'అనంత'కు జాతీయ ఆరోగ్య మిషన్‌ బృందం | NHM coming soon to anantapur | Sakshi
Sakshi News home page

'అనంత'కు జాతీయ ఆరోగ్య మిషన్‌ బృందం

Published Mon, Nov 28 2016 10:58 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

NHM coming soon to anantapur

  • 6, 7 తేదీల్లో నాలుగు ఆస్పత్రులు పరిశీలన
  • అనంతపురం మెడికల్‌ : జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) బృందం డిసెంబర్‌ 6, 7 తేదీల్లో జిల్లాలో పర్యటించనుంది. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ వెంకటరమణ, ఎన్‌హెచ్‌ఎం ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ అనిల్‌కుమార్‌కు సమాచారం అందింది. బెంగళూరుకు చెందిన డాక్టర్‌ ప్రభుస్వామితో పాటు మరో ఇద్దరు సభ్యులతో కూడిన బృందం 6వ తేదీ అనంతపురం చేరుకుంటుంది. ఉదయం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలోని మీటింగ్‌ హాల్‌లో ప్రోగ్రాం ఆఫీసర్లతో బృందం సభ్యులు సమావేశమవుతారు. మధ్యాహ్నం ముదిగుబ్బ, కదిరి ప్రభుత్వ ఆస్పత్రులను పరిశీలిస్తారు. 7వ తేదీన ధర్మవరం, హిందూపురం జిల్లా కేంద్ర ఆస్పత్రిని తనిఖీ చేస్తారు.  ఎన్‌హెచ్‌ఎం బృందం రానున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తమ నివేదికలను తయారు చేసుకునే పనిలో పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement