చక్కగా కూర్చొని ఆహారం తింటుంటే హాయిగా ఉంటుంది. ఇప్పుడూ ఈ ఉరుకులు పరుగులు జీవన విధానంలో చాలామంది నిలబడి గబగబ తినేసి భోజనం కానిచ్చాం అన్నట్లుగా తింటున్నారు. అంతెందుకు పెళ్లిళ్లలో కూడా బఫే పేరుతో నిలబడి తినడమే. కొన్ని హోటల్స్, రెస్టారెంట్లలోనూ ఇదే తీరు. ఇంతకీ ఇలా తినడం మంచిదేనా? అంటే..ముమ్మాటికి కాదనే చెబుతున్నారు పరిశోధకులు. తాజా అధ్యయనంలో ఈ విషయమై పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
నిలబడి తింటే..
నిలబడి తినడం వల్ల వేగంగా జీర్ణమయ్యి, కొవ్వు తగ్గడం జరుగుతుందని చెబుతున్నారు పరిశోధకులు. అయితే ఇది ఒక్కోసారి పొట్ట ఉబ్బరాన్ని కలిగించి ఆకలిని పెంచుతుందని చెబుతున్నారు. అంతేగాదు ఇటీవల చాలామంది టైం ఆదా అవుతుందనే ఉద్దేశ్యంతో నిలబడి ఏదో కానిచ్చాం అన్నట్లు భోజనం చేస్తుంటారు. ఇది జీర్ణక్రియకు హానికరం అని, అతిగా తినేందుకు దారితీస్తుందని నొక్కి చెబుతున్నారు పరిశోధకులు. గురత్వాకర్షణ కారణం కడుపులోని ఆహరం వేగంగా ప్రేగుల్లో కదులి, త్వరగా జీర్ణమయ్యిపోతుంది. ఫలితంగా అతి ఆకలికి దారితీస్తుందని తెలిపారు.
చాలామంది నిలబడి తినడం వల్ల బరువు తగొచ్చని భావిస్తుంటారు. కానీ దీని వల్ల బరువు తగ్గడం అటుంచి శరీరానికి అవసరమయ్యే కొవ్వుల, నష్టం, పోషకాల నష్టం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. అంతేగాదు ఇలా నిలబడి తింటే ఆహారం టేస్టీగా అనిపించదట. అదీగాక వాళ్లు కూడా ఆటోమేటిగ్గా రచి తక్కువ ఉన్న ఆహారపదార్థాలను ఇష్టపడతారని చెబుతున్నారు. ఎందుకంటే నిలబడి తింటున్నప్పుడూ నాలుకపై ఉండే టేస్ట్ బడ్స్ ముడుచుకుపోతాయని తెలిపారు. ఇందుకోసం సుమారు 30 మంది వ్యక్తులను తీసుకుని అధ్యయనం చేయగా నిలబడి తిన్న వాళ్లలో బరువు కోల్పోడమే గాక టేస్టీగా ఉన్న ఆహారాన్ని తినకపోవడాన్ని గుర్తించామని చెప్పారు.
కూర్చొని తినడం..
మీరు తినేటప్పుడు అనుసరించే భంగిమ మీ ఆహారాన్ని జీర్ణం చేసే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు పరిశోధకులు. ఒక వ్యక్తి కూర్చొన్నప్పుడు కడుపులోని ఆహారం నెమ్మదిగా ఖాళీ అవుతుందని అన్నారు. నిలబడి భోజనం చేసిన దానికంటే నెమ్మదిగా జీర్ణం అవుతుందని అన్నారు. అలాగే శరీరం ప్రోటీన్‌లు గ్రహించేలా మంచిగా జీర్ణం అవుతుంది. అంతేగాక రక్తానికి అవసరమయ్యే అమైనో ఆమ్లాల లభ్యత కూడా పెరుగుతుందని చెబుతున్నారు.
ఇక కూర్చొని తినడం వల్ల టేస్టీగా ఉన్న ఆహారాన్నే తీసుకుంటారు. పైగా నిలబడి తిన్నప్పటి కంటే కూర్చొని భోజనం చేసినప్పుడూ ఆహారం టేస్టీగా అనిపిస్తుందట కూడా. తక్కువ ఆకలి ఉంటుంది. నిండుగా ఉన్న ఫీల్ కలుగుతుందని చెబుతున్నారు పరిశోధుకులు. అధ్యయనంలో పాల్గొన్న సగం మందిలో.. కూర్చొన తిన్న వారిలో జీర్ణ సంబధ సమస్యలు లేకపోవడమే గాక బరువు అదుపులో ఉన్నట్లు తెలిపారు. పైగా నిలబడిన వారితో పోలిస్తే టేస్టీగా ఉండే భోజనాన్నే ఇష్టపడినట్లు గుర్తించామని అన్నారు.
ఏదీ బెటర్ అంటే..
కూర్చొని తినే భంగిమే ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు నిపుణులు. కూర్చొవడం అంటే..డైనింగ్ టేబుల్స్ మీద కాదు. నేల మీద నిటారుగా కూర్చొని భోజనం చేస్తేనే సత్ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. ఎందుకంటే గూని లేకుండా నిటారుగా కూర్చొని తినడం వల్ల కడుపులోంచి ఆహరం ప్రేగుల్లోకి నెట్టడానికి అనుమతిస్తుంది. అలాగే ఉక్కిరిబిక్కిరి అయ్యే అవకాశం తగ్గుతుందని చెప్పారు. నిజానికి ఇది భారతీయ సంప్రదాయంలో అనాదిగా వస్తున్న భోజన సాంప్రదాయం కూడా ఇదే.
ఇక నిలబడినప్పుడు త్వరితగతిన ఆహారం విచ్ఛిన్న అయ్యి కాలక్రమేణ కొవ్వులు నష్టానికి దారితీస్తుందని పరిశోధనలో తేలిందన్నారు పరిశోధకులు. అలాగే టేస్టీగా తినాలనుకుంటే కూర్చొని హాయిగా భోజనాన్ని ఆస్వాదిస్తూ తినడం మంచిదని వెల్లడించారు యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా శాస్త్రవేత్తల బృందం. ఈ అధ్యయనం జర్నల్ ఆఫ్ కంజ్యూమర్ రీసెర్చ్‌లో ప్రచురితమయ్యింది.
(చదవండి: నటి విద్యాబాలన్ ఫాలో అయ్యే "నో రా డైట్" అంటే..!)
Comments
Please login to add a commentAdd a comment