మన భారతదేశంలో బియ్యమే ప్రధాన ఆహారం. ఎన్ని వెరైటీ టిఫిన్లు తిన్నా.. నాలుగు మెతుకులు కడిపులో పడితేనే హాయిగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనకు మంచి శక్తినిచ్చి ఎక్కువ సేపు పనిచేయగలిగే సామర్థ్యాన్ని అందించేది బియ్యం మాత్రమే. అలాంటి బియ్యాన్ని వండటానికి ముందు తప్పనిసరిగా కడగాల్సిందేనా? మరి నిపుణులు ఏమంటున్నారు..?
ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలకు బియ్యమే ప్రధాన ఆహారం. ఆరోగ్య ప్రయోజనాలతో నిండిన మంచి ఆహారం. కార్బోహైడ్రైట్లకు మూలం. పైగా శరీరానికి తక్షణ శక్తి ఇచ్చే పౌష్టికమైన ఆహారం కూడా. మనల్ని శక్తిమంతంగా ఉండేలా చేసేది, చక్కగా ఫిట్‌నెస్‌పై దృష్టిసారించి కసరత్తులు చేయడానికి తోడ్పడేది అయిన బియ్యంలో మెగ్నీషియం, సెలీనియం, మాంగనీస్, ఫైబర్, బీ విటమిన్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. అలాంటి బియ్యాన్ని వండడానికి ముందు కడగడం అవసరమా అంటే..?
ఎందుకు కడగాలంటే..
- నిపుణులు తప్పనిసరిగా బియ్యాన్ని వండటానికి ముందు కడగాల్సిందేనని చెబుతున్నారు. ఆర్సెనిక్ వంటి విష పదార్థాలు ఉంటాయని, అందువల్ల కడగాలని తెలిపారు. నానాబెట్టి కడగడం ఇంకా మంచిదని, దీనివల్ల ఆ బియ్యంలో ఉన్న ఆర్సెనిక్, మట్టి వంటివి నీటిలో కరిగి సులభంగా కరిగి బయటకి వెళ్లిపోతాయని అన్నారు.
- ఇలా చేస్తే ఆరోగ్యానికి హాని కలిగించే ధూళి, గులకరాళ్లు, మిగిలిపోయిన శిథిలాలు వంటి అవాంఛనీయ పదార్థాలు ఏమైనా ఉన్నా కడగడం వల్ల నీళ్ల ద్వారా బయటకు వెళ్లిపోయి బియ్యం చక్కగా క్లీన్ అవుతాయని పేర్కొన్నారు.
- ఇలా కడిగితే ఆ బియ్యంపై ఉండే పిండిలాంటి పదార్థం బయటకు పోయి అన్నం చక్కగా అతుక్కోకుండా పొడిపొడిగా ఉటుందని చెప్పారు.
- అలాగే ఇలా వాష్ చేస్తే మైక్రో ప్లాస్టిక్‌లను ఈజీగా తొలగించగలమని అన్నారు.
- ముఖ్యంగా పారిశ్రామిక వ్యర్థాలు, మైనింగ్ కార్యకలాపాలు, బొగ్గును కాల్చడం వంటి వాటివల్ల భూగర్భజలాల్లోకి ఆర్సెనిక్ సులభంగా ప్రవేశిస్తుంది. పలితంగా భారీగా నీటి కాలుష్యం ఏర్పడుతుంది. అక్కడ నుంచి ఆ నీరు కాస్త పంట నీటి పారుదలకు, వంట కోసం ఉపయోగించే వాటిలోకి సరఫరా అవుతుంది.
- అందులోనూ వరి మరీ ఎక్కువగా ఆర్సెనిక్ కలుషితానికి గురవ్వుతుంది. ఎందుకంటే..? వరిపోలాలకు నీటి అవసరం ఎక్కువ, పైగా వరదల టైంలో ముంపునకు గురవ్వుతాయి కూడా. అలా.. ఈ ఆర్సెనిక్ వాటిలో ఎక్కువగా ఉంటుంది.
ఆర్సెనిక్ వల్ల వచ్చే సమస్యలు
- ఎరుపు లేదా వాపు చర్మం
- కొత్త మొటిమలు లేదా గాయాలు
- పొత్తికడుపు నొప్పి
- వికారం, వాంతులు
- అతిసారం
- అసాధారణ గుండె లయ
- కండరాల తిమ్మిరి
- వేళ్లు, కాలి జలదరింపు
- చర్మం నల్లబడటం
- గొంతు నొప్పి
- నిరంతర జీర్ణ సమస్యలు మొదలైనవి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, దీర్ఘకాలిక లక్షణాలు మొదట చర్మంపై కనిపిస్తాయి. ఆ తర్వాత ఇలా బహిర్గతం అయిన ఐదు ఏళ్లలోపు అందుకు సంబంధించిన కేసులు, మరణాలు నమోదవ్వుతాయి. అందువల్ల ఆరోగ్యకరమైన, రుచికరమైన అన్నం తినాలనుకుంటే బియ్యాన్ని తప్పనిసరిగా శభ్రంగా కడగాలని నిపుణులు చెబుతున్నారు.
గుర్తుంచుకోవలసిన విషయాలు..
- ఆరోగ్యకరమైన, రుచికరమైన అన్నం తయారీకి గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా డయాబెటిస్ రోగులు వంటి వారు గ్లూకోజ్ కంటెంట్ తక్కువగా ఉండాలనుకుంటే.. నానాబెట్టి చక్కగా కడిగి వండుకోవాలని సూచిస్తున్నారు.
- బరువు తగ్గాలనుకునేవారు బ్రౌన్ రైస్ వంటి వాటిని తినండి. బ్రౌన్‌రైస్ వైట్‌రైస్ కంటే ఎక్కువ ఫైబర్, ప్రోటీన్‌లను కలిగి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment