ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా ఉద్యోగులు అందరూ పూర్తి వివరాలను సంబంధిత డీడీఓ (డ్రాయింగ్ డిస్పర్సింగ్ ఆఫీసర్)లకు ఇచ్చేలా అన్ని విభాగాల అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా సంయుక్త కలెక్టర్ సురేంద్రమోహన్ ఆదేశించారు. ఉద్యోగుల వివరాల సేకరణపై గురువారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు విధిగా నిర్దేశించిన దరఖాస్తులను నింపి ఈ నెల 24వ తేదీలోగా సంబంధిత డీడీఓలకు అందజేయాలని, ఈ దరఖాస్తులను డీడీఓలు పరిశీలించి జనవరి 5లోగా ఆర్థిక శాఖ వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని సూచిం చారు. ఏమైనా సందేహాలు ఉంటే కలెక్టరేట్ ఐటీ విభాగం ఉప తహశీల్దార్ ఖాసిం మెయిల్ జుజ్చిటజీఝ.టజ్చిజిఃజఝ్చజీ. ఛిౌఝకు పంపించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఏజేసీ బాబూరావు పాల్గొన్నారు.
24వ తేదీలోగా ఉద్యోగులు వివరాలివ్వాలి
ప్రభుత్వం నుంచి వేతనాలు పొందుతున్న అన్ని రకాల ఉద్యోగులు ఈనెల 24వ తేదీలోగా వారి సమగ్ర సమాచారాన్ని నిర్దేశిత ప్రొఫార్మలో డ్రాయింగ్ డిస్పర్సింగ్ అధికారు(డీడీఓ)లకు అందజేయాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ.రమేష్ తెలిపారు. ఉద్యోగుల వివరాల సేకరణ, అందుకు అనుసరించాల్సిన పద్ధతులపై గురువారం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ఉద్యోగుల ఆరోగ్య పథకం, మానవ వనరుల నిర్వహణ వ్యవస్థ అమలుకు ఉద్యోగి వివరాలతోపాటు, వారి కుటుంబ సభ్యుల వివరాలను ఆర్థిక శాఖ పోర్టల్ ద్వారా సేకరించేం దుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నా రు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌కు జేసీ సురేంద్రమోహన్, ఏజేసీ బాబూరావు, గిరిజన శాఖ ఉపసంచాలకురాలు కె.నీలిమ, ప్రభుత్వ విభాగాల అధికారులు హాజరయ్యారు.
ఉద్యోగులు పూర్తి వివరాలు అందజేయాలి
Published Fri, Dec 20 2013 4:51 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
Advertisement