![Walchand Hirachand Doshi Revolutionised India's Sugar Industry](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/choco.jpg.webp?itok=BlQump5n)
చిన్నతనంలో ఇష్టంగా తిన్న ఎరుపు రంగుని తెచ్చే పాన్ పంద్, మ్యాంగో మూడ్, కాఫీ బ్రేక్ వంటి చాక్లెట్లు గుర్తున్నాయా..?. ఆ సయమంలో ఒక రూపాయికే నాలుగు లేదా రెండు చాక్లెట్లు వచ్చేవి. అవి తింటుంటే నాలుకంతా రంగు మారిపోతుంటే అబ్బో ఆ ఫీల్ వేరుగా ఉంటుంది. ప్రస్తుతం ఎన్నో ఫ్లేవర్‌లతో కూడిన ఖరీదైన చాక్లెట్లు మరెన్నో వచ్చినపపటికీ..వాటి రుచి ఆ క్రేజ్ వేరు. చిన్నగా చెరుకు మిల్లులతో మొదలైన చాక్లెట్ల వ్యాపారం కాస్తా హిందూస్తాన్ కనెస్ట్రక్షన్ కంపెనీ, విమానా తయారీల కంపెనీలుగా వ్యాపార సామ్రజ్యాన్ని విస్తరించాడు మహారాష్ట్రకు చెందిన వాల్‌చంద్ హిరాచంద్ దోషి. ఆయన ప్రధాని మోదీ చెప్పే స్వాలంభనకు ఆనాడే బీజం వేశాడు. ఆవిష్కరణలకు పర్యాయ పదంగా నిలిచిన అతడి ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం.!.
1923 బ్రిటిష్ పాలనలో భారత్ ఉన్న సమయంలో సేథ్ వాల్‌చంద్ హిరాచంద్ దోషి దూరదృష్టితో మహారాష్ట్రలోని రావల్‌గావ్‌కు వచ్చారు. ఆయన భారత ఆర్థిక స్వేచ్ఛకు మార్గం రాజకీయ వాక్చాతుర్యం కాదు పారిశ్రామిక స్వావలంబనలోనే ఉందని నమ్మాడు. ఆ నేపథ్యంలోనే భారతదేశానికి వెన్నుముక అయిన వ్యవసాయంపై దృష్టిసారించాడు.
అదే ఆయన్ను 1,500 ఎకరాల బంజరు భూమి వైపు ఆకర్షించేలా చేసింది. నిజానికి ఇది రాళ్లతో నిండిపోయి.. వ్యవసాయానికి పనికిరాని భూమి ..కానీ దోషికి ఇందులో బంగారం పండిచొచ్చనిపించింది. అందరికీ అది నిరూపయోగమైన భూమిలా కనిపిస్తే.. ఆయనకు మాత్రం పనికొచ్చే భూమిలా అనిపించింది. ఆ నేపథ్యంలోనే రసాయన శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల బృందాన్ని సమీకరించి చెరకు సాగుకు అనువైన సారవంతమైన నేలగా మార్చే ప్రక్రియకు పూనుకున్నాడు.
అలా ఆయన తన పట్టుదలతో 1933లో రావల్‌గావ్ షుగర్ ఫామ్ లిమిటెడ్ స్థాపించారు. ఇదే భారత్‌లోని తొలి చక్కెర మిల్లులో ఒకటి. అక్కడితో ఆగిపోలేదు దోషి పారిశ్రామిక అభివృద్ధి దిశగా అడుగులు వేశాడు. ఆ నేపథ్యంలోనే మిల్లు చుట్టూ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, పాఠశాలలతో పూర్తి సమృద్ధి గల పట్టణాన్ని నిర్మించాడు. ఆ తర్వాత ఆ ప్రాంతం క్రమేణ వాల్‌చంద్ నగర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు నిలయంగా మారింది.ఇది చక్కెర మిల్లింగ్ నుంచి వివిధ పరిశ్రమలకు భారీ ఇంజనీరింగ్ పరికరాలను ఉత్పత్తి చేసే స్థాయికి ఎదిగింది.
అలా నిర్మాణ రంగంలోకి వెళ్లి హిందూస్తాన్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ, ముంబైలోని బాంద్రా-వర్లి సీ లింక్ వంటి ఐకానిక్ నిర్మాణాలను నిర్మించారు. అతని కారణంగానే 1940లో భారత్ తొలి విమానాయన తయారీ సంస్థ, 1946లో షిప్‌యార్డ్ వంటివి స్థాపించారు. ఆ తర్వాత ఆ రెండు కంపెనీలు వ్యూహాత్మక ప్రాముఖ్యత కారణంగా జాతీయం చేసింది ప్రభుత్వం.
అయితే 1940లలో రావల్‌గావ్ చక్కెర ఉత్పత్తి నుంచి తయారైన చాక్లెట్లు మాత్రం మిఠాయి వ్యాపారంగానే ఉండిపోయింది. అయితే భారతీయ చాక్లెట్లకు రావల్‌గావ్ బ్రాండ్‌గా ఉండేది ఆ కాలంలో. ఆయన చక్కెర మిల్లుల కారణంగా తయారయ్యే పాన్‌పసంద్ పెద్దవాళ్లలా పాన్‌ని తిన్నట్లుగా నోరంతా ఎరుపు రంగు తెప్పించేది. ఏడాది పొడవునా మ్యాంగో తిన్న అనుభూతిని కలిగించే మ్యాంగో మూడ్, కాఫీ బ్రేక్, చాకో క్రీమ్ తరదితరాలు ఆ కాలంలో అందరికీ నచ్చే చాక్లెట్లు.
ఆ విధంగా మహారాష్ట్ర భారతదేవశంలోని అతిపెద్ద చక్కెర ఉత్పత్తి రాష్ట్రంగా నిలుస్తోంది. ఇప్పటికీ రావల్‌గావ్ షుగర్ ఫామ్ లిమిటెడ్ స్వతంత్రంగానే పనిచేస్తోంది. దీన్ని ఇటీవలే రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ (RCPL) రావల్‌గావ్ బ్రాండ్‌ను రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ ఒప్పందంలో ట్రేడ్‌మార్క్‌లు, వంటకాలు , మేధో సంపత్తి హక్కులు ఉన్నాయి. కరోనా సమయంలో తీవ్రమవుతున్న ఖర్చులు, మార్కెట్ పోటీ కారణంగా రావల్‌గావ్ చాక్లెట్ల వ్యాపారం పలు ఒడిదుడుకులు ఎదుర్కొంది.
అయితే రావల్‌గావ్ పేరుమీదు ఉన్న మిగతా ఇండస్ట్రీలను మాత్రం యథావిధిగా నిలుపుకుంది. తీపి పదార్థాల నుంచి నిర్మాణ రంగం, పారిశ్రామిక రంగ పరంగా భారతదేశాన్ని అభివృద్ధి బాటపట్టేలా చేశారు. ఆయన వారసత్వం నిర్మించిన సంస్థల్లోనే కాదు, దేశ రూపు రేఖలను మార్చడంలోనే అందించారు. పారిశ్రామిక వేత్త అంటే తనను అభివృద్ధి చేసుకుంటూ..దేశాన్ని కూడా ప్రగతిపథంలోకి తీసుకుపోయేవాడని చాటి చెప్పారు వాల్‌చంద్ హిరాచంద్ దోషి.
(చదవండి: '8 సిటీస్ 8 బర్డ్ వాక్‌లు': ఇది చిన్నారులకు ప్రత్యేకం..!)
Comments
Please login to add a commentAdd a comment