
సాక్షి, గుంటూరు: పులిచింతల స్టాప్ లాక్ గేటు ఏర్పాటు పనులు శరవేగంగా సాగుతున్నాయని ఈఎన్‌సీ నారాయణరెడ్డి తెలిపారు. సాయంత్రానికి స్టాప్ లాక్ గేటు ఏర్పాటు పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. స్టాప్ లాక్ గేటు పూర్తికాగానే రిజర్వాయర్ నింపుతామన్నారు. పులిచింతల ఘటనపై అధ్యయనానికి నిపుణుల కమిటీ నియమించామని, వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని తెలిపారు. కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఈఎన్‌సీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment