
సాక్షి, న్యూఢిల్లీ: రాఫెల్ జెట్ కొనుగోళ్లు వివాదం మరింత ముదురుతోంది. 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశంపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్డు నేడు (అక్టోబర్ 31, బుధవారం) విచారించింది. ఈ సందర్భంగా కేంద్రానికి సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ డీల్ పై పూర్తి వివరాలను సమర్పించాల్సిందిగా కోరింది. పదిరోజుల్లోగా నివేదికలను అందించాల్సిందిగా ఆదేవించింది. కాంగ్రెస్ నేతలు మాజీ కేంద్ర మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది.
రాఫెల్ ఒప్పందంలో భాగంగా అనిల్ అంబానీకి చెందిన డిఫెన్స్ సంస్థకు ఈ కాంట్రాక్టును ఎలా అందించారో చెప్పాలని కూడా అత్యున్నత న్యాయస్థానం కోరింది. ఒక్కొక్క రాఫెల్‌ను ఎంత ధర పెట్టి కొన్నారో స్పష్టం చేయాలని సుప్రీం కేంద్రాన్ని డిమాండ్ చేసింది. మరో పది రోజుల్లోగా సీల్డు కవర్‌లో రాఫెల్ ఖరీదు వివరాలను పంపాలని సుప్రీం ఆదేశించింది. అలాగే ఈ ఒప్పందం కోసం జరిగిన వ్యూహాత్మక వివరాలు ఏమైనా ఉంటే వాటిని కూడా స్పష్టం చేయాలని కోర్టు పేర్కొంది.
కాగా ప్రభుత్వ రంగ సంస్థ ను కాదని రిలయన్స్ డిఫెన్స్ సంస్థకు రాఫెల్ డీల్‌ను అప్పగించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది. ముఖ్యంగా కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment