యూపీలోని ఆగ్రాలో ఒక విచిత్ర ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీనిని విన్నవారంతా కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఇక్కడి శంషాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఒక వివాహ వేడుకలో రసగుల్లా విషయమై ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కర్రలతో కొట్టుకునేంత వరకూ వివాదం దారితీసింది.
ఈ గొడవలో ఒక మహిళతో సహా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నయాబన్స్ రోడ్డు సమీపంలోని సంతోషి మాత దేవాలయం దగ్గర ఒక వివాహ వేడుకలో విందు జరిగింది. ఈ సందర్భంగా రసగుల్లా తినే విషయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అది పరస్పరం కొట్టుకునేవరకూ దారితీసిందని పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అనిల్ శర్మ తెలిపారు.
క్షతగాత్రులందరినీ వైద్య చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. విందు ఏర్పాటు చేసిన గౌరీశంకర్ శర్మపై కేసు నమోదు చేశామని, ఈ వివాదంపై విచారణ చేస్తున్నామన్నారు.
ఇది కూడా చదవండి: హిమాచల్‌లోనూ సొరంగ ప్రమాదం.. ఎప్పుడంటే..
Comments
Please login to add a commentAdd a comment