nhm
-
స్పెషలిస్ట్ వైద్యుల నియామకానికి వాక్–ఇన్ ఇంటర్వ్యూ లు
సాక్షి, అమరావతి: డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆస్పత్రులతోపాటు నేషనల్ హెల్త్ మిషన్(ఎన్హెచ్ఎం) పరిధిలో 13 స్పెషాలిటీల్లో 343 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ (సీఏఎస్ఎస్) పోస్టులను వైద్య, ఆరోగ్యశాఖ భర్తీ చేస్తోంది. ఇందుకోసం ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ సోమవారం నుంచి 15వ తేదీ వరకు వాక్–ఇన్ ఇంటర్వ్యూ లను నిర్వహించనుంది. ఎన్టీఆర్ జిల్లా డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కార్యాలయంలో రోజు మార్చి రోజు ఈ నెల 15వ తేదీ వరకు ఇంటర్వ్యూ లు ఉంటాయి. రెగ్యులర్(లిమిటెడ్, జనరల్)/కాంట్రాక్ట్ విధానాల్లో వైద్యులను నియమించనున్నారు. సెకండరీ హెల్త్ ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో గిరిజన ప్రాంతాలను ఎంపిక చేసుకున్న వైద్యులకు నెలకు రూ.2.50 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.రెండు లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.30 లక్షలు చొప్పున వేతనాలు ఖరారు చేశారు. ఎన్హెచ్ఎం కింద బోధన, జిల్లా ఆస్పత్రుల్లో నియమించే వారికి రూ.1.10 లక్షలు చొప్పున ఇస్తారు. ఇక ఎన్హెచ్ఎంలోని డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లలో నియమించేవారికి మైదాన ప్రాంతాల్లో రూ.1.10 లక్షలు, గిరిజన ప్రాంతాల్లో రూ.1.40 లక్షలు చొప్పున వేతనాలు ఉంటాయి. అభ్యర్థులు అదనపు వివరాల కోసం http://hmfw.ap.gov.in/ వెబ్‌సైట్‌ను, 6301138782 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలి. ప్రభుత్వాస్పత్రుల్లో ఒక్క పోస్టు ఖాళీగా ఉండకుండా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో గడిచిన నాలుగేళ్లలో 53వేలకు పైగా పోస్టులను భర్తీ చేశారు. మరోవైపు వైద్యశాఖలో ఏర్పడే ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసేలా అత్యవసర ఉత్తర్వులను జారీచేశారు. ఇంటర్వ్యూ ల నిర్వహణ షెడ్యూల్ ఇలా.. సోమవారం(11వ తేదీ): జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, జనరల్ ఫిజిషియన్, డెర్మటాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్ బుధవారం(13వ తేదీ): గైనకాలజీ, అనస్తీషియా, ఈఎన్టీ, పెథాలజీ శుక్రవారం(15వ తేదీ): పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఆప్తమాలజీ, రేడియాలజీ, చెస్ట్ డిసీజెస్ -
ఏకో ఇండియాతో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఎంవోయూ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు, ఆరోగ్య కార్యకర్తల సామర్ధ్యం పెంపుదల కార్యక్రమాల అమలుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ నేషనల్ హెల్త్ మిషన్.. న్యూఢిల్లీకి చెందిన ఎకో ఇండియా సంస్థతో అవగాహనా పత్రంపై(ఎంవోయూ) సంతకాలు చేసింది. శుక్రవారం మంగళగిరిలోని ఎపీఐఐసీ భవనం, ఐదో అంతస్థులో తన ఛాంబర్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ మరియు ఎన్ హెచ్ఎం మిషన్ డైరెక్టర్ జె. నివాస్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఎల్ బిఎస్ హెచ్ దేవి, ఎకో ఇండియా అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సందీప్ భల్లా, డిప్యూటీ జనరల్ మేనేజర్ దీపా ఝా ఈ అవగాహనా పత్రంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సందీప్ భల్లా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఎకో ఇండియా సంస్థల మధ్య కుదిరిన ఈ భాగస్వామ్య ఒప్పందం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ కార్యక్రమాలను ప్రభావశీలంగా నిర్వహించటానికి దోహదపడుతుందని చెప్పారు. వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించిన వివిధ అంశాలపై సిబ్బందికి ఉచితంగా వర్చువల్ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ అవగాహనా పత్రంపై సంతకాలు జరగటానికి ముందు ఎకో ఇండియా బృందం వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎంటి కృష్ణబాబుతో భేటీ అయ్యింది. ఈ భాగస్వామ్య ఒప్పందానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని ఆయన ఎకో ఇండియా బృందానికి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు కుదిరిన ఈ ఒప్పందంపై ఆయన హర్షాన్ని వ్యక్తం చేశారు. చదవండి: అమాంతంగా పెరిగిన నిమ్మ ధర.. రేటు ఎంతంటే..? -
Adilabad: అవార్డులు అందని ద్రాక్షేనా?
ఈ చిత్రంలో కనిపిస్తోంది బజార్హత్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. చూడటానికి భవనం ఆకర్షణీయంగా ఉంటుంది. అందుకు తగ్గట్టే నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) కింద కాయకల్ప అవార్డు వరుసగా మూడు సంవత్సరాలు అందుకుంది. నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్స్ అవార్డు కూడా దక్కింది. అయితే ఈసారి మాత్రం ఈ అవార్డుకు పోటీ పడటంలో వెనుకబడింది. దీనికి ప్రహరీ నిర్మాణం లేకపోవడం, స్వచ్ఛభారత్‌లో కొన్ని అంశాల్లో వెనుకబడడంతో ఈ పరిస్థితి ఉంది. ఈ చిత్రంలో కనిపిస్తోంది తలమడుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. ఆవరణలో ఈ ఫ్లోరింగ్ మొత్తం పగిలిపోయి ఉంది. భవనంలో విద్యుత్ వైరింగ్ సరిగ్గా లేదు. 1956లో ఈ పీహెచ్సీ ఏర్పాటు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రమాణాలు మెరుగుపర్చే చర్యలు ఎక్కడా కనిపించడం లేదు. అలా జరిగితేనే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి ఆస్పత్రులకు నిధులు వస్తాయి. మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడతాయి. సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే అవార్డులను అందుకోవడంలో వెనుకంజలో ఉన్నాయి. ప్రమాణాలను అందుకోలేక పోతున్నాయి. ఒకవేళ వసతులను మె రుగుపర్చుకుంటూపోతే అధిక పాయింట్స్ సాధించడం ద్వారా ప్రత్యేక నిధులు పొందే అవకాశం ఉంటుంది. కాయకల్ప ప్రమాణాలు అందుకుంటే రూ. 2లక్షల నిధులు ఇవ్వనున్నారు. వీటి ఆధారంగా మ రిన్ని వసతులు మెరుగుపర్చుకొని జాతీయ ప్రమాణాలు అందుకుంటే నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్స్ అవార్డు అందుకుంటాయి. మూడేళ్లపాటు ఒక్కో సంవత్సరం రూ.3 లక్షలు అందుతాయి. కొన్నింటికే అవార్డులు.. జిల్లా ఆస్పత్రులు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలను విడివిడిగా పరిగణలోకి తీసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా ప్రమాణాలను అంచనా వేసి అవార్డులు ఇస్తున్నాయి. జిల్లాలో మొత్తం 22 పీహెచ్‌సీలు, 5 అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. 5 పీహెచ్‌సీలు, 2 అర్బన్ హెల్త్ సెంటర్లు మాత్రమే కాయకల్పకు మొదట ఎంపికై ఆ తర్వాత ప్రమాణాలను దాటుకుని నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్స్‌ను అందుకోవడం ద్వారా వరుసగా మూడేళ్లు రూ.3 లక్షల చొప్పున అందుకున్నాయి. అయితే బజార్హత్నూర్ పీహెచ్‌సీకి సంబంధించి ప్రహరీ నిర్మాణం లేకపోవడం, స్వచ్ఛభారత్ అంశాల్లో పాయింట్లు తగ్గడంతో మరోసారి జాతీయ అవార్డు వస్తుందో? రాదోనని అక్కడి జెడ్పీటీసీ మల్లెపూల నర్సయ్య ఇటీవల జెడ్పీ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా జిల్లాలోని మిగితా ఆరోగ్య కేంద్రాలు ఈ ప్రమాణాలను అందుకునేందుకు పోటీ పడకపోవడం చోద్యంగా కనిపిస్తోంది. ఆస్పత్రిలో లైటింగ్, వెయిటింగ్, బాహ్య, అంతర్గత నిర్వహణ సరిగ్గా ఉండాలి. రోగులకు సురక్షితమైన వాతావరణం కల్పించాలి. విధులు సక్రమంగా నిర్వహించాలి వంటి అంశాలు ప్రమాణాలుగా ఉన్నాయి. ప్రధానంగా ఆస్పత్రి స్వరూపం ఆకర్షణీయంగా ఉండాలి. ఆ పరిసరాల్లో పశువుల సంచారం లేకుండా చూడాలి. గార్డెనింగ్ నిర్వహణ చేయాలి. ఆవరణ పరిశుభ్రంగా ఉండాలి. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశాలు ఆస్పత్రిలో సరైన సదుపాయాలు లేవని జెడ్పీ సమావేశంలో ప్రస్తావనకు తీసుకురావడం పట్ల ఎమ్మెల్యేలు ఆక్షేపణ వ్యక్తం చేశారు. ప్రధానంగా ప్రతి పీహెచ్సీలో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశాలు నిరంతరంగా నిర్వహిస్తే అక్కడే సమస్యలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఈ పదిహేను రోజుల్లో అన్ని పీహెచ్‌సీల సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని, స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించడం జరుగుతుందని, తద్వారా సదుపాయాలు మెరుగవుతాయని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాయకల్ప ప్రమాణాల్లో వెనుకంజ బజార్హత్నూర్ పీహెచ్‌సీకి వరుసగా మూడేళ్లపాటు కాయకల్ప అవార్డు దక్కింది. ఈసారి పాయింట్స్‌లో వెనుకబడింది. ప్రహరీ నిర్మాణం లేకపోవడం, అక్కడ ఆక్రమణలు చోటు చేసుకోవడం, ఇతరత్రా అంశాల పరంగా సరైన పాయింట్స్ రాలేదు. ఈ సమస్యలను పరిష్కరించడంలో యంత్రాంగం విఫలమవుతోంది. – మల్లెపూల నర్సయ్య, జెడ్పీటీసీ, బజార్హత్నూర్ జాతీయ ప్రమాణాలు అందుకునేందుకు కృషి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వసతులు మెరుగుపర్చడం ద్వారా కాయకల్ప అవార్డుతో పాటు జాతీయ ప్రమాణాలు కూడా అందుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. జిల్లాలో ఇప్పటికే ఏడు ఆస్పత్రులకు జాతీయ అవార్డు అందడం జరిగింది. – నరేందర్ రాథోడ్, డీఎంహెచ్ఓ, ఆదిలాబాద్ -
నాణ్యమైన వైద్యం జగనన్న లక్ష్యం: మంత్రి విడదల రజిని
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అత్యంత సులువుగా, పూర్తిగా ఉచితంగా అందాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖమంత్రి విడదల రజిని అన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ టవర్స్‌లో గురువారం మంత్రి విడదల రజిని ఎన్హెచ్ఎం విభాగం ఉన్నతాధికారులు, కమిషనర్ నివాస్‌తో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం జగన్.. వైద్య ఆరోగ్యశాఖ విషయంలో ఒక స్పష్టమైన లక్ష్యంతో ముందుకు వెళుతున్నారని చెప్పారు. చదవండి: నరకం చూపిస్తారా.. కన్నీళ్లు పెట్టుకున్న దివ్యవాణి ప్రజలందరికీ ఉచితంగా మెరుగైన వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసేందుకు జగనన్న ఏ మాత్రం వెనుకాడటంలేదని తెలిపారు. గ్రామస్థాయి నుంచి మెడికల్ కళాశాలల వరకు ప్రభుత్వ ఆస్పత్రుల నిర్మాణం, ఆధునికీకరణ, వసతుల కల్పనకు తమ ప్రభుత్వం ఏకంగా 16 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని చెప్పారు. 40 వేలకుపైగా నియామకాలు చేపట్టామని వెల్లడించారు. పూర్తి ఉచితంగా అన్ని రోగాలకు వైద్యం అందిస్తున్నామన్నారు. ఈ సేవలు ప్రజలకు మరింత మెరుగ్గా, నాణ్యంగా, ఉచితంగా అందాలంటే అధికారుల సహాయ సహకారాలు ఎంతో అవసరమని చెప్పారు. నిర్లక్ష్యం వీడితే చాలు తాను ఈ మూడేళ్లలో పలు ఆస్పత్రులు సందర్శించానని అన్ని చోట్లా మంచినీటి కొరత, అపరిశుభ్రత, నిర్వహణలో లోపాలు, టాయిలెట్లు సరిగా లేకపోవడం.. లాంటివి గమనిస్తూనే ఉన్నానని తెలిపారు. ఇవన్న చాలా చిన్న చిన్న సమస్యలని, అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇవి పెద్దవిగా కనిపిస్తున్నాయని చెప్పారు. సరైన సమయంలో స్పందిస్తూ ఆయా సమస్యలను పరిష్కరించుకుంటే సరిపోతుందని, అధికారులు చిత్తశుద్ధితో ఉంటేనే ఇది సాధ్యమవుతుందని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న వారందరి సంక్షేమం గురించి కూడా మనం ఆలోచించాలని చెప్పారు. వారందరికీ పీఎఫ్, ఈఎస్ఐ అందున్నాయో లేదో చూడాలన్నారు. ప్రతి ఉద్యోగికి సంబంధించిన వివరాల్లోకి వెళ్లాలని, ఏ ఒక్కరికి, ఎక్కడ సమస్య ఎదురైనట్లు గుర్తించినా.. సదరు ఏజెన్సీలపై చర్యలకు వెనుకాడొద్దని చెప్పారు. ఏఎన్ఎంలు, ఇతర ఫీల్డ్ సిబ్బంది బయోమెట్రిక్ విధానం వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర వ్యాప్తంగా పదే పదే తన దృష్టికి తీసుకొస్తున్నారని, వారి అభ్యర్థనలోనూ న్యాయం ఉందని, ప్రత్యామ్యాయ పద్ధతులను ఆలోచించాలని ఆదేశించారు. 2021-22 సంవత్సరానికి సంబంధించి ఎన్హెచ్ఎం లక్ష్యాలు ఏమున్నాయి.. వాటిని ఎంతవరకు రీచ్ అయ్యాం.. ఇప్పుడు జరుగుతున్న ఆర్థిక సంవత్సరంలో మనం ఎలా లక్ష్యాలను చేరుకోవాలి అనే విషయాలపై అందరికీ అవగాహన ఉండాలని చెప్పారు. ఆ మేరకు పనిచేయాల్సిందేనని స్పష్టంచేశారు. ఎన్‌హచ్‌ఎం నిధులను సక్రమంగా వినియోగించుకోవడంలేదని, మెడికల్ ఆఫీసర్ల నిర్లక్ష్యం వల్ల ఆ నిధులు మురిగిపోతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయని, ఏ ఆస్పత్రిలోనూ ఇలాంటి పరిస్థితులు ఉండటానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఎన్హెచ్ఎం నిధులను అంతా సమర్థవంతంగా వినియోగించుకోవాలని చెప్పారు. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గతంలో ఏ ప్రభుత్వాలకూ సాధ్యం కానంతగా కోట్ల రూపాయలు ఖర్చుచేస్తుంటే.. ఇప్పటికీ కొన్ని పీహెచ్‌సీల్లో మందులు బయటకు రాస్తున్నారని ఈ పరిస్థితి మారాలని చెప్పారు. ఎక్కడా, ఎప్పుడూ టెస్టులుగాని, మందులుగాని బయటకు రాయకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆస్పత్రులకు కావాల్సిన అన్ని మెటీరియల్స్ అందించేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందని, అయినా సరే కొన్ని ఆస్పత్రుల్లో మెటీరియల్ కొరత కనిపిస్తోందని చెప్పారు. ఎలుకలు, దోమలు ఆస్పత్రుల్లో ఎందుకు ఉంటున్నాయని, ప్రభుత్వ నిధులను సక్రమంగా వినియోగించి ఈ సమస్య తలెత్తకుండా చూడాలని సూచించారు. పీహెచ్ సీల్లో కాన్పులు జరిగేలా చూడండి రాష్ట్రంలోని అన్ని పీహెచ్ సీల్లో కాన్పులు జరిగేలా చొరవ చూపాలని మంత్రి తెలిపారు. ప్రతి పీహెచ్సీలో నెలకు కనీసం 10 కాన్పులైనా జరిగేలా కచ్చితంగా ప్రయత్నించాల్సిందేనని చెప్పారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకోవాలన్నారు. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో కాన్పులు జరగకపోవడం వల్ల టీచింగ్, జిల్లా ఆస్పత్రులపై ఒత్తిడి పెరుగుతోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, నోటిఫికేషన్ విడుదల చేయాలని వివరించారు. ఏపీ ఎం ఎస్ ఐడీసీ ద్వారా కొనుగోలు చేస్తున్న పరికరాల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని, నాణ్యతను పరిశీలించే టెక్నికల్ టీమ్‌లో సంబంధిత వైద్యులు కూడా ఉండేలా చూడాలని సూచించారు. కావాల్సినన్ని ఆస్పత్రులు నిర్మిస్తున్నాం, కావాల్సినంత సిబ్బందిని నియమిస్తున్నాం, కోట్లాది రూపాయలతో పరికరాలు కొనుగోలు చేస్తున్నాం.. అయినా సరే కొన్నిచోట్ల టెస్టులు బయటకు రాస్తున్నారు.. ఈ పరిస్థితి మారాలని మంత్రి తెలిపారు. ల్యాబ్‌లలో ఉన్న వైద్య పరికరాల మెయింటినెన్స్‌కు సంబంధించి కాలిబ్రేషన్ సక్రమంగా జరుగుతోందా..? లేదా అని ప్రశ్నించారు. క్వాలిటీ ఎజ్యూరెన్స్ స్కీమ్ కింద కాలిబ్రేషన్ చేయాలని ఇది సక్రమంగానే చేస్తున్నారా అని అడిగారు. వైద్య విభాగంలో ప్రతి ఒక్కటి పారదర్శకంగా జరగాల్సిందేనని స్పష్టంచేశారు. పరికరాల నిర్వహణకు కూడా ప్రభుత్వం బడ్జెట్ కేటాయిస్తోందని, సమస్యలు రాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని చెప్పారు. ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు, వైద్య శాఖలో ప్రొఫెనల్ ఐడీలు, ? ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లు, ప్రభుత్వ ఆస్పత్రుల మ్యాపింగ్ లాంటి వన్నీ గడువులోగా పూర్తికావాలని చెప్పారు. ప్రభుత్వ ఆశయాలకు, జగనన్న లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం మనందరిపై ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఆయా విభాగాల ఉన్నతాధికారులంతా పాల్గొన్నారు. -
వివక్ష, వివాదం ఉంటేనే జోక్యం
న్యూఢిల్లీ: ప్రభుత్వ పాలనా విధానాల్లో స్పష్టంగా వివక్ష, వివాదకర అంశాలు ఉన్న సందర్భాల్లోనే కోర్టులు కలగజేసుకోవాలని, విధానాలు సవ్యంగా ఉన్నపుడు జోక్యం అనవసరమని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. బోనస్ మార్కుల విషయంలో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఎన్హెచ్ఎం, ఎన్ఆర్హెచ్ఎం సిబ్బంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ను గురువారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎల్.నాగేశ్వర రావు, జస్టిస్ బీఆర్ గవాయ్‌ల ధర్మాసనం విచారించింది. ‘ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ అవసరాలకు తగ్గట్లుగా శిక్షణ పూర్తిచేసుకుని రాజస్తాన్ గ్రామీణ, ఎడారి ప్రాంతాల్లో పనిచేసిన ఆ సిబ్బందికి అదనపు పరిజ్ఞానం, అనుభవం ఉంటుంది. అందుకే వారికి అదనంగా బోనస్ మార్కులు ఇవ్వడం సబబే. ఇలాంటి పరిపాలనా విధానాల్లో కలగజేసుకోవడంలో కోర్టులు తొందరపాటు పనికిరాదు. వివాదాలు ఉంటేనే న్యాయం అందించేందుకు నెమ్మదిగా జోక్యం చేసుకోవాలి’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అనవసర వ్యాఖ్యలొద్దు న్యూఢిల్లీ: ఏదైనా కేసుపై విచారణ జరిపేటప్పుడు దానితో సంబంధం లేని అనవసర వ్యాఖ్యలు చేయద్దని హైకోర్టులకు సుప్రీంకోర్టు సూచించింది. హైకోర్టులు పరిధులను అతిక్రమించరాదని, వాద, ప్రతివాదుల మధ్య వివాదాలకు తలెత్తేలా వ్యవహరించరాదని, అనవసర వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ బి.వి.నాగరత్నతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఓ టెండర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ భారత్ ఫ్రిట్జ్ వెర్నర్ లిమిటెడ్ అనే సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ విషయంలో హైకోర్టు వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. ఢిల్లీ హైకోర్టు కనీసం రిట్ పిటిషన్ అర్హతను కూడా నిర్ణయించలేదని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆక్షేపించింది. కేసుతో సంబంధం లేని అనవసర వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని హితవు పలికింది. -
ఎన్హెచ్ఎం నిధులు వస్తున్నాయ్..
సాక్షి, అమరావతి: జాతీయ ఆరోగ్య కార్యక్రమం(ఎన్హెచ్ఎం) నిధులను రాష్ట్ర ప్రభుత్వం సకాలంలోనే ఖర్చు చేస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. 2019–20వ సంవత్సారానికి గాను రూ.1,683.68 కోట్లు విడుదలవ్వగా అందులో రూ.1,667.97 కోట్లు, 2020–21కి గాను రూ.1,832.72 కోట్లలో రూ.1,812.12 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని తెలిపింది. కేంద్రం నుంచి రావాల్సిన వాటా నిధులు సకాలంలోనే రాష్ట్రానికి వస్తున్నాయని.. రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటా నిధులను సకాలంలోనే విడుదల చేస్తోందని వెల్లడించింది. 2021–22కి గాను ఎన్హెచ్ఎం కింద కేంద్రం రూ.1,237.96 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.825.30 కోట్లు కలిపి మొత్తం రూ.2,063.26 కోట్లు కేటాయించాయని పేర్కొంది. ఇప్పటివరకు కేంద్రం నుంచి రూ.618.99 కోట్లు రావాల్సి ఉండగా రూ.699.78 కోట్లు అందినట్టు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.412.52 కోట్లు మంజూరు చేయాల్సి ఉండగా రూ.466.52 కోట్లు ఇచ్చిందని తెలిపింది. కేంద్ర పథకాల నిర్వహణ కోసం రాష్ట్రాలు నోడల్ ఖాతాలు తెరవాలని ఈ ఏడాది సెప్టెంబర్ 29న కేంద్రం సూచించగా.. ఆ మరుసటి రోజే ఎన్హెచ్ఎం కోసం ప్రత్యేక నోడల్ ఖాతాను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని వివరించింది. ఆ ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.40 కోట్లు జమ చేసిందని ప్రకటించింది. -
మంత్రి ఈటలను కలిసిన ఆయుష్ ఉద్యోగులు
హత్నూర (సంగారెడ్డి): తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ఎన్హెచ్ఎం ఆయుష్ ఉద్యోగుల సం ఘం నాయకులు మంత్రి ఈటల రాజేందర్‌ను శనివారం కలిసి తమ సమస్యలను పరిష్కరిం చాలని కోరినట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఆయుష్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని మంత్రిని కోరినట్లు తెలిపా రు. మంత్రిని కలిసిన వారిలో ఎన్హెచ్ఎం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రావణ్‌కుమార్ నాయకులు సదానందం, దత్తు, రాజేంద్రప్రసాద్, రహీం, శ్రీధర్, రంజిత్, చంద్రమౌళి పాల్గొన్నట్లు ఆయన పేర్కొన్నార -
అరచేతిలో ఆరోగ్యం!
పాలమూరు: జ్వరం వచ్చినప్పుడు లేదా అస్వస్థతకు గురైనప్పుడు సమీపంలోని ఆస్పత్రికి వెళ్తాం.. వైద్యులను సంప్రదించి వారు రాసిచ్చిన మందులు వాడతాం... జబ్బు తగ్గుముఖం పట్టాక మళ్లీ దైనందిన కార్యకలాపాల్లో నిమగ్నమవుతాం.. కానీ కొన్ని వ్యాధులు పూర్తిగా తగ్గినా.. మరికొన్ని అప్పటి వరకే తగ్గినట్లు కనిపించి కొద్దిరోజులకు తిరగబెడతాయి.. తద్వారా ముంచుకొస్తున్న ముప్పును గుర్తించేలోగానే నష్టం జరిగిపోతుంది... ఇలాంటి పోకడల వల్లే దేశంలో నూటికి 60శాతం మరణాలు సంభవిస్తున్నట్లు జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. దీంతో ఆరోగ్యకర సమాజం ఏర్పాటుతో పాటు మరణాల సంఖ్యను తగ్గించడం, వ్యాధులను నియంత్రించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. అధిక రక్తపోటు(బీపీ), మధుమేహం(షుగర్), కేన్సర్, శ్యాసకోస వ్యాధులు, గుండె జబ్బులను గుర్తించడానికి అసంక్రమిత వ్యాధుల(నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్–ఎన్సీడీ) పేరిట సర్వేను ప్రారంభించింది. 30ఏళ్లు దాటిన ప్రతీ మహిళ, పురుషుడి వ్యక్తిగత ఆరోగ్య వివరాలను సేకరించడమే ఈ సర్వే లక్ష్యం. ఈ నేపథ్యంలో అయిదు రకాల వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి అవసరమైన మందులు, వైద్యాన్ని ప్రభుత్వమే ఉచితంగా అందించడానికి ఈ పథకాన్ని రూపొందించింది. ఈ మేరకు 1వ తేదీ నుంచి జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది సర్వే ప్రారంభించారు. ఆరు నెలల్లో లక్ష్యం పూర్తి చేయాలి జిల్లా పరిధిలో 28 పీహెచ్‌సీలు 217 సబ్ సెంటర్ల పరిధిలో ఉన్న 5,62,000 మందికి ఆరు నెలల్లో ఎన్సీడీ కింద పరీక్షలు పూర్తి చేయాలి. ఈనెల 1వ తేదీన సర్వే ప్రారంభం కాగా.. శుక్రవారం వరకు 15,232మందికి పరీక్షలు చేశారు. ఒక్క సబ్‌సెంటర్ పరిధిలో ఇద్దరు ఏఎన్ఎంఎలు, ఆద్దరు ఆశా కార్యకర్తలు కలిసి రోజుకు 30మందిని పరీక్షించాల్సి ఉంటుంది. బీపీ, మధుమేహ పరీక్షలు చేయడమే కాదు బరువు, ఎత్తు, నడుము కొలతలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారు ఉంటే మందులు వాడుతున్నారా, లేదా అనే వివరాలు కూడా ఆరా తీస్తున్నారు. ఇలా సేకరించిన వివరాలను తొలుత రిజిస్టర్లో రాసుకుని ఆ తర్వాత వాటిని ట్యాబ్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. ఆ తర్వాత సమస్త ఆరోగ్య సమాచారాన్ని కార్డులో పొందుపరిచి వారికి అందజేస్తారు. ఎప్పుడైనా ఎక్కడైనా అనుకోకుండా అనారోగ్యానికి గురైతే ఇతర ప్రాంతాల్లోని ఆస్పత్రులకు వెళ్లి చికిత్స పొందాల్సి వచ్చినప్పుడు ఈ కార్డులోని సమాచారం అక్కడి వైద్యులకు ఉపయోగపడుతుంది. తద్వారా మళ్లీ పరీక్షలు చేయాల్సిన సమయం, ఖర్చు కలిసొస్తుంది. అంతేకాకుండా సకాలంలో చికిత్స మొదలుపెట్టే అవకాశం ఉండడంతో ప్రాణాలు కాపాడుకోవచ్చు. పీహెచ్‌సీల్లో ప్రత్యేక విభాగం ప్రతీ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్సీ)ల్లో నాన్ కమ్యూనికబుల్ డీసీజెస్(ఎన్సీడీ) క్లినిక్‌ల పేరిట ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తున్నారు. దీని కోసం సిబ్బందిని సైతం నియమించనున్నారు. ఎండీ స్థాయి వైద్యుడి ఆధ్వర్యంలో ఇద్దరు ఎంబీబీఎస్ వైద్యులు, నలుగురు హెడ్ నర్సులతో ఈ ప్రత్యేక విభాగం పనిచేయనుంది. ఈ కేంద్రాల్లో రోగ నిర్ధారణ చేయనుండగా కేన్సర్‌ను గుర్తించే పరికరాలు సైతం ఎన్సీడీ క్లినిక్‌లకు చేరాయి. ప్రస్తుతం అన్ని గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత సర్వేలో బీపీ, మధుమేహం ఉన్నట్లు తేలిన వారికి ప్రభుత్వమే ఉచితంగా మందులను సరఫరా చేయనుంది. ప్రతీనెల సంబంధిత గ్రామ సబ్ సెంటర్ ఏఎన్ఎం వీటిని అందిస్తారు. పరిధి దాటిన దీర్ఘకాలిక వ్యాధులు, కేన్సర్లతో బాధపడుతున్న వారికి చికిత్స అందించడానికి జిల్లా వైద్యశాలల్లో ఎన్డీసీ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేస్తారు. ఎన్సీడీ అంటే ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందని వ్యాధులను అసంక్రమిత వ్యాధులు(నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్) అంటారు. ఇందులో రక్తపోటు, మధుమేహంతో పాటు మహిళల్లో వచ్చే రొమ్ము, గర్భాశయ ముఖద్వార కేన్స ర్లు, పొగాకు వినియోగించే వారిలో వచ్చే నోటి, గొం తు కేన్సర్లను ఈ పథకం కిందకు తీసుకొస్తున్నారు. గుర్తింపు ఇలా దీర్ఘకాలిక రోగులను గుర్తించడానికి నాలుగు దశల్లో వడబోత జరుగుతోంది. ఆశా కార్యకర్తలు ప్రతీ ఇంటికి వెళ్లి 30ఏళ్లు పైబడిన వారితో మాట్లాడి వారికి ఉన్న వ్యాధుల వివరాలను వైద్యాధికారులు రూపొందించిన సీ–బ్యాక్ దరఖాస్తులో పొందుపరుస్తారు. వీటిని ఏఎన్ఎంలు పరిశీలించి నాలుగు పాయింట్ల కన్నా అధికంగా వచ్చిన వారిని మరోసారి పరీక్షిస్తారు. దీర్ఘకాలిక రోగాల ప్రాథమిక సమాచారాన్ని సంబంధిత హెడ్‌నర్సుకు అందజేస్తారు. హెడ్ నర్సు తన వద్ద ఉండే బీపీ, షుగర్ పరీక్షలు చేసే యంత్రాలతో వ్యాధిగ్రçస్తులను మరోసారి పరీక్షలు నిర్వహించి నిర్ధారణ చేస్తారు. కాగా, కేన్సర్లను గుర్తించేందుకు హెడ్ నర్సులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. గర్భాశయ ముఖద్వారా కేన్సరు గుర్తింపు కోసం ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తారు. మూడు దశల్లో వ్యాధి ఉన్నట్లు అనుమానమొస్తే వారిని వైద్యాధికారి ప్రత్యేకంగా పరీక్షిస్తారు. పకడ్బందీగా ఆరోగ్య పరీక్షలు జిల్లాలో అసంక్రమిత వ్యాధుల గుర్తింపుపై ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలతో సర్వే పకడ్బందీగా జరుగుతోంది. గ్రామాల వారీగా సేకరించిన వివరాల ఆధారంగా చికిత్స అందజేస్తాం. జిల్లాలో ఆరు నెలల పాటు సర్వే కొనసాగుతుంది. రోగ నిర్ధారణ జరిగాక ఒక కార్డు ఇస్తాం. ఇందులో వారి ఆరోగా>్యనికి సంబంధించిన సమగ్ర వివరాలను పొందు పరుస్తాం. వివరాలు సేకరించేందుకు ఇళ్లకు వచ్చే ఆశా కార్యకర్తలకు ప్రజలు సహకరించాలి. పూర్తి ఆరోగ్య వివరాలను దాచుకోకుండా తెలియజేయాలి. అప్పుడే పథకం పూర్తి స్థాయిలో విజయవంతం అవుతుంది. – డాక్టర్ రజిని, డీఎంహెచ్ఓ -
ఐదు కొత్త ఆస్పత్రులు
ప్రత్యేకంగా మాతా శిశుసంరక్షణకు రూ.35 కోట్లతో నిర్మాణం అచ్చంపేట, ఏటూరునాగారం, కామారెడ్డి, మంథని, సూర్యాపేటలో ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: తల్లీ, బిడ్డల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో కొత్తగా ఐదు మాతా శిశుసంరక్షణ ఆస్పత్రులను నిర్మించనుంది. అచ్చంపేట, ఏటూరునాగారం, కామారెడ్డి, మంథని, సూర్యాపేటలో వీటిని నిర్మించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన వైద్యశాఖ ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 50 పడకల సామర్థ్యంతో వీటిని నిర్మించనున్నారు. ఒక్కో ఆస్పత్రి నిర్మాణానికి రూ.7 కోట్ల చొప్పున మొత్తం రూ.35 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) నిధులతో ఈ ఆస్పత్రులను నిర్మించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 23 ప్రసూతి ఆస్పత్రులు ఉన్నాయి. హైదరాబాద్‌లో 5, వరంగల్‌లో 2... ఆదిలాబాద్, నిర్మల్, కరీంనగర్, గోదావరిఖని, జగిత్యాల, ఖమ్మం, భద్రాచలం, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, మహబూబాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, జహీరాబాద్, కామారెడ్డి, తాండూరులో ఒక్కోటి చొప్పున ప్రసూతి వైద్య ఆస్పత్రులు, కేంద్రాలు ఉన్నాయి. మరో ఎనిమిది కేంద్రాల నిర్మాణం కొనసాగుతోంది. కింగ్‌కోటి(హైదరాబాద్), జనగామ, సంగారెడ్డి, ఖమ్మం, కరీంనగర్, తాండూరు, మహబూబ్‌నగర్, నల్లగొండలో ప్రత్యేకంగా ప్రసూతి ఆస్పత్రులను నిర్మిస్తున్నారు. వీటి నిర్మాణం పూర్తి కాగానే కొత్త ఆస్పత్రుల నిర్మాణ ప్రక్రియ మొదలుకానుంది. -
'అనంత'కు జాతీయ ఆరోగ్య మిషన్ బృందం
6, 7 తేదీల్లో నాలుగు ఆస్పత్రులు పరిశీలన అనంతపురం మెడికల్ : జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) బృందం డిసెంబర్ 6, 7 తేదీల్లో జిల్లాలో పర్యటించనుంది. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ, ఎన్హెచ్ఎం ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అనిల్‌కుమార్‌కు సమాచారం అందింది. బెంగళూరుకు చెందిన డాక్టర్ ప్రభుస్వామితో పాటు మరో ఇద్దరు సభ్యులతో కూడిన బృందం 6వ తేదీ అనంతపురం చేరుకుంటుంది. ఉదయం డీఎంహెచ్ఓ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో ప్రోగ్రాం ఆఫీసర్లతో బృందం సభ్యులు సమావేశమవుతారు. మధ్యాహ్నం ముదిగుబ్బ, కదిరి ప్రభుత్వ ఆస్పత్రులను పరిశీలిస్తారు. 7వ తేదీన ధర్మవరం, హిందూపురం జిల్లా కేంద్ర ఆస్పత్రిని తనిఖీ చేస్తారు. ఎన్హెచ్ఎం బృందం రానున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తమ నివేదికలను తయారు చేసుకునే పనిలో పడ్డారు. -
ఎన్హెచ్ఎం నిధుల వివరాలను అందించాలి
డీఎంహెచ్ఓ కొండల్రావు ఖమ్మం వైద్య విభాగం : నేషన్ హెల్త్ మిషన్ ద్వారా వచ్చే నిధుల ఖర్చు వివరాలు ఎప్పటి కప్పుడు అందజేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఏ. కొండల్రావు వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఎస్పీహెచ్ఓలు, వైద్యాధికారులు, సీనియర్ అసిస్టెంట్లలతో ఎన్హెచ్ఎం కార్యక్రమంపై సమీక్ష సమావేశం జరిగింది.డీఎంహెచ్ఓ మాట్లాడుతూ క్లస్టర్ పరిధిలో జరిగే కార్యక్రమాల నివేదికను సరైన సమయంలో పంపించాలని సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్(ఎస్పీహెచ్ఓ)లను ఆదేశించారు. ప్రతీ పీహెచ్సీ పరిధిలో ఏఎన్సీ పరీక్షకు రాని గర్భిణులను గుర్తించి వారికి రిజిస్ట్రేషన్ చేసి సేవలు అందించాలని కోరారు. అగస్టు 10న జరిగే నేషనల్ డీ వార్మింగ్ డే కార్యక్రమాన్ని జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టి పిల్లలకు ఆల్బెండ్ జోల్ మాత్రలు వయస్సును బట్టి వేయాలని సూచించారు. ఎన్హెచ్ఎం డీపీఎంఓ కళావతిబాయి మాట్లాడుతూ ప్రధాన మంత్రి మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రతీ గర్భిణీని పరీక్షించాలన్నారు. ప్రతీనెల న్యూట్రిషన్ డైట్ అందించే విధంగా చూడాలని కోరారు. కార్యక్రమంలో జబ్బార్ జిల్లా కోఆర్డినేటర్ నిర్మల్‌కుమార్, డిప్యూటీ డెమో మంగళాబాయి, అన్నామేరి, నీలోహన, జి. సాంబశివారెడ్డి, జిల్లాలోని ఎస్పీహెచ్ఓలు, వైద్యాధికారులు, సీనియర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. -
ఏమిటో ప్లాన్?
