ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 కేంద్ర బడ్జెట్‌లో 'ఫేమ్' (FAME) స్కీమ్ గురించి ఎటువంటి ప్రస్తావన చేయలేదు. అయితే కేంద్ర బడ్జెట్‌కు ముందు, భారీ పరిశ్రమల మంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఫేమ్ 3 పథకం ప్రణాళికలు చివరి దశలో ఉన్నాయని, వాటిని అమలు చేస్తామని వెల్లడించారు.
ఫేమ్ 3 ప్రారంభించే ప్రణాళికల గురించి భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ వివరిస్తూ.. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి అమలులో ఉన్న వివిధ పథకాలను ప్రస్తావించారు. కానీ ఫేమ్ 3 గురించి ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అయితే దీనిని త్వరలోనే అమలు చేసే అవకాశం ఉందని పలువురు నిపుణులు భావిస్తున్నారు.
ఫేమ్ 3 కింద ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రతిష్టాత్మకమైన లక్ష్యాలకు అనుగుణంగా ప్రభుత్వం రూ. 10 వేల కోట్ల నుంచి రూ. 20 వేల కోట్ల వ్యయాన్ని పరిగణించాలని మొబిలిటీ మేనేజింగ్ పార్టనర్ ఆర్యమాన్ టాండన్ అన్నారు.
2024-25 బడ్జెట్‌లో ఫేమ్-3 స్కీమ్ ప్రస్తావన లేకపోవడం పరిశ్రమలోని చాలా మంది వాటాదారులకు నిరాశ కలిగించింది. కానీ ప్రభుత్వం ప్రోత్సాహాలను అందిస్తే రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గుతాయని డెలాయిట్ ఇండియా కన్సల్టింగ్ భాగస్వామి రజత్ మహాజన్ అన్నారు.
ప్రభుత్వ ప్రోత్సాహకాల ఆధారంగా ఈవీల విక్రయాలు ఉంటాయి. అంతే కాకుండా దేశంలో మరిన్ని ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయాలని, అప్పుడే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఫేమ్ 3 కింద బెనిఫీట్స్ అందిస్తాయనే విషయం తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment