ఉత్తరాఖండ్ స్పెషల్ స్వీట్ సింగోడి ఇలా ఇంట్లో సులువైన పద్ధతిలో తయారు చేసుకోండి.
సింగోడి తయారీకి కావలసినవి
►కోవా – అరకేజీ
►పంచదార – అరకేజీ
►పచ్చికొబ్బరి తురుము – పావుకేజీ
►మోలు ఆకులు – ఇరవై(కోన్ ఆకారంలో మడుచుకోవాలి)
►గులాబీ రేకులు – రెండు టేబుల్ స్పూన్లు.
తయారీ విధానం...
►కోవాను మెత్తగా చిదుముకోవాలి.
►దీనిలో పంచదార వేసి సన్నని మంట మీద పదినిమిషాలపాటు వేడిచేయాలి.
►పంచదార కరిగిన తరువాత కొబ్బరి తురుము వేసి మరో పదిహేను నిమిషాలు మగ్గనిచ్చి దించేయాలి
►కోవా మిశ్రమం గోరువెచ్చగా మారాక చిన్నచిన్న ఉండలుగా చుట్టాలి.
►ఈ ఉండలను కోన్ ఆకారంలో ఉన్న మోలు ఆకుల్లోపెట్టాలి.
►గులాబి రేకులతో గార్నిష్ చేసి సర్వ్‌చేసుకోవాలి.
ఇవి కూడా ట్రై చేయండి: Pahadi Raita Recipe: పెరుగు, కీరా.. ఫహాడీ రైతా.. అరగంట ఫ్రిజ్‌లో సర్వ్ చేసుకుంటే!
Recipe: ఉత్తరాఖండ్ వంటకం ఆలుకీ గుట్కే తయారీ ఇలా!
Comments
Please login to add a commentAdd a comment