జనవరి ఐదో తేదీలోగా ప్రభుత్వ ఉద్యోగుల పూర్తి వివరాలను వెబ్ ఆధారిత అప్లికేషన్ల ద్వారా ఆర్థిక శాఖకు అందజేయాలని ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ పీవీ.రమేశ్ ఆదేశించారు.
ఉట్నూర్‌రూరల్, న్యూస్‌లైన్ : జనవరి ఐదో తేదీలోగా ప్రభుత్వ ఉద్యోగుల పూర్తి వివరాలను వెబ్ ఆధారిత అప్లికేషన్ల ద్వారా ఆర్థిక శాఖకు అందజేయాలని ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ పీవీ.రమేశ్ ఆదేశించారు. గురువారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్‌కార్డులు జారీ చేసేందుకు 13వ తేదీన వెబ్ అప్లికేషన్లను ప్రారంభించినట్లు తెలిపారు. ఆయా శాఖల్లో పనిచేస్తున్న సిబ్బంది పూర్తి వివరాలు పొందుపర్చాలని తెలిపారు. కలెక్టర్ అహ్మద్ బాబు అధికారులతో మాట్లాడుతూ ఉపాధి హామీ, అంగన్‌వాడీ, ఆదర్శ రైతుల వివరాలను ఆయా శాఖలకు అందజేయాలని సూచించారు. హెల్త్‌కార్డుల జారీ నేరుగా సంబంధిత ఉద్యోగికి ఎస్‌ఎంఎస్ రూపంలో సమాచారం అందిస్తామని తెలిపారు. ఈ కాన్ఫరెన్స్‌లో ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్, డీఆర్వో ఎస్‌ఎస్ రాజు, ఆర్డీవో రామచంద్రయ్య పాల్గొన్నారు.
నమూనా ఫారంలో పూరించాలి
కలెక్టరేట్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు నగదు రహిత వైద్య చికిత్స పథకం ద్వారా లబ్ధి చేకూర్చడానికి ఉద్యోగుల వివరాలను నమూనా ఫారంలో పూరించాలని ఆర్థిక శాఖ కార్యదర్శి పీవీ.రమేశ్ అన్నారు. గురువారం ఆయన హైదరాబాద్ నుంచి కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉద్యోగులకు ఆరోగ్య కార్డుల జారీపై పలు సూచనలు చేశారు. ఉద్యోగులు అందించిన వివరాలను పరిశీలించి ఆన్‌లైన్ ద్వారా అప్‌లోడ్ చేయాలన్నారు. ఇచ్చిన సమాచారంలో ఏవైనా లోపాలుంటే సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో డీఆర్వో ఎస్‌ఎస్ రాజు, ట్రెజరీ ఉప సంచాలకులు సత్యనారాయణ, ఆరోగ్య శ్రీ కో ఆర్డినేటర్ డాక్టర్ విజయ్‌కుమార్, కలెక్టరేట్ ఏవో సంజయ్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు.