ప్రభుత్వ వైఖరితోనే పరిశ్రమల మూత
Published Wed, Aug 10 2016 8:55 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కృష్ణయ్య
గుంటూరు వెస్ట్ : కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల ఫలితంగా పరిశ్రమలు మూతపడి కార్మికులు రోడ్డున పడుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కృష్ణయ్య తెలిపారు. బ్రాడీపేటలోని సీపీఎం కార్యాలయంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు నాగేశ్వరరావు అధ్యక్షతన జిల్లాlస్థాయి సమావేశం బుధవారం నిర్వహించారు. రోజురోజుకు ప్రభుత్వరంగం కుదించుకుపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 94 శాతం మంది అసంఘటితరంగ కార్మికులు కనీస వేతనాలు, పనిభద్రత, ఈఎస్‌ఐ, పీఎఫ్ తదితర సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులకు రూ.18 వేలు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 2న జరిగే దేశవ్యాప్త కార్మికవర్గ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో సచివాలయం నిర్మాణ పనులు చేసే కార్మికులకు భద్రత, కనీస వేతనాలు అమలు కావడం లేదన్నారు. చంద్రబాబు నాయుడు కార్మిక ఉద్యమాలపై ఉక్కుపాదం మోపుతున్నారని విమర్శించారు.
Advertisement