industreis
-
కాలుష్యంతో కిరికిరి.. నిత్యం ఉక్కిరిబిక్కిరి
పచ్చని పంట పొలాల్లో కాలుష్యం చిచ్చు పెట్టే పరిశ్రమలు ఓ వైపు.. అర్ధరాత్రి అయితే చాలు భగభగ మండే లెడ్డు బట్టీల కాలుష్యం మరో వైపు .. వెరసి మండల ప్రజలు వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.. ఎలాంటి అనుమతులు లేకుండా పుట్ట గొడుగుల్లా వెలుస్తున్న లెడ్డు బట్టీలు.. నిబంధనలను తుంగల్లో తొక్కి యథేచ్ఛగా కాలుష్యాన్ని వెదజల్లుతున్న పరిశ్రమల ఆగడాలను అడ్డుకోవాల్సిన అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. – నందిగామ మండల కేంద్రమైన నందిగామతో పాటు జంగోనిగూడ, నర్సప్పగూడ, చేగూరు, వీర్లపల్లి, మోత్కులగూడ, అప్పారెడ్డిగూడ, మేకగూడ, రంగాపూర్ తదితర గ్రామాలలో సుమారు 100 పరిశ్రమల వరకు ఉన్నాయి. ఇందులో స్పాంజ్ ఐరన్, ఐరన్, టెక్స్టైల్స్, ఫార్మ, ప్లైఉడ్, అల్యూమినీయం, నూనె డబ్బల తయారీ, ప్యాకింగ్ కవర్స్ తదితర పరిశ్రమలు ఉన్నాయి. విచ్చలవిడిగా లెడ్డు బట్టీలు.. ►జంగోనిగూడ అక్రమ లెడ్డు బట్టీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ►జంగోనిగూడ నుంచి తీగాపూర్ కు వెళ్లే రహదారిలో అక్రమంగా మూడు లెడ్డు బట్టీలను ఏర్పాటు చేశారు. అవి రాత్రయితే చాలు బట్టీలు వెలుగుతూనే ఉంటాయి. ►అయ్యప్ప స్వామీ దేవాలయం సమీపంలోని పారిశ్రామిక వాడలో పదుల సంఖ్యలో అక్రమ లెడ్డు బట్టీలు నడిపిస్తున్నారు. చదవండి: Nalgonda: నిశీధిలో ఏం జరిగింది..? లెడ్డు బట్టీలతో ఘాటైన వాసనలు.. లెడ్డు బట్టీలలో పాడైపోయిన బ్యాటరీలను పగులగొట్టి అందులోని మెటీరియల్ సేకరిస్తారు. వీటిని బోగ్గుతో కాల్చి కరగబెట్టి లెడ్డును వెలికి తీస్తారు. ఈ ప్రక్రియలో బ్యాటరీలను బొగ్గుతో కాలుస్తున్న క్రమంలో విపరీతమైన నల్లటి పొగ, దుర్వాసన వెదజల్లుతోంది. ఈ పొగ సమీపంలోని గ్రామాలు, వ్యవసాయ పంటపొలాలలో పడి ఆ ప్రాంతమంతా కాలుష్యంతో మునిగిపోతోంది. చేగూరులో ఓ పరిశ్రమ నుంచి వెలువడుతున్న పొగ రాత్రి వేళల్లోనే.. అక్రమ లెడ్డు బట్టీలు రాత్రి తొమ్మిది గంటల నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు నిర్వహిస్తుంటారు. జంగోనిగూడ శివారులోని ఓ లెడ్డు బట్టిలో గతంలో జరిగిన ప్రమాదంలో గ్రామానికి చెందిన ఓ యువకుడు దుర్మరణం చెందాడు. అంతేకాకుండా రాత్రి వేళ్లలో మాత్రమే కొనసాగుతున్న లెడ్డు బట్టిలలో ఎన్నో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వీటితో పాటు వీర్లపల్లి, నందిగామ, నర్సప్పగూడ తదితర గ్రామాల శివార్లలో ఉన్న ఐరన్ పరిశ్రమల వల్ల వీపరీతమైన పొగ, దుమ్ము ధూళీ రావడంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చేగూరుకు రాత్రి వేళల్లో వెళ్లాలంటే విపరీతమైన పొగతో రోడ్డు సైతం కనపడని దుíస్థితి నెలకొంటోంది. చదవండి: చెరువులో ఈతకొడుతూ.. టీఆర్ఎస్ నాయకుడి కన్నుమూత మృతి చెందుతున్న మూగజీవాలు స్పాంజ్ ఐరన్ పరిశ్రమ వెదజల్లే కాలుష్యం కారణంగా పచ్చని గ్రాసంపై నల్లటి బూడిద కణాలు పడి వాటిని తిన్న పశువులు మృత్యువాత పడుతున్నాయి. ఫిర్యాదు చేసినా పట్టించుకోరు నర్సప్పగూడ, వీర్లపల్లి గ్రామాల మధ్య వెలసిన స్పాంజ్ ఐరన్ పరిశ్రమల ద్వారా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళలో ఆయా పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం వల్ల పంట పొలాలతో పాటు గ్రామంలోని ఇళ్లపై నల్లటి బూడిద పడుతోంది. ఈ విషయమై సంబంధిత కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. – గోవిందు అశోక్ కుమార్, సర్పంచ్, నర్సప్పగూడ చర్యలు చేపడతాం స్పాంజ్ ఐరన్ పరిశ్రమలు వీపరితమైన కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయని ఇటీవల ఫిర్యాదు వచ్చిన మాట వాస్తవమే. ఈ విషయాన్ని హెడ్ ఆఫీస్ దృష్టికి తీసుకెళ్లాను. రెండు మూడు రోజులలో ల్యాబ్ టెక్నిషియన్స్‌ను తీసుకొని పరిశీలిస్తాం. నిబంధనలకు విరుద్ధంగా కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలపై చర్యలు తీసుకుంటాం. – దయానంద్, జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారి -
Andhra Pradesh : 27 నెలల్లో 68 మెగా పరిశ్రమలు
సాక్షి, అమరావతి: మనందరి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఈ 27 నెలల్లోనే రూ.30,175 కోట్ల పెట్టుబడితో 68 భారీ, మెగా పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఈ పరిశ్రమల ద్వారా 46,119 మందికి ఉపాధి లభించిందని తెలిపారు. మరో రూ.36,384 కోట్ల పెట్టుబడితో మరో 62 భారీ, మెగా ప్రాజెక్టులు కూడా ప్రారంభం కాబోతున్నాయని, వీటిద్వారా 76,916 మందికి రాబోయే రోజుల్లో ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి ఎంఎస్ఎంఈ, టెక్స్టైల్స్, స్పిన్నింగ్ మిల్స్‌కు ప్రోత్సాహకాలు విడుదల చేసిన సందర్భంగా లబ్ధిదారులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కష్టకాలంలో మన రాష్ట్రంలోని పరిశ్రమలు, వాటి మీద ఆధారపడిన కుటుంబాలకు మరింత దన్నుగా నిలుస్తున్నామని చెప్పారు. 12 లక్షల మందికి ఉపాధినిస్తున్న ఎంఎస్ఎంఈలు, టెక్స్టైల్ స్పిన్నింగ్ మిల్స్‌కు ఊతమిస్తూ రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలు విడుదల చేస్తున్నామని చెప్పారు. ఎంఎస్ఎంఈలకు నేరుగా దాదాపు రూ.450 కోట్లు, టెక్స్టైల్ మిల్స్ వారి ఖాతాల్లోకి మరో రూ.230 కోట్లు వెళ్తాయన్నారు. టెక్స్టైల్ మిల్లులకు ఇవ్వాల్సిన రూ.450 కోట్ల విద్యుత్ చార్జీ రీయింబర్స్‌మెంట్‌ను వారు భవిష్యత్తులో కట్టబోయే కరెంటు బిల్లుల్లో రిబేటు ఇచ్చేలా చేస్తున్నామని స్పష్టం చేశారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. లబ్ధిదారుల్లో 62 శాతం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు మన ప్రభుత్వం ఇస్తున్న ఈ ప్రోత్సాహకాలతో లబ్ధిపొందుతున్న మొత్తం యూనిట్లలో 62 శాతం ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఉన్నారు. వీరంతా చిన్న చిన్న వాళ్లు. ఈ యూనిట్లలో 42 శాతం అక్క చెల్లెమ్మలవే. ఈ బెనిఫిట్స్ రాకపోతే వీళ్లందరూ రోడ్డున పడే పరిస్థితి ఉంటుందని గత పాలకులు ఎన్నడూ ఆలోచించలేదు. మనం అధికారంలోకి వచ్చాక పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగావకాశాలు కల్పిస్తూ చట్టం చేశాం. రూ.3,236 కోట్ల రుణాలు రీ షెడ్యూల్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే వైఎస్సార్ నవోదయం అనే కొత్త స్కీంను తీసుకు వచ్చి బ్యాంకులతో కలిసికట్టుగా పనిచేస్తూ 1,08,292 ఎంఎస్ఎంఈ ఖాతాలకు సంబంధించి రూ.3,236 కోట్ల రుణాలను రీషెడ్యూల్ చేశాం. దీంతోపాటు 2,49,591 ఎంఎస్ఎంఈ బ్యాంకు ఖాతాలకు అత్యవసర క్రెడిట్ లైన్ హామీ పథకాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చాం. తద్వారా రూ.5,973 కోట్ల బ్యాంకు రుణాలతో అదనపు వర్కింగ్ క్యాపిటల్ రుణ సదుపాయాన్ని ఏర్పాటు చేశాం. కొప్పర్తిలో మెగా ఇండస్ట్రియల్ హబ్ రూ.25 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలనే లక్ష్యంతో వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో 3,155 ఎకరాల విస్తీర్ణంలో వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్‌ను అభివృద్ధి చేస్తున్నాం. దీని ద్వారా దాదాపు 75 వేల మందికిపైగా ఉపాధి లభిస్తుంది. ఇదే కొప్పర్తిలో ఎలక్ట్రానిక్ పరిశ్రమలను ఆకట్టుకునేలా వైఎస్సార్ ఈఎంసీ (ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్) స్థాపిస్తున్నాం. దీనిద్వారా దాదాపు రూ.10 వేల కోట్ల పెట్టుబడులు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. 801 ఎకరాల్లో రూ.730 కోట్లతో దీనిని ఏర్పాటు చేస్తున్నాం. దీని ద్వారా అక్కడ మరో 30 వేల మందికి రెండేళ్లలోపే ఉద్యోగావకాశాలు కల్పించే పరిస్థితి ఉంటుంది. రైతుల కోసం 10 వేల మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు 30 సంవత్సరాల పాటు రైతులకు ఉచితంగా, నాణ్యమైన కరెంటును ఎలాంటి ఢోకాలేకుండా ఇచ్చేలా 10 వేల మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును ఏర్పాటు చేయబోతున్నాం. దురదృష్టవశాత్తు గిట్టని వాళ్లు కోర్టుకు వెళ్లారు. దీనివల్ల టెండర్లు ఖరారు చేసి పనులు మొదలు పెట్టలేకపోయాం. కోర్టు తీర్పు రాగానే పనులు వేగవంతంగా జరుగుతాయి. రూ.30 వేల కోట్ల పెట్టుబడి రావడమే కాకుండా, యూనిట్ రూ.2.48కే కరెంట్ అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల ప్రభుత్వంపై భారం తగ్గుతుంది. విద్యుత్, రోడ్లు, నీటిపై దృష్టి మునుపెన్నడూ లేని విధంగా పారిశ్రామిక రంగానికి అవసరమైన విద్యుత్తు, రోడ్లు, నీరు అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో పారిశ్రామిక విధానంలో ఈ అంశాలకు ప్రాధాన్యత కల్పించాం. ప్రభుత్వం ప్రకటించిన పారిశ్రామిక విధానంలో భాగంగా ఎస్సీలు, ఎస్టీలు, వెనకబడ్డ వారు పరిశ్రమలు స్థాపించేలా వైఎస్సార్ బడుగు వికాసం తీసుకు వచ్చాం. రూ.కోటిలోపు పెట్టుబడి పెట్టే ఎస్సీ, ఎస్టీలకు 45 శాతం, బీసీ వర్గాలకు 35 శాతం పెట్టుబడిలో సబ్సిడీ ఇస్తూ ప్రోత్సహించే కార్యక్రమాన్ని చేపట్టాం. ఇవికాకుండా పవర్ సబ్సిడీలు, ల్యాండ్ కొనుగోలులో రిబేటు... ఇలాంటి ప్రోత్సాహకాలు కూడా ప్రత్యేకించి ఈ వర్గాలకు అందిస్తున్నాం. మూడు ఇండస్ట్రియల్ కారిడార్ల అభివృద్ధి రాష్ట్ర వ్యాప్తంగా వేగవంతమైన అభివృద్ధి కోసం విశాఖపట్నం– చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై–బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్– బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేస్తున్నాం. చెన్నై–బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా రూ.2,139 కోట్ల అంచనా వ్యయంతో దాదాపు 13 వేల ఎకరాల విస్తీర్ణంలో కృష్ణపట్నం గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ నోడ్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ఈ ఒక్క నోడ్ ద్వారానే దాదాపు లక్ష మందికి ఉపాధి లభిస్తుంది. రాబోయే రోజుల్లో చాలా ఫోకస్డ్గా కార్యక్రమాలు చేపడుతున్నాం. రూ.13.5 వేల కోట్లతో కడపలో స్టీల్ ప్లాంట్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో కడపలో స్టీల్‌ప్లాంట్ పెడతామని కేంద్రం మాట ఇచ్చింది. అయితే అది కార్యరూపం దాల్చకపోవడంతో.. కచ్చితంగా ఆశలు నెరవేర్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తనంతట తానుగా అడుగులు ముందుకేసింది. ప్రైవేటు పార్టీలతో కలిసి అక్కడ ప్లాంట్ పెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాం. ఏపీ పునర్విభజన చట్టంలో ప్రస్తావించిన ప్రకారం 3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో రాష్ట్ర ప్రభుత్వమే అడుగులు ముందుకేసి వైఎస్సార్ జిల్లా సున్నపురాళ్లపల్లిలో దాదాపు రూ.13,500 కోట్లతో వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసింది. పనులకు శ్రీకారం చుట్టాం. రూ.13 వేల కోట్లతో మూడు పోర్టులు భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నంలో రూ.13 వేల కోట్లతో 2024 నాటికి మూడు గ్రీన్‌ఫీల్డ్ పోర్టుల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి చేసేలా శ్రీకారం చుట్టాం. రామాయపట్నం, భావనపాడు పోర్టులకు ఇప్పటికే టెండర్లు పిలిచాం. మచిలీపట్నం పోర్టు కోసం టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇవి కాకుండా రూ.3,827 కోట్ల వ్యయంతో 2 దశల్లో 9 కొత్త ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేస్తున్నాం. మన వాళ్లు జీవనోపాధికోసం పాకిస్థాన్, బంగ్లాదేశ్ సరిహద్దులకు వెళ్లి పట్టుబడితే.. వారిని తీసుకురావడం కోసం నానా అగచాట్లు పడుతున్న పరిస్థితుల్లో మనమే ఫిషింగ్ హార్బర్లను నిర్మించి, వారికి ఇక్కడే ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం, విశాఖ జిల్లా పూడిమడక, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ, పశ్చిమ గోదావరి జిల్లా బియ్యపుతిప్ప, గుంటూరు జిల్లా నిజాంపట్నం, ప్రకాశం జిల్లా వాడరేవు, కొత్తపట్నం, నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, కృష్ణా జిల్లా మచిలీపట్నం.. ఈ 9 ప్రాంతాల్లో హార్బర్లను అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటికే నాలుగు హార్బర్ల కోసం టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టాం. మిగిలిన వాటి కోసం టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తున్నాం. వీటి ద్వారా 76,230 మంది మత్స్యకార సోదరులకు నేరుగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. 2024 నాటికి పరోక్షంగా 35 వేల మందికి హార్బర్ల అనుబంధ పరిశ్రమల వల్ల ఉద్యోగాలు లభిస్తాయి. ఆసరా, చేయూత ద్వారా ఉపాధి అవకాశాలు గ్రామీణ స్థాయి నుంచి ఉపాధి అవకాశాలను కల్పించాలనే ఉద్దేశంతో మనందరి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఆసరా, చేయూత పథకాల ద్వారా స్వయం ఉపాధి కార్యక్రమాలు చేపట్టాం. అమూల్, ఐటీసీ, హిందుస్థాన్ లీవర్, ఫ్రోక్టర్ అండ్ గాంబిల్, రిలయన్స్.. తదితర భారీ సంస్థలతో ఆయా పథకాల లబ్ధిదారులను టై అప్ చేశాం. 1,07,232 మంది అక్కచెల్లెమ్మలకు కిరాణా దుకాణాలు, చిరు వ్యాపారాలు పెట్టించాం. 2,65,168 మంది అక్కచెల్లెమ్మలకు అమూల్ ద్వారా టై అప్ చేయించడమే కాకుండా ఆవులు, గేదెలు, గొర్రెల పెంపకం ద్వారా ఉపాధి కల్పించాం. మొత్తంగా 3,72,400 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు ఉపాధి చూపించాం. ఎన్నో కార్యక్రమాలు.. అందరికీ అండ జగనన్న తోడు కార్యక్రమం ద్వారా 9.51 లక్షల మంది చిరు వ్యాపారులకు సున్నా వడ్డీకే రుణాలు ఇప్పించి, ఆ వడ్డీ సొమ్మును ప్రభుత్వమే కట్టేట్టుగా అమలు చేస్తున్నాం. ఇది కాక ఇంటివద్దకే రేషన్ కార్యక్రమంలో భాగంగా ఒక్కో వాహనం రూ.5.8 లక్షల వ్యయంతో 9,260 రేషన్ వాహనాలను 90% సబ్సిడీతో అందించాం. దీనివల్ల ఒక్కో వాహనానికి ఇద్దరు చొప్పున 18,525 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించాం. నా కుటుంబ సభ్యులైన ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ సోదరులే దాదాపు 80 శాతం మందికి మేలు జరుగుతోంది. పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి చొప్పున 2,500 కోట్లతో 25 సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయబోతున్నాం. త్వరలోనే వీటి పనులు ప్రారంభం అవుతాయి. తద్వారా రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసే పంటకు వాల్యూ ఎడిషన్ క్రియేట్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రూ.3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధికి ఒక వైపున సాధికారతనిస్తూ, మరో 30 వేల మందికి ప్రత్యక్షంగా, ఇంకో 50 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ఆక్వా ఉత్పత్తుల స్థానిక వినియోగం పెంచేందుకు 23 ప్రీ ప్రాసెసింగ్ యూనిట్లు, 10 ప్రాససింగ్ యూనిట్లు నెలకొల్పుతున్నాం. వీటితోపాటు 100 హబ్స్‌ను, ప్రతి గ్రామానికీ మత్సు్య ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చేలా 14,500 రిటైల్ షాపులను ఏర్పాటు చేస్తున్నాం. వీటి ద్వారా ఆక్వా రంగంలో రూ.1,200 కోట్ల పెట్టుబడులు పెడుతున్నాం. 1,01,500 మందికి ఉపాధి లభిస్తుంది. జాతీయ ర్యాంకుల్లో మొదటి స్థానం పారిశ్రామిక రంగంపై ర్యాంకింగ్‌లు ఇచ్చేటప్పుడు కేంద్ర ప్రభుత్వం, వరల్డ్ బ్యాంకు దేశంలో మొట్టమొదటి సారిగా పారిశ్రామిక వేత్తల నుంచి కూడా ఫీడ్ బ్యాక్ తీసుకుని ర్యాంకింగ్‌లు ఇచ్చాయి. స్టేట్ బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ రిపోర్టు జాతీయ ర్యాంకుల్లో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని చెప్పడానికి గర్వపడుతున్నాను. పారిశ్రామిక వేత్తలను ఎంతలా సపోర్టు చేస్తున్నామో.. కేంద్ర ప్రభుత్వం, వరల్డ్ బ్యాంకులు నేరుగా వారినే అడిగి దేశ వ్యాప్తంగా సర్వే చేపట్టి, ఈ ర్యాంకులను ప్రకటించాయి. ఇందులో ఏపీకి మొదటి స్థానం రావడం అనేది.. పారిశ్రామిక రంగానికి చెందిన వ్యక్తులు, పెట్టుబడిదారులు రాష్ట ప్రభుత్వం మీద ఉంచిన నమ్మకానికి, విశ్వసనీయతకు నిదర్శనం ఇది. పరిశ్రమలకు అండగా, వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలబడుతున్న మనందరి ప్రభుత్వానికి దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ప్రజలందరి చల్లని దీవెనలు కూడా సదా ఉండాలని కోరుకుంటున్నాను. త్వరలో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన ఎయిర్ పోర్టుల అభివృద్ధిలో భాగంగా ఈ ఏడాది మార్చిలో కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయాన్ని మనందరి ప్రభుత్వం ప్రారంభించింది. రూ.3 వేల కోట్లతో భోగాపురంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేస్తాం. దీనిపై కూడా గిట్టనివారు కొంత మంది కోర్టులో కేసులు వేశారు. వీటిని పరిష్కరించే ప్రయత్నం జరుగుతోంది. దేవుడి దయతో త్వరలోనే పరిష్కారం అయ్యి, అన్నీ బాగుంటే వచ్చే నెలలోనే దానికి శంకుస్థాపన చేద్దామని గట్టి నమ్మకంతో ఉన్నాం. నిజాయితీగా, చిత్తశుద్ధితో అడుగులు ముందుకు వేస్తున్నాం. తద్వారా పరిశ్రమలు పెట్టిన వారికే కాకుండా, అక్కడ పని చేస్తున్న వారికీ మంచి జరిగేలా మనసా, వాచా, కర్మణ ముందుకెళుతున్నాం. చంద్రబాబు హయాంలో 2015 నుంచి ఎంఎస్ఎంఈలకు పెట్టిన బకాయిలు రూ.904 కోట్లు, స్పిన్నింగ్ మిల్లుల బకాయిలు రూ.684 కోట్లు.. మొత్తంగా రూ.1,588 కోట్లు మనందరి ప్రభుత్వం చెల్లించింది. ఈ 27 నెలల కాలంలోనే ఎంఎస్ఎంఈలకు మనందరి ప్రభుత్వం అందించిన మొత్తం ప్రోత్సాహకాలు రూ.2,086 కోట్లు. – సీఎం వైఎస్ జగన్ -
ఈవీ రంగంలో రూ.2,100 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రిక్ వాహన(ఈవీ)రంగంలో ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ కంపెనీలకు పోటీనిస్తున్న ‘ట్రైటాన్– ఈవీ’ రాష్ట్రంలో భారీ పెట్టుబడిని పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. రూ.2,100 కోట్ల పెట్టుబడితో జహీరాబాద్‌లోని జాతీయ పారిశ్రామిక పెట్టుబడులు, ఉత్పత్తుల మండలి (నిమ్జ్) తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటిం చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సమక్షంలో ‘ట్రైటాన్ ఈవీ’గురువారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ తయారీ యూనిట్ ద్వారా రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి జరుగుతుంది. కంపెనీ ప్రణాళిక ప్రకారం తొలి ఐదేళ్లలో 50వేలకు పైగా సెడాన్లు, లగ్జరీ కార్లు, ఇతర ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. భారీ పెట్టుబడితో ఏర్పాటయ్యే ట్రైటాన్ ఈవీ ద్వారా 25 వేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. తమ తయారీ ప్లాంటును భారత్‌లో ఏర్పాటు చేసేందుకు వివిధ రాష్ట్రాలను పరిశీలించిన తర్వాత తెలంగాణకు ఉన్న సానుకూలతలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ నుంచే కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించినట్లు సంస్థ సీఈఓ హిమాన్షు పటేల్ వెల్లడించారు. కంపెనీ పెట్టుబడికి సంబంధించిన వివరాలను ఆయన కేటీఆర్‌కు అందించారు. పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యస్థానం: మంత్రి కేటీఆర్ ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) రంగంలో పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం ఆకర్షణీయ గమ్యస్థానంగా మారుతోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్ర పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్‌లో భాగంగా ట్రైటాన్ ఈవీకి ప్రభుత్వపరంగా మెగా ప్రాజెక్టుకు లభించే ప్రయోజనాలన్నీ అందిస్తామని సంస్థ ప్రతినిధులకు కేటీఆర్ హామీనిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఈవీ పాలసీ దేశంలోనే అత్యుత్తమైనదిగా ప్రశంసలు అందుకుంటోందని, ఈ రంగంలో పేరొందిన పలు కంపెనీలు తెలంగాణలో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్నాయని కేటీఆర్ చెప్పారు. కార్యక్రమంలో ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ట్రైటాన్ ఈవీ ఇండియా డెవలప్మెంట్ హెడ్ మహమ్మద్ మన్సూర్ తదితరులు పాల్గొన్నారు. Delighted to announce that Triton EV - a leading US based Electric Vehicle company will be investing ₹ 2,100 Crores to establish an ultra-modern EV manufacturing unit at NIMZ, Zaheerabad in Sangareddy district An MoU is signed between Triton EV & Govt of Telangana today pic.twitter.com/HeHG6wHdw3 — KTR (@KTRTRS) June 24, 2021 చదవండి : ఎలక్ట్రిక్ వాహన విప్లవం రాబోతుంది: భవిష్ అగర్వాల్ -
స్థానికులకు ఉద్యోగాలివ్వాలి
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమల్లో స్థానికులకు నిర్ధారిత మొత్తంలో ఉద్యోగాలు ఇచ్చేలా చట్టం తేవాలని దుబ్బాక శాసనసభ్యుడు రఘునందన్‌రావు ప్రభుత్వాన్ని కోరారు. స్థానికంగా పరిశ్రమలున్నప్పటికీ స్థానిక నిరుద్యోగులకు ఉపయోగం లేకుండా వేరే ప్రాంతాల వారికి ఉద్యోగాలు ఇస్తున్నారని, ఈ తీరు మారాలని గురువారం ఆయన శాసనసభలో పేర్కొన్నారు. పద్దులపై చర్చ సందర్భంగా మాట్లాడారు. కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా ఇదే డిమాండ్ చేశారు. దుబ్బాక నియోజకవర్గం పరిధిలోకి వచ్చే చేగుంట ప్రాంతంలో 62 పరిశ్రమలున్నాయని, కానీ వాటిల్లో ఏ వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయో కూడా తెలియనీయకుండా వ్యవహరిస్తున్నారని, కనీసం ఆ పరిశ్రమలకు బోర్డులు కూడా లేవని రఘునందన్‌రావు తెలిపారు. వేరే రాష్ట్రాల నుంచి వచ్చే కార్మికులకు కనీస వేతనాలు కూడా ఇవ్వట్లేదని, ప్రమాదం జరిగి కార్మికులు చనిపోతే స్థానికులు కానందున వారి తరఫున మాట్లాడే వారూ లేకుండా పోతున్నారన్నారు. ఇక్కడ పరిశ్రమలు ఎక్కువగా ఉంటున్నందున స్థానికంగా ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని, కార్మిక సంక్షేమ నిధి నుంచి ఓ విద్యాలయం, కార్మికుల కోసం ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయాలని కోరారు. నా ఇలాఖాలో సింగిల్ రోడ్డు..కేటీఆర్ ఇలాఖాలో డబుల్ రోడ్డా.. ముస్తాబాద్ నుంచి దుబ్బాక మండల కేంద్రానికి ఉన్న రోడ్డు విషయంలో వివక్ష ఉందన్న భావన కలుగుతోందని రఘునందన్‌రావు పేర్కొన్నారు. ఈ రోడ్డు తన ఇలాఖాలో సింగిల్ రోడ్డుగా ఉండగా పొరుగునే ఉండే కేటీఆర్ నియోజకవర్గం పరిధిలో డబుల్ రోడ్డుగా ఉందని సభ దృష్టికి తెచ్చారు. వెంటనే తన పరిధిలోనూ డబుల్ రోడ్డు చేయాలని కోరారు. దౌల్తాబాద్–చేగుంట రోడ్డును కూడా రెండు వరుసలకు విస్తరించాలన్నారు. చేగుంట మండలంలోని 8 పంచాయతీల పరిధిలో రిజర్వ్ ఫారెస్టు భూమిని సాగుచేస్తున్నారంటూ రైతులకు కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వట్లేదని రఘునందన్‌రావు సభలో ఫిర్యాదు చేశారు. -
పరిశ్రమలకు డిజిటల్ అనుమతులు
సాక్షి, న్యూఢిల్లీ: సింగిల్ వెబ్సైట్ ద్వారా కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల అనుమతుల కోసం చర్యలు చేపట్టామని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ వెల్లడించారు. ప్రైవేటు రంగంతో 24 ఉత్పత్తులను ప్రభుత్వం సంయుక్తంగా గుర్తించిందనీ, తద్వారా వచ్చే ఐదేళ్లలో ప్రతి ఉత్పత్తి ఉత్పాదనకు రూ .20 లక్షల కోట్లు పెట్టుబడులను ఆశిస్తున్నట్లు చెప్పారు. స్టేట్ బిజినెస్ అసెస్మెంట్ రిపోర్ట్ ఆవిష్కరణలో కేంద్ర మంత్రి ఈ విషయాలను వెల్లడించారు. ఉత్పత్తులు / రంగాలపై దృష్టి సారించడం వల్ల ఉద్యోగావకాశాలు కూడా లభించడంతోపాటు దేశంలో ఆర్థిక కార్యకలాపాలను విస్తరిస్తాయన్నారు. సులభతర వాణిజ్య మెరుగుదల కోసం ఈ చర్యలు చేపడుతున్నామనీ, సింగిల్ పేమెంట్ గేట్‌వే ద్వారా త్వరితగతిన అనుమతులు ఇస్తామని వెల్లడించారు. అలాగే పరిశ్రమల కోసం లక్ష హెక్టార్ల భూమితో ఇప్పటికే ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేశామనితెలిపారు. కాగా ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్‌లో (సులభతర వ్యాపార నిర్వహణ) 2019 ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్ టాప్‌లో నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఉత్తర ప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి. -
పారిశ్రామిక శిక్షణకు ‘కార్పొరేట్’ సహకారం
సాక్షి, హైదరాబాద్: నైపుణ్యాభివృద్ధిలో భాగంగా శిక్షణతో కూడిన ఉపాధికి పలు కార్పొరేట్ సంస్థలు ముందుకు వచ్చాయి. పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ)లను దత్తత తీసుకుని విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. సీఎస్ఆర్(కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ)లో భాగంగా ఈ మేరకు కార్మిక, ఉపాధి కల్పన శాఖతో అవగాహన కుదుర్చుకుని అభ్యర్థులకు వివిధ రంగాల్లో శిక్షణ, నైపుణ్యం ఆధారంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. రాష్ట్రంలో 65 ప్రభుత్వ ఐటీఐలున్నాయి. వీటి పరిధిలో దాదాపు 60 వేల మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో శిక్షణ తీసుకుంటున్నారు. పరిశ్రమల్లో ఐటీఐ ట్రేడ్ అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. జూనియర్ స్థాయి నుంచి వచ్చేవాళ్లు కావడంతో తక్కువ వేతనంతో మెరుగైన పనిచేస్తారనే భావన ఉంది. ఈ క్రమంలో ఐటీఐ ట్రేడ్ ఉన్న అభ్యర్థులవైపు పరిశ్రమలు చూస్తున్నాయి. అప్రెంటీస్‌షిప్‌కు అవకాశమిస్తూ ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు కల్పనకు కార్మిక, ఉపాధి కల్పన శాఖ తీసుకొచ్చిన ప్రతిపాదనలకు పలు కంపెనీలు మొగ్గుచూపాయి. దీంతో ఆ శాఖతో ఒప్పందం కుదుర్చుకున్న వివిధ కంపెనీలు సీఎస్ఆర్ కింద శిక్షణ, ఉపాధి కల్పనకు ఉపక్రమించాయి. 60 ఐటీఐలు దత్తత... పరిశ్రమలు, కార్పొరేట్ సంస్థలు ప్రధానంగా ప్రభుత్వ ఐటీఐలపైనే దృష్టి పెట్టాయి. ప్రస్తుతం 65 ప్రభుత్వ ఐటీఐలుండగా వీటిలో 60 ఐటీఐలను ప్రముఖ సంస్థలు దత్తత తీసుకున్నాయి. కార్పొరేట్ సంస్థలు, ఎంఎన్‌సీలు 15 ఐటీఐలను దత్తత తీసుకోగా మిగతా 45 ఐటీఐలను స్థానికంగా పేరున్న సంస్థలు దత్తత తీసుకుని శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులకు తగినట్టుగా డిమాండ్ ఉన్న రంగాల్లో విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఐటీఐ యాజమాన్యాలు వసతులు కల్పిస్తుండగా, దత్తత తీసుకున్న సంస్థలు నైపుణ్యాభివృద్ధి తరగతులు నిర్వహిస్తున్నాయి. శిక్షణ పొందిన తర్వాత క్యాంపస్ సెలక్షన్లు పెట్టి ప్రతిభావంతులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు కార్మిక, ఉపాధి కల్పన శాఖ సంచాలకులు కేవై నాయక్ ‘సాక్షి’తో అన్నారు. -
ప్రభుత్వ వైఖరితోనే పరిశ్రమల మూత
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కృష్ణయ్య గుంటూరు వెస్ట్ : కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల ఫలితంగా పరిశ్రమలు మూతపడి కార్మికులు రోడ్డున పడుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కృష్ణయ్య తెలిపారు. బ్రాడీపేటలోని సీపీఎం కార్యాలయంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు నాగేశ్వరరావు అధ్యక్షతన జిల్లాlస్థాయి సమావేశం బుధవారం నిర్వహించారు. రోజురోజుకు ప్రభుత్వరంగం కుదించుకుపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 94 శాతం మంది అసంఘటితరంగ కార్మికులు కనీస వేతనాలు, పనిభద్రత, ఈఎస్ఐ, పీఎఫ్ తదితర సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులకు రూ.18 వేలు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 2న జరిగే దేశవ్యాప్త కార్మికవర్గ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో సచివాలయం నిర్మాణ పనులు చేసే కార్మికులకు భద్రత, కనీస వేతనాలు అమలు కావడం లేదన్నారు. చంద్రబాబు నాయుడు కార్మిక ఉద్యమాలపై ఉక్కుపాదం మోపుతున్నారని విమర్శించారు.