mosqito problems
-
దోమలను ఎందుకు ఇష్టంగా తింటారు? ఒక టిక్కీకి ఎన్ని దోమలు కావాలి?
ప్రస్తుత కాలంలో మనుషులు దోమల కారణంగా ఇబ్బంది పడినంతగా మరే ఇతర జీవుల వల్ల కూడా ఇబ్బంది పడివుండరంటే అతిశయోక్తి కాదు. సాయంత్రం కాగానే దోమల సైన్యం మన ఇంటిపై దాడి చేసి, కుటుంబ సభ్యుల రక్తాన్ని పీల్చేస్తుంది. ముఖ్యంగా ఇంటికి సమీపంలో నీరు నిల్వ ఉండే ప్రాంతం ఉంటే దోమల దాడి మరింత అధికంగా ఉంటుంది. దోమలను నివారించడానికి మనం చాలా ప్రయత్నాలు చేస్తుంటాం. అయితే దోమలను లొట్టలేసుకుంటూ తినేవారి గురించి మీకు తెలుసా? ఇది మీ ఊహలోకి కూడా రాకపోవచ్చు. దోమలను ఎంతో ఇష్టంగా తినే ప్రజలు ఉండే ప్రదేశం ఒకటి ఉంది. వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దోమలను లొట్టలేసుకుంటూ తినే ప్రజలు ఆఫ్రికాలో నివసిస్తున్నారు. ఈ సంఘాన్ని మిడ్జెస్ అంటారు. వారు దోమలను వేటాడేవారిగా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. ఆఫ్రికాలోని విక్టోరియా సరస్సు వర్షాకాలంలో నీటితో నిండినప్పుడు, అందులో దోమలు విపరీతంగా వృద్ధి చెందుతాయి అప్పుడు మిడ్జెస్ జాతి ప్రజలు ఈ దోమలను వేటాడి, ఇష్టంగా తింటారు. వర్షాల సమయంలో దోమలను పట్టుకునేందుకు ఇక్కడి ప్రజలు పలు రకాల పాత్రలను ఉపయోగిస్తారు. సాయంత్రం పూట దోమలను అధికంగా సేకరించి, వాటిని దగ్గరగా కలిపి, బాగా మెత్తగా చేసి, రుచికరమైన టిక్కీలు తయారు చేస్తారు. పలు నివేదికల ప్రకారం వారు ఒక్కో టిక్కీని తయారు చేయడానికి కనీసం 5 లక్షల దోమలను ఉపయోగిస్తారు. అక్కడ ఒక వ్యక్తి రోజుకు కనీసంగా రెండు టిక్కీలు తింటే, అతను 10 లక్షల దోమలను తిన్నాడని అర్థం. ఈ దోమలు ప్రొటీన్ కారకాలని, వాటిని తింటే తమ శరీరానికి సరిపడా ప్రొటీన్లు లభిస్తాయని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. ఇది కూడా చదవండి: ఎత్తయిన భవనాలపై ఎర్ర లైట్లు ఎందుకు? -
డేంజర్ బెల్స్.. భారీగా డెంగీ కేసులు, గుట్టుగా చికిత్సలు!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ భయంతో గత ఏడాది బస్తీల్లో విధిగా హైడ్రోక్లోరైడ్తో శానిటైజ్ చేయడం, ఫాగింగ్ నిర్వహించడం వల్ల దోమలు పెద్దగా లేకుండా పోయాయి. ఫస్ట్వేవ్తో పోలిస్తే.. సెకండ్ వేవ్లో కోవిడ్ ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఆయా చర్యలు చేపట్టలేదు. దీనికి తోడు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇంటి చుట్టూ ఒకవైపు వరద.. మరోవైపు బురద పేరుకు పోయి డెంగీ దోమల వ్యాప్తికి కారణమవుతున్నాయి. గ్రేటర్లో 2019లో అత్యధికంగా 3366 డెంగీ కేసులు నమోదైతే.. అదే 2020లో కేసుల సంఖ్య 346 తగ్గిపోయింది. తాజాగా ఈ ఏడాది హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో అధికారికంగా ఇప్పటికే 250 కేసులు నమోదు కాగా అనధికారికంగా ఒక్కో కార్పొరేట్ ఆస్పత్రిలో పదుల సంఖ్యలో బాధితులు చికిత్స పొందుతుండటం ఆందోళన కలిగిస్తోంది. సంపన్నులు ఎక్కువగా నివసించే బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, శేర్లింగంపల్లి, నానాక్రామ్గూడ, కూకట్పల్లి, మియాపూర్ తదితర ప్రాంతాల్లో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతుండటం గమనార్హం. గుట్టుగా చికిత్సలు ఇప్పటికే కరోనా వైరస్ సిటిజన్ల కంటిమీద కునుకు లేకుండా చేస్తుండగా.. తాజాగా డెంగీ దోమలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు తోడు ఇంటి చుట్టు వరద నీరు చేరి దోమలకు నిలయాలుగా మారాయి. – నిల్వ ఉన్న ఈ నీటిగుంతల్లో దోమలు గుడ్లు పెట్టి వాటి సంతతిని మరింత పెంచి పోషిస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఎప్పటికప్పడు దోమల నియంత్రణ కోసం యాంటిలార్వ, ఫాగింగ్ నిర్వహించకపోవడమే ఇందుకు కారణమని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లలు, వృద్ధులపై ఎక్కువగా దోమలు దాడి చేస్తుండటంతో ఇటీవల బాధితులు ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులకు పోటెత్తుతున్నారు. మనిషి రక్తంలో ప్లేట్లెట్స్ 1.5 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉంటాయి. డెంగీ జ్వరం వచి్చనప్పుడు వీటి సంఖ్య తగ్గుతుంది. వీరికి వెంటనే ప్లేట్లెట్స్ ఎక్కించాల్సి ఉంటుంది. చికిత్సల పేరుతో కార్పొరేట్ ఆస్పత్రులు రోగులను భయభ్రాంతులకు గురిచేసి అత్యవసర చికిత్సల పేరుతో రోజుకు రూ.50 వేలకుపైగా చార్జీలు వేస్తున్నాయి. డెంగీ కేసుల వివరాలను ఏ రోజుకారోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు చేరవేయాల్సి ఉన్నా.. నగరంలోని ఏ ఒక్క కార్పొరేట్ ఆస్పత్రి కూడా ఆ సమాచారం ఇవ్వడం లేదు. అధికారులకు అనుమానం రాకుండా ఉండేందుకు బాధితులను సస్పెక్టెడ్ డెంగీ కేసుల జాబితా లో ఉంచి చికిత్సలు చేస్తుండటం గమనార్హం. -
దోమలపై ‘స్మార్ట్’ ఫైట్
సాక్షి, హైదరాబాద్:మస్కీట్.. ఇది దోమల నివారణ యంత్రం. దోమలు నగరంలో ఏయే ప్రాంతాల్లో అధికంగా ఉన్నాయి.. ఏ రకం దోమ వల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయి.. అనే వివరాలు తెలుసుకు నేందుకు జీహెచ్ఎంసీ దీన్ని వినియోగించనుంది. క్యాచ్, కౌంట్, క్లాసిఫ్ అనే మూడు పనులను ఈ పరికరం చేస్తుంది. మెషీన్లోని సువాసనలతో కూడిన లిక్విడ్, సెన్సర్ల వల్ల దోమలు దీంట్లోకి వస్తాయి. దీంతో ఆయా వాటిలోని దోమలను వర్గీకరించి.. ఫలానా వ్యాధిని కలిగించే దోమలు ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయో తెలుసుకోవచ్చు. తద్వారా సదరు ప్రాంతాల్లో నివారణ చర్యలు చేపట్టవచ్చు. నిరోధక చర్యలు చేపట్టాక ఏ మేరకు దోమలు తగ్గాయో కూడా తెలుసుకోవచ్చు. నగరంలో జోన్కొకటి వంతున దీన్ని వినియోగించే అంశాన్ని పరిశీలిస్తున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ తెలిపారు. దీని వ్యయం రూ.60 వేలని చెప్పారు. -
‘దోమలపై దండయాత్ర’