వైద్యుల ఎంపిక జాబితా విడుదల | The choice of doctors list is released | Sakshi
Sakshi News home page

వైద్యుల ఎంపిక జాబితా విడుదల

Published Wed, Aug 9 2017 10:55 PM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM

The choice of doctors list is released

  •  17న డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో కౌన్సెలింగ్‌
  • అనంతపురం మెడికల్‌(అనంతపురం): జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి ఎంపిక జాబితాను బుధవారం విడుదల చేశారు. వీటిని  www.anantapuramu.ap.gov.in వెబ్‌సైట్‌లో ఉంచినట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ వెంకటరమణ తెలిపారు. ఈ నెల 17న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో కౌన్సెలింగ్‌ ప్రక్రియ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కాగా, 37 పోస్టులకు గతంలోనే నోటిఫికేషన్‌ జారీ చేసి కౌన్సెలింగ్‌ చేపట్టగా 23 మంది మాత్రమే హాజరయ్యారు. వీరిలో 17 మంది మాత్రమే విధుల్లో చేరారు. దీంతో రెండో జాబితా తయారు చేయగా కలెక్టర్‌ వీరపాండియన్‌ ఆమోదముద్ర వేశారు. మూడు బ్యాక్‌లాగ్‌ (ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్‌ అభ్యర్థుల కోసం కేటాయించినవి) పోస్టులుండగా 17 మందితో  జాబితా విడుదలైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement