సాక్షి, తెనాలి : తెనాలి ప్రాంతమే కాదు, కృష్ణా డెల్టాకు చిరకాలంగా కలగా మిగిలిపోయి, టీడీపీ పాలకులు పునాదిరాళ్లకే పరిమితం చేసిన పులిచింతల రిజర్వాయరుకు 2004 అక్టోబర్‌లో వైఎస్ శంకుస్థాపన చేశారు. అదే రోజు తెనాలి బహిరంగసభలో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుతో కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను అందిస్తానని చెప్పారు. ఆ ప్రకారం పులిచింతల, పోలవరం ప్రాజెక్టులను పనులు చకచకా ఆరంభించి చిత్తశుద్ధి చాటుకున్నారు. కృష్ణా పశ్చిమ డెల్టాలో రబీలో విస్తారంగా పెరుగుతూ వచ్చిన మొక్కజొన్నకు, ఏప్రిల్ ఆఖరు వరకు పంట కాలువల ద్వారా నీటిని సరఫరా చేశారు.
కోరిన వరాలనిచ్చిన ప్రజాబంధువు..
గుంటూరు–హనుమాన్‌పాలెం డబుల్ లైన్ రహదారి, కొల్లిపర గ్రావుం నుంచి కృష్ణా కరకట్ట వరకు రెండులైన్ల సిమెంటు రోడ్డు, రూ.117 కోట్ల వ్యయంతో కృష్ణా కుడి వరద కట్ట విస్తరణ, మున్నంగిలో 33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌తో సహా వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులను నిర్వహించారు. గొడవర్రు వద్ద బ్యాంక్ కెనాల్‌పై బల్లకట్టు మునిగి 14 మంది చనిపోతే కృష్ణా పశ్చిమ మెయిన్ కెనాల్, రేపల్లె బ్యాంక్ కెనాల్‌పై 25 చోట్ల కాలిబాట వంతెనలు నిర్మించారు.
భారీ పథకాలతో భరోసా...
తెనాలిలో నిర్మించిన రాజీవ్ గృహకల్ప సముదాయాలను వైఎస్ స్వయంగా ప్రారంభించారు. అప్పుడే పట్టణం మెుత్తానికి రక్షిత మంచినీటి కోసం ఉద్దేశించిన రూ.93 కోట్ల కృష్ణా జలాల పథకానికి శంకుస్థాపన చేశారు.
- పట్టణంలోని యడ్ల లింగయ్యకాలనీలో అగ్ని ప్రమాదం కారణంగా ఇళ్లు కోల్పోయిన బాధితులకు నూరు శాతం పక్కాగృహాలను నిర్మించారు.
- చంద్రబాబునాయుడు పేరుతో ఉన్న మరో కాలనీలో మురుగు కాలువల నిర్మాణానికి రూ.30 లక్షల నిధులను మంజూరు చేశారు.
- కళాకారులకు ప్రభుత్వ పింఛన్‌ను రూ.200 నుంచి రూ. 500లకు పెంచి, అప్పటికి 21 నెలల బకాయిలను చెల్లించారు. కొ త్తగా మరో ఏడువేల మందికి ఇచ్చిన పింఛన్ల లో యాభైమందికి పైగా తెనాలి కళాకారులకు దక్కాయి.
Comments
Please login to add a commentAdd a comment