యావత్తు దేశం 77వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల్లో మునిగి తేలుతుంది. ఈ సెలవురోజును త్రివర్ణ రంగులతో కూడిని తీపి వంటకాలతో మరింత ఆనందంగా వేడుక చేసుకోండి. ఈ సందర్భంగా స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన ఓ ఐకానిక్ వంటకం గూర్చి తెలుసుకుందాం. దీన్ని వారణాసిలోని ఓ ప్రముఖ ఐకానిక్ షాప్ 1939లో తయారు చేసింది. ఆ షాపు వాళ్లు త్రివర్ణ రంగులతో కూడిన బర్ఫీ అనే స్వీట్‌ని దేశభక్తిని రగిల్చేందుకు తయారు చేశారు.
అది బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో కీలక పాత్ర పోషించిందట. దీంతో ఈ స్వీట్ స్వాతంత్య్ర పోరాటంలో ప్రతికగా నిలిచిన ఐకానిక్ వంటకంగా పేరుతెచ్చుకుంది. ఏకంగా వంటకాలతో కూడా బ్రిటీషర్లను గడగలాడించిన ఘనత మన భారతీయులదే. స్వేచ్ఛ కోసం పరితపించిన అలానాటి త్యాగధనులను స్మరించుకుంటూ.. ఈ త్రివర్ణ బర్ఫీ స్వీట్ తయారీ ఎలాగో తెలుసుకుందామా!.
తిరంగ్ బర్ఫీ తయారీ విధానం:
కావల్సిన పదార్థాలు:
పంచదార: వంద గ్రాములు
పాలు: రెండు లీటర్లు
యాలకుల పొడి - 5 గ్రా
నెయ్యి - 50 గ్రా
కుంకుమపువ్వు తగ్గింపు (కాషాయం రంగు కోసం)
బచ్చలికూర పేస్ట్ (ఆకుపచ్చ రంగు కోసం)
తయారీ విధానం: ఒక కడాయి తీసుకుని అందులో పాలు పంచాదార వేసి బాగా మరిగించాలి. సగం వరకు బాయిల్ అయ్యేలా నెమ్మదిగా కలుపుతూ ఉండాలి మిశ్రమం బాగా చిక్కబడుతుందనంగా యాలకుల పొడి వేయండి. ఆ తర్వత దించుకుని ఆ మిశ్రమాన్ని మూడు బాగాలుగా చేసుకుని ఒకదానిలో కుంకుమ పువ్వు రంగను మరొక దానిలో బచ్చలి కూర పేస్ట్‌ను వేయండి. ఇక మిగిలిన మూడో భాగం నెమ్మదిగా పరుచకుని దానిపై ఆ రెండు రంగుల భాగాలను పరుచుకోండి ఆ తర్వాత చక్కటి షేప్‌లో ముక్కలుగా కొయ్యండి. అంతే మదురమైన త్రివర్ణ బర్ఫీ రెడీ.
(చదవండి: వెదురుతో వండే కూర గురించి విన్నారా? దాని టేస్టే వేరు..!)
Comments
Please login to add a commentAdd a comment