కాంట్రాక్టర్లతో టీఎస్ఎంఐడీసీ ఇంజినీర్ల కుమ్మక్కు రూ.28 కోట్ల నుంచి రూ.66 కోట్లకు చేరిన వ్యయం నిలోఫర్‌లో మాయాజాలం సాక్షి, సిటీబ్యూరో: ఓ చిన్న ఇల్లు కట్టుకోవాలంటేనే మనం నిర్మాణానికి సంబంధించిన ప్లాన్ రూపొందించుకుంటాం. ఆ తర్వాత బడ్జెట్‌పై ఓ అంచనాకు వస్తాం. కానీ ప్రతిష్టాత్మక నిలోఫర్ నవజాత శిశువుల ఆస్పత్రిలో జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) నిధులతో నిర్మించిన నాలుగంతస్తుల రాజీవ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ భవన నిర్మాణాన్ని ప్లానింగ్ లేకుండా చేపట్టారు. అధికారుల అనాలోచిత నిర్ణయాలతో నిర్మాణ ఖర్చులు అంచనాలు దాటిపోయాయి. తీరా పనులన్నీ పూర్తయిన తర్వాత భవనం ఎన్హెచ్ఎం సూచించిన ప్లానింగ్ ప్రకారం లేదని... వార్డులు, మరుగుదొడ్లు, ఆపరేషన్ థియేటర్లు రీమోడిపికేషన్ చేయాల్సి ఉందని... దీనికి మరో రూ.6 కోట్లు ఖర్చవుతుందని కాంట్రాక్టర్ కోరారు. అధికారులు ఏమీ ఆలోచించకుండా దీనికి నిధులు మంజూరు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంచనాకు మించిన ఖర్చులు దేశంలోనే రెండో అతిపెద్దదైన ఈ నవజాత శిశువుల వైద్య కేంద్రం సామర్ధ్యం 500 పడకలు. నిత్యం ఇక్కడ 800 నుంచి 1000 మంది చిన్నారులు చికిత్స పొందుతుంటారు. శిశువుల నిష్పత్తికి తగినన్ని పడకలు, వెంటిలేటర్లు, ఇంక్యుబేటర్లు లేకపోవడంతో ఒక్కో బెడ్డుపై ఇద్దరు, ముగ్గురిని పడుకోబెట్టి చికిత్సలు అందిస్తున్నారు. కొన్ని సమయాల్లో ఈ పడకలు కూడా సరిపోక నేలపైనే పడుకోబెడుతున్నారు. పుట్టుకతోనే వివిధ రకాల జబ్బులతో బాధ పడుతున్న నిరుపేద చిన్నారుల కష్టాలు తీర్చాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఎన్హెచ్ఎం పథకం కింద 2008లో ఆస్పత్రికి రూ.28 కోట్లు కేటాయించింది. జి+2 నిర్మాణానికి 2009లో దివంగత ముఖ్యమంత్రి ైవె ఎస్.రాజశేఖర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆస్పత్రి అవసరాల దృష్ట్యా భవన సామర్థ్యాన్ని జి+4కు పెంచారు. ఆ మేరకు నిధులు పెంచింది. ఏడాది క్రితం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. రూ.60 కోట్లతో నాలుగు అంతస్తుల్లో 400 పడకల సామర్థ్యంతో నిర్మించిన ఈ కొత్త భవనంలో లేబర్ డెలివరీ రికవరీ కాంప్లెక్స్ (ఎల్డీఆర్), మోడల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎంఐసీయూ), హెచ్‌డీయూలు లేకపోవడంపై ఎన్హెచ్ఎం బృందం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతేకాదు... క్యాజువాలిటీ, వార్డులు, ఆపరేషన్ థియేటర్లు, ఇతర నిర్మాణాల్లో అనేక లోపాలు ఉన్నట్లు గుర్తించింది. ఇదిలా ఉంటే ఎప్పటికప్పుడు పనులు పర్యవేక్షించాల్సిన వైద్య మౌలిక సదుపాయాల సంస్థ ఇంజినీర్లు కాంట్రాక్టర్ ఇచ్చే కమిషన్లకు కక్కుర్తి పడడమే ఈ దుస్థితికి కారణమని వైద్యులు అభిప్రాయ పడుతున్నారు. మార్పులు, చేర్పులు అవసరం లేదు ఒకసారి పనులన్నీ పూర్తయిన తర్వాత మళ్లీ రీ మోడిపికేషన్ అంటే నిధులను దుబారా చేయడమే. రాజీవ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో మళ్లీ మోడిపికేషన్ పనులు చేపడితే భవనం ప్రారంభానికి మరో రెండేళ్లు పడుతుంది. రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలు లేకపోవడంతో వచ్చిన వారికి కనీస వసతి కల్పించలేకపోతున్నాం. మార్పులు, చేర్పులతో పని లేకుండా వెంటనే భవనాన్ని ప్రారంభించి రోగులకు అందుబాటులోకి తీసుకురావాలి. అవసరమైతే కేంద్రం తాజాగా మంజూరు చేసిన రూ.6 కోట్లతో ఇదేచోట మరో భవనం నిర్మించవచ్చు. ఈ విషయంపై ప్రభుత్వానికి లేఖ రాశాం. -డాక్టర్ సురేష్ కుమార్, సూపరెంటెండెంట్, నిలోఫర్