Andhra Pradesh : DHM, DMHO And Faculty Notification 2021 Vacancies, Salary Details - Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు చేయండి

Published Mon, Sep 6 2021 7:08 PM | Last Updated on Sun, Oct 17 2021 4:12 PM

Andhra Pradesh NHM, DMHO, Faculty Recruitment 2021: Vacancies, Salary - Sakshi

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న పోస్తుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ అయింది. జిల్లాల వారిగా ఖాళీలు, అర్హతలు, వేతనాలు, ఇతర  వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

ఎన్‌హెచ్‌ఎం, ఆంధ్రప్రదేశ్‌లో 858 ఖాళీలు
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కార్యాలయం.. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) కింద రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల డీఎంహెచ్‌ఓల ద్వారా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 858
► పోస్టుల వివరాలు: స్పెషలిస్ట్‌లు–53, మెడికల్‌ ఆఫీసర్లు–308, స్టాఫ్‌ నర్సులు–324, ల్యాబ్‌ టెక్నీషియన్లు–14, పారామెడికల్‌ స్టాఫ్‌–90, కన్సల్టెంట్‌–13, సపోర్ట్‌ స్టాఫ్‌–56.

► అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, జీఎన్‌ఎం/బీఎస్సీ(నర్సింగ్‌), డీఎంఎల్‌ /టీఎంఎల్‌టీ/బీఎస్సీ(ఎంఎల్‌టీ), సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంఎస్‌డబ్ల్యూ/ ఎంఏ(సోషల్‌ వర్క్‌), ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

► వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.12,000 నుంచి రూ.1,10,000 వరకు చెల్లిస్తారు.

► ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సంబంధిత జిల్లాల వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయాలకు దరఖాస్తు చేసుకోవాలి.

► దరఖాస్తులకు చివరి తేది: 15.09.2021

► వెబ్‌సైట్‌: visakhapatnam.ap.gov.in

డీఎంహెచ్‌వో, కృష్ణా జిల్లాలో 55 మెడికల్‌ స్టాఫ్‌ పోస్టులు
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన కృష్ణా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్‌వో).. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌(ఎన్‌హెచ్‌ ఎం) ద్వారా ఒప్పంద ప్రాతిపదికన మెడికల్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 55

► పోస్టుల వివరాలు: సైకియాట్రిస్ట్‌లు–01, ఫోరెన్సిక్‌ స్పెషలిస్ట్‌లు–01, జనరల్‌ ఫిజీషియన్‌–01, కార్డియాలజిస్ట్‌–01, మెడికల్‌ ఆఫీసర్లు–20, స్టాఫ్‌ నర్సు–17, ల్యాబ్‌ టెక్నీషియన్‌–02, ఫిజియోథెరపిస్ట్‌/ఆక్యుపే షనల్‌ థెరపిస్ట్‌–02, ఆడియోమెట్రీషియన్‌–03, సోషల్‌ వర్కర్‌–02, కన్సల్టెంట్‌/క్వాలిటీ మానిటర్‌–01, హాస్పిటల్‌ అటెండెంట్‌–02, శానిటరీ అటెండెంట్‌–02.

► అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, జీఎన్‌ఎం/బీఎస్సీ(నర్సింగ్‌), బ్యాచిలర్స్‌ డిగ్రీ(ఫిజియోథెరపీ), ఎంఎస్‌డబ్ల్యూ/ఎంఏ (సోషల్‌ వర్క్‌), ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి.

► వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.12,000 నుంచి రూ.1,10,000 వరకు చెల్లిస్తారు.

► ఎంపిక విధానం: స్పెషలిస్ట్‌ డాక్టర్‌ పోస్టులకు(సైకియాట్రిస్ట్‌లు, ఫోరెన్సిక్‌ స్పెషలిస్ట్‌లు, జనరల్‌ ఫిజీషియన్, కార్డియాలజిస్ట్‌)వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. మిగతా పోస్టుల్ని టెక్నికల్‌ అర్హతలు, అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు.

► వాక్‌ ఇన్‌ తేదీలు: 2021, సెప్టెంబర్‌ 02 నుంచి 08 వరకు

► దరఖాస్తులకు చివరి తేది: 13.09.2021

► వెబ్‌సైట్‌: https://krishna.ap.gov.in

డీఎంహెచ్‌వో, ప్రకాశంలో 61 ఖాళీలు
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ప్రకాశం జిల్లా వైద్య,ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్‌వో)..నేషనల్‌ హెల్త్‌ మిషన్‌(ఎన్‌ హెచ్‌ ఎం) ద్వారా ఒప్పంద/అవుట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 61

► పోస్టుల వివరాలు: మెడికల్‌ ఆఫీసర్లు–23, స్టాఫ్‌ నర్సులు–26, సైకియాట్రిక్‌ నర్స్‌–01, ఫిజియోథెరపిస్ట్‌/ఆక్యుపేషనల్‌ థెరపిస్ట్‌–02, ఆటోమెట్రీషియన్‌–02, సోషల్‌ వర్కర్‌–02, కన్సల్టెంట్‌–క్వాలిటీ మానిటర్‌–01, హాస్పిటల్‌ అటెండెంట్‌–02, శానిటరీ అటెండెంట్‌–02.

► అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, జీఎన్‌ఎం/బీఎస్సీ(నర్సింగ్‌), బ్యాచిలర్స్‌ డిగ్రీ(ఫిజియోథెరపీ), ఎంఎస్‌డబ్ల్యూ/ ఎంఏ (సోషల్‌ వర్క్‌), ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి.

► వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.12,000 నుంచి రూ.53,495 వరకు చెల్లిస్తారు.

► ఎంపిక విధానం: అర్హత పరీక్షల్లో సాధించిన మార్కులు, అనుభవం ఆధారంగా ఎంపికచేస్తారు.

► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా మెడికల్‌–హెల్త్‌ ఆఫీస్, ప్రకాశం జిల్లా, ఒంగోలు, జీజీహెచ్, కాంపౌండ్, ఒంగోలు చిరునామకు పంపించాలి.

► దరఖాస్తులకు చివరి తేది: 15.09.2021

► వెబ్‌సైట్‌: https://prakasam.ap.gov.in

డీఎంహెచ్‌వో, శ్రీకాకుళంలో 71 మెడికల్‌ స్టాఫ్‌ కొలువులు
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన  శ్రీకాకుళం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్‌వో).. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ ఎం) ద్వారా ఒప్పంద/అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపది కన మెడికల్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 71

► పోస్టుల వివరాలు: సైకియాట్రిస్ట్‌–01, ఫోరెన్సిక్‌ స్పెషలిస్ట్‌–01, జనరల్‌ ఫిజిషియన్‌–01, ఎన్‌పీసీడీసీ ౖÐð ద్యాధికారులు–11, ఎన్‌బీఎస్‌యూసీ వైద్యాధికారులు–07, స్టాఫ్‌ నర్సులు–15, సెకియాట్రిక్‌ నర్స్‌–01, జిరియాట్రిక్‌/పెల్లవేటివ్‌ కేర్‌ నర్సులు–03, మెడికల్‌ కాలేజి ల్యాబ్‌ టెక్నీషియన్‌లు–19, ఫ్లోరోసిస్‌ ల్యాబ్‌ టెక్నీషియన్లు–01, ఎన్‌పీహెచ్‌సీఈ ఫిజియోథెరపిస్ట్‌/ఆక్యుపేషనల్‌ థెరపిస్ట్‌–02, ఆడియో మెట్రీషియన్‌–02, ఎన్‌ఎంహెచ్‌పీ సోషల్‌ వర్కర్‌–01, ఎన్‌టీసీపీ సోషల్‌ వర్కర్‌–01, కన్సల్టెంట్‌ క్వాలిటీ మానిటర్‌–01, ఎన్‌పీహెచ్‌సీఈ హాస్పిటల్‌ అటెండెంట్‌–02, ఎన్‌పీహెచ్‌సీఈ అటెండెంట్‌–02.

► అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, జీఎన్‌ఎం /బీఎస్సీ(నర్సింగ్‌), బీపీటీ, ఎంఎస్‌డబ్ల్యూ/ ఎంఏ, ఎంబీబీఎస్, మెడికల్‌ పీజీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్య, ఆరోగ్యాశాఖాధికారి కార్యాలయం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్‌ చిరునామకు పంపించాలి.

► దరఖాస్తులకు చివరి తేది: 15.09.2021

► వెబ్‌సైట్‌: srikakulam.ap.gov.in

ఐఐఎం, విశాఖపట్నంలో ఫ్యాకల్టీ పోస్టులు
విశాఖపట్నంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం).. వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► పోస్టులు: ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌.

► విభాగాలు: డెసిషన్‌ సైన్స్, ఎంట్రప్రెన్యూర్‌షిప్, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్, ఆర్గనైజేషనల్‌∙బిహేవియర్‌ అండ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్, పబ్లిక్‌ పాలసీ, ఎకనామిక్స్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంటింగ్, మార్కెటింగ్, ప్రొడక్షన్‌ అండ్‌ ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్, స్ట్రాటజీ తదితరాలు.

► అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో పీహెచ్‌డీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

► ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, సెమినార్‌ ప్రజంటేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

► దరఖాస్తు విధానం: ఈమెయిల్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సీనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్, ఐఐఎం విశాఖపట్నం, ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌–530003 చిరునామకు పంపించాలి.

► ఈమెయిల్‌: facultyrecruit2021sep@iimv.ac.in

► ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 24.09.2021

► దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 01.10.2021

► వెబ్‌సైట్‌: www.iimv.ac.in

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement