
న్యూఢిల్లీ:ప్యాకింగ్‌పై విక్రేతల పేరు, చిరునామా, ఫిర్యాదుల పరిష్కార అధికారి నంబర్‌ను స్పష్టంగా, అందుబాటులో ఉండే పద్ధతిలో ఈ–కామర్స్ సంస్థలు ప్రదర్శించాల్సిందేనని సెంట్రల్ కంజ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) స్పష్టం చేసింది. ఈ మేరకు సీసీపీఏ అన్ని రాష్ట్రాలు, పారిశ్రామిక సంఘాలకు సమాచారమిచ్చింది.
వినియోగదార్ల రక్షణ (ఈ–కామర్స్) నిబంధనలు–2020 ప్రకారం విక్రేతల వివరాలు పొందుపర్చడం లేదంటూ ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో సీసీపీఏ స్పందించింది. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టం కింద చర్య తీసుకుంటామని సీసీపీఏ కమిషనర్ అనుపమ్ మిశ్రా తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్–జూలైలో దేశవ్యాప్తంగా నేషనల్ కంజ్యూమర్ హెల్ప్‌లైన్‌కు ఈ–కామర్స్ కంపెనీల మీద 69,208 ఫిర్యాదులు అందాయి. బ్యాంకింగ్, టెలికం రంగాలతో పోలిస్తే ఇవే అధికం.
Comments
Please login to add a commentAdd a comment