణాలపై రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం సాక్షి, హైదరాబాద్: ఏడాదికిపైగా పంట రుణాలకు సంబంధించిన వడ్డీ చెల్లించకుండా మొం డికేసిన రాష్ట్ర సర్కారు మరోసారి అదే పం థాను ఎంచుకుంది! తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో వడ్డీ లేని రుణాలకు రూ.150 కోట్లే కేటాయించింది. దీంతో కరువు కాలంలో రైతులకు పంట రుణాల పంపిణీ ప్రశ్నార్థకమైంది. గతేడాది పంట రుణాల వడ్డీకి సంబంధించి ప్రభుత్వం బ్యాంకులకు రూ.250 కోట్లకుపైగా బాకీ పడింది. పాత బకాయిలను పక్కనపెట్టినా.. 2015-16 వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం ప్రకారం ఈ ఏడాది పంట రుణాలపై వడ్డీ చెల్లింపులకు కనీసం రూ.500 కోట్లు కావాలి. కానీ అదేమీ పట్టించుకోకుండా అందులో మూడో వంతు కంటే తక్కువగా బడ్జెట్ కేటాయింపులుండటం విస్మయపరుస్తోంది. నిరుటి నుంచి నిర్లక్ష్యం రాష్ట్రంలో వడ్డీ లేని పంటరుణాల పథకం కింద దాదాపు 30 లక్షల మందికి పైగా రైతులు లబ్ధి పొందుతున్నారు. ఈ పథకం ప్రకారం రైతులు తీసుకున్న పంట రుణాలపై చెల్లించాల్సిన 7% వడ్డీలో కేంద్రం 3%, రాష్ట్ర ప్రభుత్వం మిగతా నాలుగు శాతం బ్యాంకులకు చెల్లిస్తాయి. కానీ నిరుటి నుంచి ఈ వడ్డీ చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నిబంధనల ప్రకారం బ్యాంకులు క్లెయిమ్ చేసిన మూడో రోజున ప్రభుత్వం ఆ నిధులు రీయింబర్స్ చేయాలి. కేంద్రం ఎప్పటికప్పుడు తన వాటాను విడుదల చేస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు మొండిచేయి చూపిస్తోంది. గతేడాది దాదాపు రూ.250 కోట్లు బాకీ పడింది. వడ్డీ సొమ్ము చెల్లించాలని బ్యాంకులు వరుసగా లేఖలు రాసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో బ్యాంకర్లు రైతులకు రుణాలివ్వకుండా తిప్పుకుంటున్నారు. రుణం పెరిగితే వడ్డీ పెరగదా? ఈ ఏడాది పంట రుణాల పంపిణీ లక్ష్యం ఎంతో ప్రభుత్వానికి తెలియంది కాదు! రైతుల ప్రయోజనాల దృష్ట్యా బడ్జెట్లో స్పష్టమైన అంచనాలు, కనీసం దరిదాపు కేటాయింపులు చేసుకోవటం తప్పనిసరి. కానీ అవేమీ పట్టిం చుకోకుండా వడ్డీకి నామమాత్రంగా విదిలింపులు చేయటం గమనార్హం. దీంతో పంట రుణాల పంపిణీకి చిక్కులు తలెత్తనున్నాయి. గతేడాది రూ.18,420 కోట్ల పంట రుణాలు పంపిణీ చేయగా.. 2015-16 వార్షిక రుణ ప్రణాళిక ప్రకారం ఈ ఏడాది రూ.27,799 కోట్ల రుణాలు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇం దులో రూ.25 వేల కోట్ల మేరకు లక్ష్యం నెరవేరుతుందని అంచనా వేసినా.. అదే స్థాయిలో వడ్డీ పెరుగుతుంది. గడువులోగా పంట రుణాలు తిరిగి చెల్లించిన వారికే వడ్డీ లేని రుణ పథకం వర్తిస్తుంది. ఈ నిబంధన పరిధిలో అర్హత పొందే రుణ మొత్తం 50 శాతానికి మించదని అంచనా వేస్తోంది. ఈ లెక్కన దాదాపు రూ.12,500 కోట్లకు వడ్డీ చెల్లించటం తప్పనిసరి. అందులో 4% (రూ.500 కోట్లు) రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు తన వాటాగా రీయింబర్స్ చేయాల్సి ఉంటుంది. కానీ బడ్జెట్లో తూతూ మంత్రంగా రూ.150 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారు. రబీ రుణాలపై ప్రభావం రాష్ట్ర సర్కారు తీరు రబీ రుణాల పంపిణీపై ప్రభావం చూపుతోంది. పంట రుణాల పంపిణీకి బ్యాంకులు నిరాసక్తత ప్రదర్శిస్తున్నాయి. రుణాల కోసం వచ్చే రైతులను బ్యాంకులు రకరకాల కుంటిసాకులతో తిప్పి పంపుతున్నాయి. కరువు దుర్భిక్ష పరిస్థితులకు తోడు బ్యాంకర్ల వైఖరి రైతులకు అశనిపాతంగా మారింది. బ్యాంకు రుణాలకు నోచుకోని రైతులు పెట్టుబడుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. వార్షిక రుణ ప్రణాళిక ప్రకారం రూ.27,799 కోట్ల పంట రుణాలు పంపిణీ చేయాల్సి ఉంటే ఇప్పటివరకు రూ.18 వేల కోట్ల రుణ పంపిణీ జరిగింది. ఖరీఫ్‌లో రూ.18,092 కోట్ల పంట రుణ లక్ష్యం కాగా.. రూ. 12,938 కోట్లు ఇచ్చారు. రబీ పంట రుణ లక్ష్యం రూ.9,707 కోట్లు కాగా.. రూ.5 వేల కోట్లు దాటలేదు. రబీ పంట రుణాల పంపిణీ ఇంచుమించు సగానికే ఆగిపోవడం గమనార్హం. -
‘బంగారు తల్లి’ కంటతడి
కర్నూలు(అగ్రికల్చర్): కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం 2013 మే నెలలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బంగారు తల్లి పథకాన్ని తెలుగుదేశం ప్రభుత్వం దాదాపుగా పక్కనబెట్టింది. బంగారుతల్లి పథకానికి మా ఇంటి మహాలక్ష్మి అనే పేరును జోడించినా అమలులో మాత్రం నిర్లక్ష్యం చూపుతోంది. 2013 మే నెల ఒకటి నుంచి ఈ పథకం అమలులోకి వచ్చింది. ఆసుపత్రిలో కాన్పు అయితే ప్రోత్సాహకంగా రూ.2500 తల్లి ఖాతాలో జమచేస్తారు. మొదటి ఏడాది వ్యాధి నిరోధక టీకాలన్నింటినీ సక్రమంగా వేయిస్తే రెండవ ఏడాది ప్రోత్సాహకంగా రూ.1000 జమ కావాల్సి ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి నెల వరకు తల్లుల ఖాతాలకు రూ.2500 ప్రకారం జమ అవుతూ వచ్చాయి. సాధారణ ఎన్నికల కోడ్ రావడంతో మార్చి నుండి జమలు నిలిచిపోయాయి. 2014 మే నెల 1వ తేదీతో సంవత్సరం గడచిపోయినా ఇంతవరకు ఒక్కరికి కూడా రెండవ సంవత్సరంలో జమ కావాల్సిన నగదు జమకాలేదు. మొత్తంగా చూస్తే నవంబర్ 1వ తేదీ వరకు బంగారు తల్లి పథకం కింద 18371 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వీరిలో 6781 మందికి రూ.2500 జమ అయింది. ఇంకా 11590 మందికి ఈ మొత్తం జమ కావాల్సి ఉంది. అలాగే సర్టిఫికెట్లు వచ్చింది మాత్రం 3200 మందికే. సర్టిఫికెట్ వస్తేనే బంగారుతల్లి పథకం కింద నమోదు అయినట్లుగా నిర్ధారణ అవుతుంది. అరుునా ప్రభుత్వం పట్టించుకోలేదు. పలువురు సర్టిఫికెట్ల కోసం తిరుగుతున్నా అధికారులు పెద్దగా స్పందించడంలేదు. గత ప్రభుత్వం చేపట్టిన దానిని తామెందుకు ముందుకు తీసుకెళ్లాలని పాలకులు భావిస్తున్నట్లు సమాచారం. మొదటి స్థానంలో బేతంచెర్ల బంగారుతల్లి పథకం కింద రిజిస్ట్రేషన్లలో బేతంచెర్ల మండలం జిల్లా మొదటి స్థానంలో ఉంది. ఈ మండలంలో కేవలం 138 మందికి రూ.2500 జమ అయ్యాయి. పత్తికొండ మండలంలో 557 రిజిస్ట్రేషన్లు అయి రెండవ స్థానంలో ఉన్నా కేవలం 92 మందికి మాత్రమే కాన్పు ప్రోత్సాహకాలు జమ అయ్యాయి. ప్యాపిలి, ఆస్పరి, ఆదోని, గోనెగండ్ల మండలాల్లో కూడా రిజిస్ట్రేషన్లు ఎక్కువగా ఉన్నాయి. మొదటి రెండు కాన్పుల వరకు బంగారుతల్లి పథకం కింద నమోదయ్యే అవకాశం ఉండడంతో ఇటీవల వరకు ఆడ పిల్లలు కలిగిన దంపతులు ఈ పథకం కింద రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ఆసక్తి చూపేవారు. తెలుగుదేశం ప్రభుత్వం ఈ పథకాన్ని పట్టించుకోకపోవడంతో ఇటీవలి కాలంలో రిజిస్ట్రేషన్లు తగ్గినట్లు తెలుస్తోంది. డిగ్రీ వరకు చదువులో రాణిస్తే వివాహ సమయానికి రూ.2.16 లక్షలు సంబంధిత కుటుంబానికి చేరుతాయి. బంగారుతల్లి ఉద్దేశం మంచిదే అయినా ప్రభుత్వం దీని అమలుపై చొరవ తీసుకోకపోవడం వల్ల వేలాది మంది నిరుత్సాహానికి గురవుతున్నారు. బంగారుతల్లి పథకాన్ని యథావిధిగా అమలు చేయాలని కోరుతున్నారు. -
మృత్యు ఘోష
టిప్పర్‌ను ఢీకొన్న కేఎస్ ఆర్టీసీ బస్సు 14 మంది మృతి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం నిబంధనలు అతిక్రమించి ఓవర్టెక్కు యత్నం ముళబాగలు : ఏడు కొండల వాడి దర్శనానికి కొందరు, సొంత ఊర్లకు మరి కొందరు...ఇలా ప్రయాణమైన వారిలో 14 మంది అసువులు బాశారు. కోలారు జిల్లా ముళబాగలు తాలూకా శ్రీరంగపుర గేట్ వద్ద సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. తుమకూరు డిపోకు చెందిన కేఎస్ఆర్టీసీ బస్సు బెంగళూరు నుంచి మొత్తం 31 మందితో బయలుదేరింది. ముళబాగలు వద్ద ప్రస్తుతం నాలుగు లేన్ల రహదారి పనులు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఓ వైపు రోడ్డు పనులు జరుగుతుండగా, మరో మార్గంలో అటు, ఇటు వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. ఆర్టీసీ బస్సు ఈ మార్గంలో వెళుతూ, ముందుగా పోతున్న ఇసుక టిప్పర్‌ను ఓవర్ టేక్ చేయబోయింది. అయితే కుడి వైపు నుంచి కాకుండా ఎడమ వైపు నుంచి ఓవర్ టేక్ చేయడంతో ఇరుకైన రోడ్డులో బస్సు కుడి భాగం టిప్పర్‌ను వేగంగా రాసుకుంటూ పోయింది. దీంతో ఆ భాగమంతా చీల్చుకుపోయింది. అటు వైపు కూర్చున్న వారిలో ఐదుగురు మహిళలు, ఓ పదేళ్ల బాలుడితో పాటు ముగ్గురు పురుషులు అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన 15 మందిని కోలారులోని దేవరాజ్ అర్స్ వైద్య కళాశాలకు తరలించగా, చికిత్స పొందుతూ సాయంత్రం ఐదుగురు మరణించారు. బస్సు తుమకూరు డిపోదైనప్పటికీ, ఆ పట్టణానికి చెందిన వారెవరూ అందులో లేరు. బెంగళూరులో తిరుపతికి 15 మంది, చిత్తూరుకు ఆరుగురు, పలమనేరుకు నలుగురు టికెట్లు తీసుకున్నారని కండక్టర్ నరసింహమూర్తి తెలిపారు. స్వల్ప గాయాలతో అతను ముళబాగలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బెంగళూరులోని హెబ్బాళకు చెందిన సోమశేఖర్, భార్య, మనవడితో కలసి ప్రయాణించారు. తన భర్తకు ఏమైందో తెలియడం లేదని, తన మనవడు మాత్రం ఒకసారి ఫోనులో మాట్లాడాడని గృహిణి చెప్పారు. బస్సులో ఇంకా గౌరిబిదనూరుకు చెందిన లక్ష్మీపతి, సుబ్రమణ్యచారి, పలమనేరుకు చెందిన అమల ఉన్నారు. వారంతా సురక్షితంగా బయటపడ్డారు. మృతులు కోలారుకు చెందిన నాగేశ్ (35), బెంగళూరులోని కోడిహళ్లికి చెందిన నాగమణి (50), బెంగళూరుకు చెందిన నారాయణమ్మ, భారతి బ్రహ్మచారి (35), పలమనేరుకు చెందిన రాజశేఖర్ (35), లిఖిత్ కుమార్ (3), తుమకూరుకు చెందిన డ్రైవర్ గంగాధరయ్య (50), ముళబాగలుకు చెందిన విజయమ్మ (55) మృతుల్లో ఉన్నారు. ఇంకా ఐదు మృత దేహాలను గుర్తించాల్సి ఉంది.