Poha Kesari in Telugu: How to Make Atukula Kesari Recipe - Sakshi
Sakshi News home page

Recipe: నోరూరించే అటుకుల కేసరి.. ఇంట్లో ఇలా సులువుగా తయారు చేసుకోండి!

Published Mon, May 23 2022 2:00 PM | Last Updated on Mon, May 23 2022 3:19 PM

Recipes In Telugu: How To Make Atukula Kesari - Sakshi

Poha Kesari Recipe: రవ్వ కేసరి బోర్‌ కొడితే ఇలా అటుకుల కేసరి ట్రై చేయండి. ఘుమఘుమలాడే సువాసనను ఆస్వాదిస్తూ ఈ మిఠాయిని హాయిగా ఆరగించండి.

అటుకుల కేసరి తయారీకి కావలసినవి:
►అటుకులు – 1 కప్పు (పాత్రలో దోరగా వేయించి ఫ్రై చేసుకోవాలి)
►నెయ్యి – 7 టేబుల్‌ స్పూన్లు
►జీడిపప్పు, కిస్మిస్‌ – కొన్ని (నేతిలో దోరగా వేయించి పెట్టుకోవాలి)
►నీళ్లు – 1 కప్పు
►చిక్కటి పాలు – 2 కప్పులు
►పంచదార – ముప్పావు కప్పు
►ఏలకుల పొడి – కొద్దిగా
►ఫుడ్‌ కలర్‌ – ఆరెంజ్‌ కలర్‌

అటుకుల కేసరి తయారీ విధానం:
►ముందుగా చిన్న మంట మీద పెట్టుకుని, కళాయిలో 4 టేబుల్‌ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి.
►నెయ్యి కరిగిన తర్వాత, అటుకుల పొడి వేసుకుని.. గరిటెతో తిప్పుతూ ఉండాలి.
►అనంతరం నీళ్లు పోసుకుని దగ్గర పడే వరకూ తిప్పాలి.
►1 టేబుల్‌ స్పూన్‌ నెయ్యి, చిక్కటి పాలు వేసుకుని మళ్లీ తిప్పుతూ ఉండాలి.
►దగ్గర పడేలోపు మిగిలిన నెయ్యి, ఫుడ్‌ కలర్‌ వేసుకుని కలపాలి.
►చివరిగా ఏలకుల పొడి, జీడిపప్పు, కిస్మిస్‌ వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
►చల్లారిన తర్వాత సర్వ్‌ చేసుకుంటే సరిపోతుంది. 

చదవండి👉🏾Egg Chapati Recipe In Telugu: ఘుమఘుమలాడే ఎగ్‌ చపాతీ తయారీ ఇలా!
చదవండి👉🏾Recipes: తోతాపురి మామిడికాయలు, అరకేజీ బెల్లం.. సింపుల్‌గా ఇలా ఆవకాయ పెట్టేయండి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement