చిన్నారులకు ప్రభుత్వ పరిహారం ధ్రువీకరణ పత్రాలు అందజేస్తున్న కలెక్టర్ ఇంతియాజ్
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): కరోనా మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన ముగ్గురు చిన్నారులకు ప్రభుత్వం అండగా నిలిచింది. ముగ్గురు చిన్నారులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించింది. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో చిన్నారులకు పరిహారం పత్రాలను కలెక్టర్ ఇంతియాజ్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బాపులపాడు, గుడివాడ మండలాలకు చెందిన కుమ్మరి సాయిగణేష్, కుమ్మరి నాగరవళి, పుట్ల తన్వీరేచల్‌లు కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలారని, జిల్లా కమిటీ వాస్తవాలను పరిశీలించిన అనంతరం ఈ ముగ్గురు చిన్నారులకు పరిహారం ప్రకటించడం జరిగిందన్నారు.
ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున ముగ్గురికి రూ.30 లక్షలు వారి బ్యాంకు ఖాతాలో జమ చేసి ధ్రువపత్రాలు అందించామన్నారు. పిల్లలకు 25 ఏళ్ల వయస్సు వచి్చన తర్వాత వారికి ఆ మొత్తాన్ని అందజేయడం జరుగుతుందన్నారు. అప్పటి వరకు లబి్ధదారుల అభ్యర్థన మేరకు నెలకొకసారి కానీ, మూడు నెలలకోసారి కానీ డిపాజిట్ సొమ్ముపై వచ్చే వడ్డీని బ్యాంకులు వారికి చెల్లిస్తాయని కలెక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం నలుగురు చిన్నారులకు పరిహారం అందించినట్లు చెప్పారు. మానవత్వంతో సాయమందిస్తున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి చిన్నారుల తరపు బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment