స్నేహం ఓ మధురం
స్నేహం.. ఓ మధురానుభూతి. అది కలకాలం నిలిచిపోతుంది. దీనికి గుర్తుగా ఓ మంచి బహుమతి ఇవ్వాలని స్నేహితులు ఆరాటపడుతుంటారు. ఏటా ఆగస్టు తొలి ఆదివారం జరుపుకొనే ఫ్రెండ్‌షిప్‌డే కోసం చిన్నాపెద్దా ఎదురుచూస్తుంటారు. స్నేహానికి మధురస్మతిగా చక్కటి బహుమతితో ఆహ్వానం పలికేందుకు సిద్ధమవుతారు. చిన్నాపెద్దా తేడా లేకుండా అందర్నీ ఆకర్షించే ఫ్రెండ్‌షిప్ బ్యాండ్స్, బహుమతులు విక్రయించే స్టాళ్లు నగరంలో ఎక్కడికక్కడ ఆకర్షిస్తున్నాయి. యూత్ అభిరుచి తగ్గట్టుగానే డార్లింగ్ పారడైజ్ వంటి గిఫ్ట్‌హౌసెస్‌లో 2016 లేటెస్ట్ బహుమతులు అందుబాటులో ఉన్నాయి. ఫ్రెండ్‌షిఫ్ ఫిల్లో, మెసేజ్‌బాటిల్, ఫొటోఫ్రేం, వాటర్ ఫౌంటైన్, బాస్కెట్ విత్ టెడ్డీబేర్, ఫ్రెండ్‌షిప్ చాక్లెట్, ల్యాంప్, ఫ్రెండ్‌షిప్ వాటర్ డూమ్, గ్రీటింగ్ కార్డ్సు, ఫ్రెండ్‌షిప్ కీచైన్లు, చాక్లెట్ విత్ బోకే టెడ్డీ తదితర బహుమతులు ఆకట్టుకుంటున్నాయి. – పెదవాల్తేరు