భగవాన్ రామ్‌లల్లా నూతన రామాలయంలో కొలువైన దరిమిలా రామనగరిలో ప్రతి క్షణం ఉత్సాహం కనిపిస్తోంది. దాదాపు 500 ఏళ్ల పోరాటం తర్వాత రామాలయం రూపుదిద్దుకుంది. దీంతో బాలరాముడు తన జన్మ స్థలంలో భక్తులకు దర్శనం ఇస్తున్నాడు.
ఇకపై ప్రతి పండుగను అయోధ్యలో ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కోవలో అయోధ్యలో 500 ఏళ్ల తరువాత హోలీ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ హోలీ చారిత్రాత్మకంగా నిలిచిపోనుంది. ఈనెల 25న జరగబోయే హోలీ వేడుకలకు రామాలయం ముస్తాబవుతోంది. రామ భక్తులు ఆరోజు బాలరామునితో హోలీ వేడుకలు చేసుకోనున్నారు. హోలీ నాడు 56 వంటకాలను బాలరామునికి నైవేద్యంగా సమర్పించనున్నారు. అలాగే ఆరోజున ఇక్కడికి వచ్చే భక్తులందరికీ ప్రసాద వితరణ చేయనున్నారు.
రామమందిరం ట్రస్ట్ కార్యాలయ ఇన్‌చార్జి ప్రకాష్ గుప్తా మీడియాతో మాట్లాడుతూ ఇకపై హోలీ వేడుకలు రాముని ఆస్థానంలో జరగనున్నాయని, ఈ నేపధ్యంలో అయోధ్య అంతటా ఆనందం నెలకొన్నదన్నారు. ఇందుకోసం రామమందిర ట్రస్ట్ సన్నాహాలు చేస్తున్నదన్నారు. హోలీ వేడుకల సందర్భంగా అయోధ్యలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment