కారులో ఆసుపత్రికి వెళుతున్న చిన్నారులు (ఇన్‌సెట్) బాసుంది బాక్సు
అమరావతి, తాడేపల్లి రూరల్: బాసుంది తిని ఏడుగురు చిన్నారులు అస్వస్థతకు గురైన ఘటన జిల్లాలో జరిగింది. మండలంలోని చిర్రావూరు గ్రామానికి చెందిన రమేష్ తన ఇద్దరు పిల్లలను తీసుకొని దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో ఉన్న తన సోదరి ఇంటికి ఆదివారం వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో రమేష్ సోదరి తమ ఇంటి పక్కనే ఉన్న డెయిరీ పార్లర్ నుంచి బాసుంది 2 బాక్సులు కొని ఒకటిరమేష్‌కి ఇచ్చి, రెండోది తాను తీసుకెళ్లింది.
రమేష్ సోదరి పిల్లలు, వారి ఇంటి పక్క పిల్లలు నలుగురు రాత్రి బాసుంది తినగా అరగంట వ్యవధిలో విరోచనాలు, వాంతులు అవ్వడంతో వారిని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. రమేష్ తన ఇద్దరు పిల్లలతో పాటు పక్క ఇంట్లో పిల్లలకు కూడా ఇవ్వగా, వారికీ వాంతులు, విరోచనాలు అయ్యాయి. వెంటనే తన ఇద్దరు పిల్లలను, ఇంటి పక్క స్నేహితుడి పిల్లవాడిని తాడేపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువచ్చి, విషయాన్ని వివరించాడు. డాక్టర్ కిరణ్ ప్రథమ చికిత్స నిర్వహించి వారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment