
సాక్షి, అమరావతి: జాతీయ ఆరోగ్య కార్యక్రమం(ఎన్‌హెచ్‌ఎం) నిధులను రాష్ట్ర ప్రభుత్వం సకాలంలోనే ఖర్చు చేస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. 2019–20వ సంవత్సారానికి గాను రూ.1,683.68 కోట్లు విడుదలవ్వగా అందులో రూ.1,667.97 కోట్లు, 2020–21కి గాను రూ.1,832.72 కోట్లలో రూ.1,812.12 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని తెలిపింది. కేంద్రం నుంచి రావాల్సిన వాటా నిధులు సకాలంలోనే రాష్ట్రానికి వస్తున్నాయని.. రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటా నిధులను సకాలంలోనే విడుదల చేస్తోందని వెల్లడించింది.
2021–22కి గాను ఎన్‌హెచ్‌ఎం కింద కేంద్రం రూ.1,237.96 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.825.30 కోట్లు కలిపి మొత్తం రూ.2,063.26 కోట్లు కేటాయించాయని పేర్కొంది. ఇప్పటివరకు కేంద్రం నుంచి రూ.618.99 కోట్లు రావాల్సి ఉండగా రూ.699.78 కోట్లు అందినట్టు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.412.52 కోట్లు మంజూరు చేయాల్సి ఉండగా రూ.466.52 కోట్లు ఇచ్చిందని తెలిపింది. కేంద్ర పథకాల నిర్వహణ కోసం రాష్ట్రాలు నోడల్ ఖాతాలు తెరవాలని ఈ ఏడాది సెప్టెంబర్ 29న కేంద్రం సూచించగా.. ఆ మరుసటి రోజే ఎన్‌హెచ్‌ఎం కోసం ప్రత్యేక నోడల్ ఖాతాను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని వివరించింది. ఆ ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.40 కోట్లు జమ చేసిందని ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment