ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో సాంఘిక సంక్షేమ విభాగం గ్రూప్–4 సర్వీస్‌లో బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి అర్హులైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం పోస్టుల సంఖ్య: 59
► పోస్టుల వివరాలు: జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, డ్రైవర్, ఆఫీస్ సబార్డినేట్, అటెండర్, కాపలాదారు, వంట మనిషి.
► అర్హత: చదవడం, రాయడం, ఐదు, ఏడో తరగతి, ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. తెలుగు, ఇంగ్లీష్‌లో టైపింగ్ హయ్యర్‌తోపాటు డ్రైవింగ్ లైసెన్స్, అనుభవం ఉండాలి.
► వయసు: 18 నుంచి 47ఏళ్ల మధ్య ఉండాలి.
► ఎంపిక విధానం: అకడమిక్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఉప సంచాలకులు, సాంఘిక సంక్షేమ శాఖ, ప్రగతి భవనం, ప్రకాశం జిల్లా చిరునామాకు పంపించాలి.
► దరఖాస్తులకు చివరి తేది: 21.07.2021
► వెబ్‌సైట్: https://www.swpksm.in
డీఎంహెచ్‌వో, అనంతపురంలో 16 పీఎంఓ అసిస్టెంట్‌లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం(డీఎంహెచ్‌వో).. అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పారా మెడికల్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్(పీఎంఓఏ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం పోస్టుల సంఖ్య: 16
► అర్హత: ఎంపీసీ/బైపీసీ గ్రూపులతో ఇంటర్మీడియట్‌తోపాటు పారామెడికల్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్ కోర్సు/బీఎస్సీ(ఆప్టోమెట్రీ)/డిప్లొమా(ఆప్టోమెట్రిక్)/డిప్లొమా (ఆప్టోమెట్రీ) ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థి ఏపీ పారామెడికల్ బోర్డులో తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండాలి.
► వయసు: 01.12.2020 నాటికి 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి.
► వేతనం: నెలకు రూ.15,000 చెల్లిస్తారు.
► ఎంపిక విధానం: దీనిని 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో 45 మార్కులు విద్యార్హత(ఇంటర్మీడియట్)లో సాధించిన మార్కులకు, మరో 45 మార్కులు టెక్నీషియన్ విద్యార్హతలో సాధించిన మార్కులకు, మిగిలిన 10 మార్కులు వయసుకు కేటాయిస్తారు. రిజర్వేషన్ నిబంధనలను పరిగణ నలోకి తీసుకుంటారు.
► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం, అనంతపురం, ఏపీ చిరునామాకు పంపించాలి.
► దరఖాస్తు ప్రారంభ తేది: 15.07.2021
► దరఖాస్తులకు చివరి తేది: 21.07.2021
► వెబ్‌సైట్: https://ananthapuramu.ap.gov.in
Comments
Please login to add a commentAdd a comment