వైష్ణోదేవి దర్శనానికి ఐఆర్‌సీటీసీ టూర్‌ ప్యాకేజీ! | IRCTC Package For Mata Vaishno Devi Tour | Sakshi
Sakshi News home page

IRCTC Tour Package: వైష్ణోదేవి దర్శనానికి ఐఆర్‌సీటీసీ టూర్‌ ప్యాకేజీ!

Published Tue, Mar 26 2024 11:22 AM | Last Updated on Tue, Mar 26 2024 11:30 AM

Irctc Tour Package for Mata Vaishno Devi - Sakshi

వేసవి సెలవుల్లో మాతా వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించాలనుకునేవారికి ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్‌ ప్యాకేజీ ప్రకటించింది. ఈ ప్యాకేజీ మూడు రాత్రులతో పాటు మొత్తం నాలుగు రోజులు ఉండనుంది. ఈ ప్యాకేజీ న్యూఢిల్లీ నుండి ప్రారంభంకానుంది. 

ఐఆర్‌సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీలో మాతా వైష్ణో దేవి ఆలయంతో పాటు, కంద్ కండోలి ఆలయం, రఘునాథ్ ఆలయం, బేగ్ బహు గార్డెన్‌లను సందర్శించవచ్చు. ఈ టూర్‌ ప్యాకేజీ బుక్‌  చేసుకున్న ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ అన్ని సదుపాయాలను కల్పిస్తుంది.

ఈ ప్రత్యేక టూర్ ప్యాకేజీ పేరు ‘మాతారాణి- రాజధాని’ ఈ యాత్రలో ప్రయాణికులు థర్డ్ ఏసీలో ప్రయాణించే అవకాశం లభిస్తుంది. ప్రయాణికులకు ప్రయాణ సమయంలో ఆహారపానీయాలను ఐఆర్‌సీటీసీ అందిస్తుంది. ఈ ప్యాకేజీ కింద రెండు బ్రేక్‌ఫాస్ట్‌లు, ఒక లంచ్, ఒక డిన్నర్ అందజేస్తారు. అలాగే బస ఏర్పాట్లను కూడా ఐఆర్‌సీటీసీ కల్పిస్తుంది. 

ఈ ప్యాకేజీని బుక్‌ చేసుకోవాలనుకునేవారు రూ.6,390 చెల్లించాల్సి  ఉంటుంది. ఇందులో వివిధ టారిఫ్ ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ప్యాకేజీలో ప్రయాణానికి గరిష్ట ఛార్జీ రూ.8,300. మరిన్ని వివరాల కోసం irctctourism.comని సందర్శించవచ్చని ఐఆర్‌సీటీసీ తెలిపింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement