డీఎంహెచ్‌ఓ, అనంతపురంలో పీఎంఓఏ ఉద్యోగాలు | DMHO Anantapur Recruitment 2021: Ophthalmic Assistant | Sakshi
Sakshi News home page

డీఎంహెచ్‌ఓ, అనంతపురంలో 26 పీఎంఓఏ ఖాళీలు

Published Mon, Mar 29 2021 2:18 PM | Last Updated on Mon, Mar 29 2021 2:21 PM

DMHO Anantapur Recruitment 2021: Ophthalmic Assistant - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

అనంతపురం డీఎంహెచ్‌ఓ.. ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన పారామెడికల్‌ ఆప్తాల్మిక్‌ అసిస్టెంట్లు (పీఎంఓఏ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగానికి చెందిన అనంతపురం జిలా వైద్య, ఆరోగ్యా ధికారి కార్యాలయం(డీఎంహెచ్‌ఓ).. ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన పారామెడికల్‌ ఆప్తాల్మిక్‌ అసిస్టెంట్లు (పీఎంఓఏ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం పోస్టుల సంఖ్య: 26

► అర్హత: ఇంటర్మీడియట్‌ బైపీసీ/ఎంపీసీ ఉత్తీర్ణతతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో గుర్తింపు పొందిన సంస్థలో పారామెడికల్‌ ఆప్తాల్మిక్‌ అసిస్టెంట్‌ కోర్సు /బీఎస్సీ(ఆప్టోమెట్రి)/డిప్లొమా(ఆప్టోమెట్రి) కోర్సు చేసి ఉండాలి. ఏపీ పారామెడికల్‌ బోర్డ్‌లో తప్పనిసరిగా రిజిస్టర్‌ అవ్వాలి. 

వయసు: 01.12.2020 నాటికి 18–42 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం: నెలకు రూ.15,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇంటర్మీడియట్‌లో సాధించిన మార్కులకు–45 మార్కులు, టెక్నీషియన్‌ అర్హతలో సాధించిన మార్కులకు 45 మార్కులు, మిగతా వాటికి 10 మార్కులు..టెక్నికల్‌ ఎగ్జామ్‌ ఉత్తీర్ణులైనప్పటి నుంచి ఏడాదికి ఒక మార్కు చొప్పున కేటాయిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిస్ట్రిక్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఆఫీసర్, అనంతపురం చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 30.03.2021

వెబ్‌సైట్‌: https://ananthapuramu.ap.gov.in

Army Jobs: 502 ఆర్మీ పోస్టులు, నెలకు రూ.35,400

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement