
ప్రస్తుత కాలంలో మనుషులు దోమల కారణంగా ఇబ్బంది పడినంతగా మరే ఇతర జీవుల వల్ల కూడా ఇబ్బంది పడివుండరంటే అతిశయోక్తి కాదు. సాయంత్రం కాగానే దోమల సైన్యం మన ఇంటిపై దాడి చేసి, కుటుంబ సభ్యుల రక్తాన్ని పీల్చేస్తుంది. ముఖ్యంగా ఇంటికి సమీపంలో నీరు నిల్వ ఉండే ప్రాంతం ఉంటే దోమల దాడి మరింత అధికంగా ఉంటుంది. దోమలను నివారించడానికి మనం చాలా ప్రయత్నాలు చేస్తుంటాం. అయితే దోమలను లొట్టలేసుకుంటూ తినేవారి గురించి మీకు తెలుసా? ఇది మీ ఊహలోకి కూడా రాకపోవచ్చు. దోమలను ఎంతో ఇష్టంగా తినే ప్రజలు ఉండే ప్రదేశం ఒకటి ఉంది. వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
దోమలను లొట్టలేసుకుంటూ తినే ప్రజలు ఆఫ్రికాలో నివసిస్తున్నారు. ఈ సంఘాన్ని మిడ్జెస్ అంటారు. వారు దోమలను వేటాడేవారిగా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. ఆఫ్రికాలోని విక్టోరియా సరస్సు వర్షాకాలంలో నీటితో నిండినప్పుడు, అందులో దోమలు విపరీతంగా వృద్ధి చెందుతాయి అప్పుడు మిడ్జెస్ జాతి ప్రజలు ఈ దోమలను వేటాడి, ఇష్టంగా తింటారు.
వర్షాల సమయంలో దోమలను పట్టుకునేందుకు ఇక్కడి ప్రజలు పలు రకాల పాత్రలను ఉపయోగిస్తారు. సాయంత్రం పూట దోమలను అధికంగా సేకరించి, వాటిని దగ్గరగా కలిపి, బాగా మెత్తగా చేసి, రుచికరమైన టిక్కీలు తయారు చేస్తారు. పలు నివేదికల ప్రకారం వారు ఒక్కో టిక్కీని తయారు చేయడానికి కనీసం 5 లక్షల దోమలను ఉపయోగిస్తారు. అక్కడ ఒక వ్యక్తి రోజుకు కనీసంగా రెండు టిక్కీలు తింటే, అతను 10 లక్షల దోమలను తిన్నాడని అర్థం. ఈ దోమలు ప్రొటీన్ కారకాలని, వాటిని తింటే తమ శరీరానికి సరిపడా ప్రొటీన్లు లభిస్తాయని ఇక్కడి ప్రజలు నమ్ముతారు.
ఇది కూడా చదవండి: ఎత్తయిన భవనాలపై ఎర్ర లైట్లు ఎందుకు?