సమావేశంలో మాట్లాడుతున్న డీఎంహెచ్‌ఓ కొండల్‌రావు
- డీఎంహెచ్‌ఓ కొండల్‌రావు
ఖమ్మం వైద్య విభాగం : నేషన్ హెల్త్ మిషన్ ద్వారా వచ్చే నిధుల ఖర్చు వివరాలు ఎప్పటి కప్పుడు అందజేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఏ. కొండల్‌రావు వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఎస్‌పీహెచ్‌ఓలు, వైద్యాధికారులు, సీనియర్ అసిస్టెంట్లలతో ఎన్‌హెచ్‌ఎం కార్యక్రమంపై సమీక్ష సమావేశం జరిగింది.డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ క్లస్టర్ పరిధిలో జరిగే కార్యక్రమాల నివేదికను సరైన సమయంలో పంపించాలని సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్(ఎస్‌పీహెచ్‌ఓ)లను ఆదేశించారు. ప్రతీ పీహెచ్‌సీ పరిధిలో ఏఎన్‌సీ పరీక్షకు రాని గర్భిణులను గుర్తించి వారికి రిజిస్ట్రేషన్ చేసి సేవలు అందించాలని కోరారు. అగస్టు 10న జరిగే నేషనల్ డీ వార్మింగ్ డే కార్యక్రమాన్ని జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టి పిల్లలకు ఆల్బెండ్ జోల్ మాత్రలు వయస్సును బట్టి వేయాలని సూచించారు. ఎన్‌హెచ్‌ఎం డీపీఎంఓ కళావతిబాయి మాట్లాడుతూ ప్రధాన మంత్రి మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రతీ గర్భిణీని పరీక్షించాలన్నారు. ప్రతీనెల న్యూట్రిషన్ డైట్ అందించే విధంగా చూడాలని కోరారు. కార్యక్రమంలో జబ్బార్ జిల్లా కోఆర్డినేటర్ నిర్మల్‌కుమార్, డిప్యూటీ డెమో మంగళాబాయి, అన్నామేరి, నీలోహన, జి. సాంబశివారెడ్డి, జిల్లాలోని ఎస్‌పీహెచ్‌ఓలు, వైద్యాధికారులు, సీనియర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.