గుండె జబ్బులు వచ్చేది ఆ బ్లడ్‌ గ్రూప్‌ వాళ్లకే..! | What Diseases Are Linked To Blood Type | Sakshi
Sakshi News home page

గుండె జబ్బులు వచ్చేది ఆ బ్లడ్‌ గ్రూప్‌ వాళ్లకే..!

Published Mon, Sep 16 2024 2:25 PM | Last Updated on Mon, Sep 16 2024 2:26 PM

What Diseases Are Linked To Blood Type

రక్తంలో పలు రకాల గ్రూప్‌లు ఉంటాయని అందరికీ తెలిసిందే. ఇలా మొత్తం ఎనిమిది రకాల బ్లడ్‌​ గ్రూప్‌లు ఉంటాయి. దాన్ని అనుసరించే ఎవరికైన రక్తదానం చేయడం వంటివి చేస్తాం . అయితే బ్లడ్‌ గ్రూప్‌ని బట్టి వచ్చే అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయని చెబుతున్నారు వైద్య నిపుణులు. మరీ బ్లడ్‌ గ్రూప్‌ని బట్టి ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో సవివరంగా చూద్దామా..!

గుండె సమస్యలు వచ్చే ప్రమాదం..
ఈ రోజుల్లో చాలా మందికి గుండెజబ్బుల బారినపడుతున్నారు. అయితే ఓ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్లకి గుండెపోటు వచ్చే ప్రమాదాలు చాలా తక్కువగా ఉంటాయట. మిగతా బ్లడ్ గ్రూప్లు ఏ, బీ, ఏబీ వాళ్లకి కొరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువని చెబుతున్నారు నిపుణులు. అయితే ఓ బ్లడ్‌ గ్రూప్‌ వాళ్లకి ఎక్కువగా కొలెస్ట్రాల్, కడుపు సంబంధిత సమస్యలు ఉంటాయని తెలిపారు.

పెప్టిక్ అల్సర్..
ఆప్టికల్చర్ అంటే కడుపులో లేదా పేగు లైనింగ్ దగ్గర వచ్చే చిన్న పుండు. అయితే ఇది ఎక్కువగా ఓ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్లకి వస్తుంది.

కేన్సర్
కేన్సర్ ఎక్కువగా ఏ,బీ, ఏమీ బ్లడ్ గ్రూప్‌ ఉన్నవాళ్లకి వస్తుంది. ముఖ్యంగా ఫైలోరీ ఇన్ఫెక్షన్ ఏ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లలో ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే పెద్దపెద్ద కేన్సర్‌లు, ప్యాంక్రియాటిక్ కేన్సర్‌లు వచ్చే ప్రమాదం  ఏ బ్లడ్ గ్రూప్ వాళ్లకి ఎక్కువగా ఉంటుందట.

ఒత్తిడి
సాధారణంగా సమస్యలు వస్తే ఒత్తిడికి గురవుతారు. సమస్యను బట్టి కొందరు తీవ్రంగా ఒత్తిడికి గురవుతుంటారు. అయితే ఏ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లు చిన్న విషయానికి కూడా ఒత్తిడికి గురవుతారు.

వెయిన్స్‌ త్రాంబోఎంబోలిజం
కొంతమందికి కాళ్ల వేయిన్స్ లో రక్తం గడ్డ కడుతుంది. దీనినే వెయిన్స్‌ త్రాంబోఎంబోలిజం అంటారు. అయితే ఇది ఎక్కువగా ఏ, బీ, ఏబీ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లకి వస్తుంది. సకాలంలో చికిత్స తీసుకోకపోతే ఊపిరితిత్తులకు చేరే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మధుమేహ వ్యాధి..
ప్రస్తుతం చాలా మందికి మధుమేహం వస్తోంది. అయితే డయాబెటిస్‌ ఎక్కువగా ఏ, బీ బ్లడ్‌ గ్రూప్‌ ఉన్నవాళ్లకి వస్తుంది. అలాగే టైప్ 2 డయాబెటీస్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంది.
 

గమనిక: ఇది కేవలం అవగాహన కోసమే ఇచ్చిన కథనం మాత్రమే. పూర్తి వివరాలను కూలంకషంగా తెలుసుకుని వైద్యలు లేదా వ్యక్తిగత నిపుణుల సలహాల మేరకు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. 

(చదవండి: రైతాలో ఉల్లిపాయలు జోడించి తీసుకుంటున్నారా..!)
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement