బీట్‌రూట్ రసంతో బీపీ దూరం.. | BP distance with beetroot juice | Sakshi
Sakshi News home page

బీట్‌రూట్ రసంతో బీపీ దూరం..

Published Thu, May 14 2015 11:53 PM | Last Updated on Sun, Sep 3 2017 2:02 AM

బీట్‌రూట్ రసంతో బీపీ దూరం..

బీట్‌రూట్ రసంతో బీపీ దూరం..

బీట్‌రూట్ తరచుగా వాడే కూరగాయల్లో ఒకటి. దీనిని వండి తినడం కంటే, నేరుగా తినడమే మేలని నిపుణులు చెబుతున్నారు.

బీట్‌రూట్ తరచుగా వాడే కూరగాయల్లో ఒకటి. దీనిని వండి తినడం కంటే, నేరుగా తినడమే మేలని నిపుణులు చెబుతున్నారు. పచ్చిముక్కలను తినడం కష్టమనుకుంటే, చక్కగా జ్యూస్ తయారు చేసుకొని తాగొచ్చు. బీట్‌రూట్ రసం తాగడం వల్ల రక్తపోటు అదుపులోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ప్రతిరోజూ ఎనిమిది ఔన్సుల చొప్పున బీట్‌రూట్ రసం తాగిన వారిలో రక్తపోటు గణనీయంగా అదుపులోకి వచ్చినట్లు ‘హైపర్ టెన్షన్’ జర్నల్ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో తేలింది. బీట్‌రూట్‌లో ఉండే నైట్రేట్లు రక్తనాళాలను వ్యాకోచింపజేస్తాయని, వాటి ఫలితంగానే రక్తపోటు క్రమంగా అదుపులోకి వస్తుందని నిపుణులు వివరిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement