టపాసులు .. మిఠాయిలు ... డాన్సులు | YSRCP supporters and workers burst fire crackers and exchange sweets | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 24 2013 9:33 AM | Last Updated on Thu, Mar 21 2024 7:50 PM

టపాసులు .. మిఠాయిలు ... డాన్సులు .. విజయోత్సవ ర్యాలీలు. తెలంగాణ జిల్లాల్లో పండగ వాతావరణం నెలకొంది. వైఎస్ జగన్‌ ప్రజల మధ్యకు వస్తుండడంతో ప్రజల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. బెయిల్ మంజూరు కావడంతో వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. టపాసులు పేల్చుతూ .. మిఠాయిలు పంచుకుంటూ జై జగన్ నినాదాలు చేశారు. జగన్ బెయిల్ వార్తతో తెలంగాణ జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. 'జై జగన్...జై జై జగన్' నినాదాలతో మార్మోగాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ అభిమానులు టపాసులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి క్షీరాభిషేకం చేశారు. తమ నేతకు బెయిల్ రావటంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. జగన్కి సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేయటంతో తెలంగాణలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement