sealed cover
-
Gyanvapi: కోర్టుకు చేరిన జ్ఞానవాపి సర్వే నివేదిక
వారణాసి: వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో చేపట్టిన శాస్త్రీయ సర్వే నివేదికను సోమవారం ఏఎస్ఐ(ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా) అధికారులు సీల్డు కవర్లో వారణాసి జిల్లా కోర్టుకు సమర్పించారు. దీనిపై ఈ నెల 21న విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. వారణాసిలోని ప్రఖ్యాత కాశీ విశ్వేశ్వరుని ఆలయాన్ని ఆనుకుని ఉన్న 17వ శతాబ్ధం నాటి మసీదును అప్పట్లో ఉన్న ఆలయంపైనే నిర్మించారంటూ అందిన పలు పిటిషన్లపై కోర్టు సర్వే చేపట్టాలని జూలైలో ఆదేశించిన విషయం తెలిసిందే. సర్వే నివేదిక ప్రతులను ముస్లిం పక్షం వారికి కూడా ఏఎస్ఐ అధికారులు అందజేసినట్లు హిందూ పిటిషనర్ల తరఫున న్యాయవాది మదన్ మోహన్ యాదవ్ వెల్లడించారు. తదుపరి విచారణ 21న ఉంటుందని కోర్టు పేర్కొందని తెలిపారు. సర్వే నివేదిక వివరాలను బహిర్గతం చేయరాదంటూ ముస్లిం పక్షం కోర్టులో వేసిన పిటిషన్‌ను తాము సవాల్ చేస్తామన్నారు. మసీదు వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతల శిల్పాల వద్ద పూజలు చేసేందుకు అనుమతించాలంటూ కొందరు మహిళలు వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జూలై 21న జిల్లా కోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత నిర్మాణాలకు ఎటువంటి నష్టం కలగని రీతిలో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించుకుని శాస్త్రీయంగా సర్వే చేపట్టాలని ఏఎస్ఐకి పురమాయించింది. ‘మసీదు గోపురాలు, సెల్లార్లు, పశ్చిమ దిక్కు గోడ కింద సర్వే చేయాలి. పిల్లర్ల వయస్సును నిర్ధారించాలి. భవనం రీతిని విశ్లేషించాలి’అని సూచించింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించగా చుక్కెదురైంది. ఏఎస్ఐ అధికారులు సకాలంలో సర్వేను పూర్తి చేయలేకపోవడంతో కోర్టు ఆరు పర్యాయాలు గడువును పొడిగించింది. కృష్ణ జన్మభూమి–షాహీ ఈద్గా కేసు విచారణ వాయిదా ప్రయాగ్‌రాజ్: మథురలోని కృష్ణ జన్మభూమి ఆలయాన్ని ఆనుకుని ఉన్న షాహీ ఈద్గా మసీదు ఆవరణలో సర్వే చేపట్టాలన్న అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను ముస్లిం పక్షం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై వచ్చే జనవరి 9వ తేదీన విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించిందని ముస్లిం పక్షం అలహాబాద్ హైకోర్టుకు తెలిపింది. దీంతో, సర్వే కమిషన్ విధివిధానాలు, కూర్పుపై సోమవారం జరగాల్సిన విచారణను హైకోర్టు వాయిదా వేసింది. హిందూ ఆలయంపైనే మసీదును నిర్మించినట్లు ఆనవాళ్లు ఉన్నాయంటూ కొందరు వేసిన పిటిషన్‌పై గురువారం విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు.. మసీదు సర్వేను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా అధికారిని నియమించేందుకు అంగీకరించింది. -
‘పైగా’ భూములపై.. అవి తప్పుడు తీర్పు నివేదికలే..
సాక్షి, హైదరాబాద్: ‘పైగా’భూములకు సంబంధించి 1998లో ఇచ్చిన తీర్పు కాపీని సీల్డ్ కవర్లో హైకోర్టుకు రిజిస్ట్రార్ సమర్పించారు. సెపె్టంబర్ 15న విచారణ సందర్భంగా ఆదేశాలు జారీ చేయడంతో ఈ మేరకు నివేదిక అందజేశారు. పిటిషనర్ పేర్కొన్నట్లు ‘పైగా’భూములపై 1998లో హైకోర్టు ఏ తీర్పునూ ఇవ్వలేదని, అసలు పిటిషనర్ పేర్కొన్న పిటిషన్లే నమోదు కాలేదని ఆ నివేదికలో పేర్కొన్నారు. దీంతో తాము తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని పిటిషనర్‌ను ఆదేశిస్తూ, స్టేటస్ కో ఉత్తర్వులు కొనసాగుతాయని హైకోర్టు స్పష్టం చేసింది. అక్టోబర్ 13కు విచారణను వాయిదా వేసింది. 50ఎకరాల భూములపై వివాదం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ గ్రామంలోని దాదాపు 50 ఎకరాల భూమిని తన పూర్వికులు పైగా(సైన్యం నిర్వహణకు పరిహారంగా నిజాం నవాబ్ మంజూరు చేసిన భూమి) యజమానుల నుంచి కొనుగోలు చేశారని, అన్ని డాక్యుమెంట్లు ఉన్నా హెచ్ఎండీఏ అధికారులు, పోలీసులు జోక్యం చేసుకుని ఇబ్బందులు కల్పిస్తున్నారని పేర్కొంటూ హైదరాబాద్ వట్టేపల్లికి చెందిన యహియా ఖురేషి హైకోర్టులో రెండు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కేజీ రాఘువన్, ప్రభుత్వం తరఫున బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. బోగస్ డాక్యుమెంట్లు, రశీదులు సృష్టించి కోర్టును తప్పదారి పట్టించి అత్యంత విలువైన ప్రాంతంలో దాదాపు 50 ఎకరాలకుపైగా భూమిని స్వాహా చేసేందుకు యత్నిస్తున్నారని ఏజీ గతంలో వాదనలు వినిపించారు. 2007, 2012లో జారీ చేసి న రసీదులు పూర్తిగా నకిలీవని.. తప్పుడు రసీదులను, కోర్టు తీర్పు ఉత్తర్వుల డాక్యుమెంట్లను ఆయ న ఈ సందర్భంగా ధర్మాసనం ముందు ఉంచారు. 2007నాటికి తెలంగాణ రాష్ట్రం ఎక్కడుంది? 2007 నాటికి తెలంగాణ రాష్ట్రమే లేదని, రసీదుల్లో మాత్రం అలా పేర్కొన్నారని, అలాగే శంషాబాద్ గ్రామం రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉండగా, హైదరాబాద్ అని మరో రసీదులో ఉందన్నారు. దీనిపై పూర్తిగా విచారణ జరిపి సీల్డ్ కవర్లో నివేదిక అందజేయాలని జుడీషియల్ రిజిస్ట్రార్‌ను హైకోర్టు ఆదేశించింది. శుక్రవారం ఈ మేరకు నివేదిక అందజేసింది. అనంతరం ధర్మాసనం.. ఈ నివేదిక కాపీలను అక్టోబర్ 3లోగా పిటిషనర్‌కు, ప్రభుత్వానికి కూడా అందజేయాలని ఆదేశిస్తూ, విచారణను వాయిదా వేసింది. -
చావును ముందే ఊహించిన అతీక్ అహ్మద్? రెండు వారాల క్రితమే రహస్య లేఖ!
ప్రయాగ్‌రాజ్/న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ తన చావును ముందే ఊహించినట్లున్నాడు. అందుకే రెండు వారాల ముందే ఓ లేఖ రాసి సీల్డ్ కవర్లో భద్రంగా దాచిపెట్టాడు. తాను చనిపోతే దాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి(సీజేఐ), యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు అందజేయాలని కోరాడు. ఈ విషయాన్ని అతీక్ న్యాయవాది విజయ్ మిశ్రా మంగళవారం వెల్లడించారు. ‘‘అందులో ఏముందో నాకు తెలియదు. అతీక్ కోరిక మేరకు సీల్డ్ కవర్లో సీజేఐకి, సీఎంకు పంపుతా’’ అని చెప్పారు. హత్యపై సుప్రీంకోర్టులో 24న విచారణ అతీక్ సోదరుల హత్యోదంతంపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ‘‘దీన్ని అత్యవసరంగా విచారణకు స్వీకరించండి. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సారథ్యంలో స్వతంత్ర దర్యాప్తు సాగేలా చూడండి. 2017 నుంచి యూపీలో జరిగిన 183 పోలీస్ ఎన్కౌంటర్లపై ఎంక్వైరీకి ఆదేశించండి’’ అని న్యాయవాది విశాల్ తివారీ మంగళవారం సుప్రీంకోర్టును కోరారు. దీనిపై ఏప్రిల్ 24న విచారణ జరుపుతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. యోగి పాలనలో ఆరేళ్లలో ఎన్కౌంటర్లలో 183 మంది నేరగాళ్లు హతమయ్యారని యూపీ స్పెషల్ డీజీపీ (శాంతిభద్రతలు) ప్రకటించడం తెల్సిందే. మరోవైపు, ప్రయాగ్‌రాజ్‌లో అతీక్ లాయర్నని చెప్పుకుంటున్న దయాశంకర్ మిశ్రా నివాసం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు బాంబు విసిరారు. ఎవరికీ హాని జరగలేదు. ఇక ఏ మాఫియా బెదిరించలేదు: యోగి లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఇకపై ఎలాంటి మాఫియా కూడా బెదిరింపులకు పాల్పడబోదని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. అతీక్ సోదరుల హత్య నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మంగళవారం లక్నో, హర్దోయీ జిల్లాల్లో టెక్స్టైల్ పార్కుల ఏర్పాటుపై కేంద్రంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంగా యోగి మాట్లాడారు. ‘‘గతంలో రాష్ట్రాన్ని మాఫియా, నేరగాళ్లు కష్టాలపాలు జేశారు. ఇప్పుడు వాళ్లే కష్టాలు పడుతున్నారు’’ అన్నారు. ‘సమాజ్‌వాదీ పార్టీ హయాంలో 2012–2017 మధ్య రాష్ట్రంలో 700 అల్లర్ల ఘటనలు చోటుచేసుకున్నాయి. అంతకుముందు బీఎస్పీ హయాంలో 364కు పైగా జరిగాయి. మా ప్రభుత్వం వచ్చాక 2017 నుంచి ఒక్క అల్లర్ల ఘటన లేదు. కర్ఫ్యూ లేదు. పరిశ్రమలు, వ్యాపారాలకు అనువైన వాతావరణం నెలకొంది. పెట్టుబడిదారుల భద్రత మా బాధ్యత’’ అని చెప్పారు. -
కోర్టులో పారదర్శకత ముఖ్యం.. ఏమిటీ సీల్డ్ కవర్ సంస్కృతి?: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: మాజీ సైనికోద్యోగుల వన్ ర్యాంక్, వన్ పెన్షన్ (ఓఆర్ఓపీ) తాలూకు రూ.28,000 కోట్ల బకాయిలను వచ్చే ఫిబ్రవరికల్లా చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ విషయమై గతేడాది తామిచ్చిన ఉత్తర్వులకు కట్టుబడి ఉండాల్సిందేనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు పి.ఎస్.నరసింహ, జె.బి.పార్డీవాలా ధర్మాసనం స్పష్టం చేసింది. ఓఆర్ఓపీ బకాయిలపై భారీ మాజీ సైనికోద్యోగుల ఉద్యమం (ఐఈఎస్ఎం) పిటిషన్‌పై సోమవారం ధర్మాసనం విచారణ జరిపింది. బకాయిల చెల్లింపునకు కాలావధిని ఖరారు చేసింది. దీనిపై కేంద్రం సీల్డ్ కవర్లో సమర్పించిన నోట్‌ను స్వీకరించేందుకు నిరాకరించింది. ఈ సంస్కృతి సముచిత న్యాయ ప్రక్రియకు విరుద్ధమని సీజేఐ అభిప్రాయపడ్డారు. దానికి తెర పడాలన్నారు. ‘‘వ్యక్తిగతంగా కూడా సీల్డ్ కవర్లకు నేను వ్యతిరేకిని. కోర్టులో పారదర్శకత చాలా ముఖ్యం. అంతిమంగా ఉత్తర్వులను అమలు చేయాల్సిందే. అందులో రహస్యమేముంటుంది?’’ అని ప్రశ్నించారు. -
‘స్టాక్ మార్కెట్ల’పై సుప్రీంకోర్టు కమిటీ
న్యూఢిల్లీ: స్టాక్ట్ మార్కెట్లపై నియంత్రణ చర్యలను బలోపేతం చేయడానికి నిపుణుల కమిటీ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం చేసిన సూచనలను సీల్డ్ కవర్లో స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మదుపరుల ప్రయోజనాలను కాపాడే విషయంలో పూర్తి పారదర్శకత కావాలని తాము కోరుకుంటున్నట్లు స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రతిపాదిత నిపుణుల కమిటీ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి సిట్టింగ్ జడ్జిని నియమించడం సాధ్యం కాదని పేర్కొంది. అదానీ గ్రూప్ కంపెనీలపై హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత మదుపరులు భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లపై నియంత్రణ చర్యలను బలోపేతం చేయాలని, ఇందుకోసం సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయాలని, మదుపరుల ప్రయోజనాలను కాపాడాలని కోరుతూ న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్, ఎంఎల్ శర్మతోపాటు పలువురు సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు(పిల్స్) దాఖలు చేశారు. వీటిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస జేబీ పార్దివాలాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. నియంత్రణ చర్యలను బలోపేతం చేయడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని గత విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. కమిటీ సభ్యుల పేర్లు, విధివిధానాలను శుక్రవారం సీల్డ్ కవర్లో అందజేయగా, ధర్మాసనం స్వీకరించలేదు. ప్రభుత్వం సూచించిన సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తే అది పూర్తిగా ప్రభుత్వ కమిటీ అవుతుందని అభిప్రాయపడింది. పారదర్శకత కావాలి కాబట్టి తామే ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని, తద్వారా న్యాయస్థానంపై ప్రజలకు విశ్వాసం పెరుగుతుందని వెల్లడించింది. ఇకపై సిట్టింగ్ న్యాయమూర్తులు ఈ అంశాన్ని విచారిస్తారని, కమిటీలో మాత్రం వారు సభ్యులుగా ఉండబోరని తెలిపింది. -
Adani Row: కేంద్రానికి సుప్రీం ఝలక్
సాక్షి, ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సమర్పించిన సీల్డ్ కవర్‌ను సుప్రీం కోర్టు శుక్రవారం తిరస్కరించింది. అదానీ స్టాక్ పతనం తర్వాత ఇన్వెస్టర్ల సంపదను సంరక్షించేందుకు పటిష్ట యంత్రాంగం అవసరమని సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. కమిటీ ఏర్పాటుకు కేంద్రం ఓకే చెప్పింది. అయితే ప్యానెల్ వివరాలను కేంద్రం సీల్డ్ కవర్లో సమర్పించగా.. సుప్రీం దానిని తిరస్కరించింది. ‘నియంత్రణ చర్యలను బలోపేతం చేయడానికి, పెట్టుబడిదారులను రక్షించడానికి’ ఏర్పాటు చేయబోయే ప్యానెల్ వివరాల ప్రతిపాదనలను ‘సీల్డ్’ కవర్లో ఇవ్వడం సరికాదు. మాకు సీల్డ్ కవర్ అక్కర్లేదు. మేము పూర్తి పారదర్శకతను కోరుకుంటున్నాము. మేము ఈ సూచనలను అంగీకరిస్తే.. అది మేం కోరుకోని, ప్రభుత్వం నియమించిన కమిటీగా కనిపిస్తుంది. ఆ నిర్ణయం మాకే వదిలివేయండి అని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. కమిటీపై తన ఉత్తర్వులను రిజర్వ్‌లో ఉంచింది. కోట్లాది ఇన్వెస్టర్ల సంపదను తుడిచిపెట్టి, విపక్షాల నుంచి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలకు కారణమైంది అదానీ స్టాక్స్ పతన వ్యవహారం. ఈ వ్యవహారాన్ని పరిశీలించేందుకు ఓ న్యాయమూర్తితో సహా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోర్టు గత వారం కేంద్రాన్ని కోరింది. ఈ నేపథ్యంలోనే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజి బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేసేందుకు ప్యానెల్ ఏర్పాటుకు కేంద్రం రెడీ అయ్యింది. ఇక అదానీ వ్యవహారం కేసులో సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లు ఇలా ఉన్నాయి. అదానీ కంపెనీల అడిటింగ్ వివరాలతో పాటు బ్యాంక్ రుణాల ఇచ్చిన షేర్ల విలువ తెలియజేయాలని కోరారు. మరో పిటిషన్లో అడ్వొకేట్ ఎంఎల్ శర్మ.. హిండెన్‌బర్గ్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేశారు. సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ హిండెన్‌వర్గ్ నివేదికపై సుప్రీం కోర్టు ఆధారిత సిట్‌ను దర్యాప్తు కోసం ఏర్పాటు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఇక హిండెన్‌బర్గ్ నివేదికపై దర్యాప్తునకు తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని కేంద్రం ఇదివరకే సుప్రీంకు తెలిపింది కూడా. -
జస్టిస్ గౌతమ్ పటేల్ కీలక వ్యాఖ్యలు
ముంబై : ముంబై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గౌతం పటేల్ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. నేషనల్ స్టాక్ఎక్స్చేంజ్ ఏజెంట్‌గా ఉన్న అనుగ్రహ్ స్టాక్ అండ్ బ్రోకరేజ్ సంస్థ పలు ఆర్థిక అక్రమాలకు పాల్పడిన కేసులో సమాచారాన్నంతటినీ సీల్డ్ కవర్లో అందజేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విధాన నిర్ణయ ప్రక్రియలో పారదర్శకత వుండాలన్నారు. సీల్డ్ కవర్లోని సమాచారాన్ని అఫిడవిట్ రూపంలో ఉంచాలన్నారు. పిటిషనర్లకు అందజేయాలని సదరు బ్రోకరేజ్‌కు ఆదేశించారు. అయితే ఇది చాలా సున్నితమైన అంశమని..మీడియాకు పొక్కకూడదనే సీల్డ్ కవర్లో ఇస్తున్నామని, ఆ బ్రోకరేజ్ సంస్థ పేర్కొనడం పట్ల గౌతమ్ పటేల్ మండిపడ్డారు. 'నేను స్వయంగా గ్యాగ్ ఆర్డర్లు ఇవ్వను. మీడియా పని మీడియాది, నా పని నాది.. నా ముందు దాఖలు చేసిన పత్రాలు చూసి ఓ నిర్ణయానికి వస్తాను తప్ప.. నా ఇంటికొచ్చే న్యూస్ పేపర్లు చూసి కాదు. మీడియాకు ఓ గురుతరమైన బాధ్యత వుంది.. దానిని అది నెరవేరుస్తుంది. మీడియాలో వార్తలు రాకూడదని ప్రతివాది అడిగినంత మాత్రాన నేను గ్యాగ్ ఆర్డర్లు ఇవ్వను. నా కోర్టులో ఎప్పుడూ గ్యాగ్ ఆర్డర్లు ఉండవు. మీడియాది ఎప్పుడూ బాధ్యతారాహిత్యమేనని చేసే వాదనతో ఏకీభవించను. నేను చూసేది.. నా ఎదురుగా వున్న ఇరు పక్షాలు చూడాలి.. ఆ హక్కు వారికి వుంది. ఇక్కడ గ్యాగ్ ఆర్డర్లు వుండవు..నా కోర్టులో సీల్డ్ కవర్ వ్యవహారాలనే ప్రశ్నకు తావేలేదం'టూ గౌతమ్ పటేల్ పేర్కొన్నారు. -
ఆర్థిక అక్రమాల కేసులో జస్టిస్ పటేల్ ఆగ్రహం
-
సుప్రీంకు ‘సీబీఐ’ నివేదిక
న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ అలోక్‌కుమార్ వర్మ అవినీతి ఆరోపణల కేసుకు సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) సోమవారం సుప్రీంకోర్టుకు సమర్పించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్‌తో కూడిన ఉన్నత ధర్మాసనం ఈ నివేదికను స్వీకరించి తదుపరి విచారణ నవంబర్ 16కు వాయిదా వేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి శనివారమే ప్రాథమిక దర్యాప్తు పూర్తయింది. కాగా, ఆదివారం రిజిస్టర్ కార్యాలయం తెరిచే ఉన్నా ఎందుకు నివేదించలేదని సీవీసీని ప్రశ్నిస్తూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సీవీసీ తరఫున కోర్టుకు హాజరైనా సొలిసిటర్ జనరల్ (ఎస్జీ) తుషార్ మెహతా కోర్టును క్షమాపణలు కోరుతూ.. నివేదిక తయారీ, స్పైరల్ బైండింగ్ వల్ల ఆలస్యమైందని, తాము కోర్టుకు వచ్చే వరకు సమయం మించిపోవడంతో రిజిస్ట్రర్ కార్యాలయం మూసేసి ఉందని వివరించారు. మరోవైపు కోర్టు ఆదేశాల మేరకు అక్టోబర్ 23 నుంచి 26 మధ్య తాను తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన నివేదికను సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ ఎం.నాగేశ్వర్రావు సీల్డ్కవర్లో కోర్టుకు అందించారు. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానా అలోక్ వర్మపై చేసిన అవినీతి ఆరోపణల కేసుకు సంబంధించి జస్టిస్ పట్నాయక్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేయాలని గతనెల 26న సీవీసీని సుప్రీం ఆదేశించింది. మరోవైపు, సీబీఐ అధికారులు అస్థానా, వర్మ, నాగేశ్వర్రావ్కు వ్యతిరేకంగా ఎన్జీవో దాఖలు చేసిన కామన్‌కాజ్ అనే పిల్‌ను సుప్రీం కొట్టేసింది. -
న్యాయంగానే ‘రఫేల్’ కొనుగోలు
న్యూఢిల్లీ: వివాదాస్పద రఫేల్ జెట్ విమానాల కొనుగోలు ఒప్పందం వివరాలను కేంద్రం సుప్రీంకోర్టుకు సమర్పించింది. 36 రఫేల్ విమానాల ధరల వివరాలను కూడా సీల్డ్ కవర్లో కోర్టుకు అందజేసింది. ఒప్పందం వివరాలను బహిర్గతం చేయాలంటూ బీజేపీ మాజీ నేతలు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ వివరాలను సోమవారం సమర్పించింది. ‘తక్కువ ధర, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పొందేందుకు ఫ్రెంచి సంస్థతో ఏడాది కాలంలో 74 సార్లు సమావేశమయ్యాం. 2013 డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ నిబంధనల మేరకే విమానాలను కొనుగోలు చేశాం. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ఆమోదాన్నీ పొందాం. దేశానికి చెందిన ఏ సంస్థ పేరునూ ఒప్పందంలో భాగస్వామిగా సిఫారసు చేయలేదు’ అని కేంద్రం తెలిపింది. హెచ్ఏఎల్తో ఒప్పందం కుదరనిదెందుకు? రఫేల్ ఒప్పందంపై ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్), ఫ్రెంచి సంస్థ డసో ఏవియేషన్ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని కేంద్రం పేర్కొంది. ‘ముఖ్యంగా 108 రఫేల్ విమానాలను దేశీయంగా తయారు చేసే విషయంలో డసో సూచించిన దాని కంటే హెచ్ఏఎల్ కోరిన సమయం 2.5 రెట్లు ఎక్కువగా ఉంది. అందుకే డసో మరో సంస్థను ఎంపిక చేసుకుంది. విమానాలను దేశీయంగా తయారుచేసి అందజేసేందుకు భారత భాగస్వామిని ఎంపిక చేసుకునే వెసులుబాటు డీపీపీ ప్రకారం డసోకు ఉంది. విదేశీ సంస్థలకు చెల్లించే ప్రతి డాలరులో కనీసం 30 శాతం తిరిగి పెట్టుబడి, సేకరణ రూపంలో తిరిగి దేశానికి చేరుతుంది’ అని తెలిపింది. అనంతరం ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను ఈ నెల 14వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. -
‘రఫేల్’ ధర వివరాలివ్వండి
న్యూఢిల్లీ: ఫ్రాన్స్ నుంచి 36 రఫేల్ ఫైటర్ జెట్ల కొనుగోలు ధర వివరాలను తమకు సీల్డ్ కవర్లో సమర్పించాలని సుప్రీంకోర్టు బుధవారం కేంద్రాన్ని ఆదేశించింది. రఫేల్ ధర విషయం వ్యూహాత్మకమనీ, దాన్ని రహస్యంగా ఉంచాలన్న కేంద్రం వాదనను అంగీకరించింది. ఈ ఒప్పందం వివరాలను 10 రోజుల్లోగా సమర్పించాలని సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ కేఎం జోసెఫ్‌ల ధర్మాసనం ఆదేశించింది. ఈ సందర్భంగా కేంద్రం తరఫున అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ వాదిస్తూ.. రఫేల్ ఒప్పందం ధర వివరాలు చాలా రహస్యమైన సమాచారమనీ, దాన్ని దేశ పార్లమెంటుతో కూడా పంచుకోలేదని కోర్టుకు తెలిపారు. ఈ వివరాలు అధికారిక రహస్యాల చట్టం–1923 పరిధిలోకి వస్తాయని వెల్లడించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం, రఫేల్ ఒప్పందం సందర్భంగా పాటించిన విధివిధానాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలనీ, పిటిషనర్లకు అందజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. అయితే ఒప్పందంలోని వ్యూహాత్మక, రహస్య సమాచారాన్ని బయటపెట్టాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఒకవేళ రఫేల్ ధర వివరాలను అందజేయడం వీలుకాకపోతే అదే విషయాన్ని పిటిషన్ ద్వారా తెలియజేయాలని బెంచ్ తెలిపింది. పిటిషనర్లు రఫేల్ యుద్ధ విమానం పనితీరు, ఇతర సాంకేతిక అంశాలను కోరలేదనీ, కేవలం కొనుగోలు సందర్భంగా పాటించిన పద్ధతి, ధరపైనే స్పష్టత అడిగారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రఫేల్ కొనుగోలు ధర వివరాలను సీల్డ్ కవర్లో 10 రోజుల్లోగా సమర్పించాలని స్పష్టం చేసింది. సీబీఐలో ప్రస్తుతం కొనసాగుతున్న అనిశ్చితి ముగిశాక రఫేల్‌పై ఆ సంస్థతో విచారణ జరిపే అంశాన్ని పరిశీలిస్తామని తేల్చిచెప్పింది. అనంతరం తదుపరి విచారణను నవంబర్ 14కు వాయిదా వేసింది. సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, కేంద్ర మాజీ మంత్రులు అరుణ్‌శౌరీ, యశ్వంత్ సిన్హా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. -
రాఫెల్ డీల్ : పదిరోజుల్లో వివరాలివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: రాఫెల్ జెట్ కొనుగోళ్లు వివాదం మరింత ముదురుతోంది. 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశంపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్డు నేడు (అక్టోబర్ 31, బుధవారం) విచారించింది. ఈ సందర్భంగా కేంద్రానికి సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ డీల్ పై పూర్తి వివరాలను సమర్పించాల్సిందిగా కోరింది. పదిరోజుల్లోగా నివేదికలను అందించాల్సిందిగా ఆదేవించింది. కాంగ్రెస్ నేతలు మాజీ కేంద్ర మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. రాఫెల్ ఒప్పందంలో భాగంగా అనిల్ అంబానీకి చెందిన డిఫెన్స్ సంస్థకు ఈ కాంట్రాక్టును ఎలా అందించారో చెప్పాలని కూడా అత్యున్నత న్యాయస్థానం కోరింది. ఒక్కొక్క రాఫెల్‌ను ఎంత ధర పెట్టి కొన్నారో స్పష్టం చేయాలని సుప్రీం కేంద్రాన్ని డిమాండ్ చేసింది. మరో పది రోజుల్లోగా సీల్డు కవర్లో రాఫెల్ ఖరీదు వివరాలను పంపాలని సుప్రీం ఆదేశించింది. అలాగే ఈ ఒప్పందం కోసం జరిగిన వ్యూహాత్మక వివరాలు ఏమైనా ఉంటే వాటిని కూడా స్పష్టం చేయాలని కోర్టు పేర్కొంది. కాగా ప్రభుత్వ రంగ సంస్థ ను కాదని రిలయన్స్ డిఫెన్స్ సంస్థకు రాఫెల్ డీల్‌ను అప్పగించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది. ముఖ్యంగా కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. -
రాఫెల్ డీల్ వివరాలు కోరిన సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ : రాఫెల్ యుద్ధ విమానాలపై రాజకీయ రాద్ధాంతం జరుగుతున్న క్రమంలో ఈ ఒప్పందం ఎలా చేసుకున్నారనే వివరాలను అందించాలని సర్వోన్నత న్యాయస్ధానం బుధవారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈనెల 29లోగా ఒప్పంద వివరాలను సీల్డ్ కవర్లో సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. యుద్ధవిమానాల ధర, వాటి ప్రమాణాల వివరాల్లోకి తాను వెళ్లబోనని సుప్రీం కోర్టు వివరణ ఇచ్చింది. రాఫెల్ డీల్‌పై తాము కేంద్రానికి ఎలాంటి నోటీసులు జారీ చేయడం లేదని, పిటిషనర్ చేసిన ఆరోపణలు సరైనవికానందున కోర్టు వాటిని పరిగణనలోకి తీసుకోబోదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యులతో కూడిన సుప్రీం బెంచ్ పేర్కొంది. ఈ ఒప్పందంపై పిటిషన్లు దాఖలు చేసిన ఇద్దరు న్యాయవాదులు రాఫెల్ డీల్‌పై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కోరారు. ఈ ఒప్పందంలోని వివరాలను కేంద్రం వెల్లడించాలని లేదా ఒప్పందాన్ని రద్దు చేయాలని పిటిషనర్లు తమ పిటిషన్లో కోరారు. కాగా పిటిషనర్లు రాజకీయ ప్రయోజనాలను ఆశించి కేసు వేశారని కేంద్రం తరపు న్యాయవాది అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోర్టుకు నివేదించారు. రాఫెల్ యుద్ధవిమానాలు జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని అన్నారు. రూ 59,000 కోట్ల రాఫెల్ ఒప్పందంలో భారీగా అవినీతి చోటుచేసుకుందని పిటిషనర్ ఎంఎల్ శర్మ ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ 2015లో అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్‌తో పారిస్‌లో చర్చలు జరిపిన అనంతరం ఈ ఒప్పందాన్ని ప్రకటించారన్నారు. -
అందులోని అంశాలను బహిర్గతం చేయరాదు
సాక్షి, చెన్నై : విద్యార్థినులను లైంగిక ప్రలోభాలకు ప్రయత్నించిన ప్రొఫెసర్ నిర్మలా దేవి వ్యవహారంపై విచారణ ముగిసింది. సీల్డ్ కవర్లో నివేదిక రాజ్ భవన్‌కు చేరింది. వ్యవహారం కోర్టులో ఉన్న దృష్ట్యా రాజ్‌భవన్ వర్గాలు ఆ నివేదికలోని అంశాలను బయటపెట్టలేని పరిస్థితిలో ఉన్నాయి. విరుదునగర్ జిల్లా అర్పుకోట్టై దేవాంగర్ ఆర్ట్స్ కళాశాల గణితం ప్రొఫెసర్ నిర్మలా దేవి లీల ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. నలుగురు విద్యార్థినులను ఎంపిక చేసి, ఎవరి కోసమో లైంగిక ప్రేరణకు ప్రయత్నిస్తూ ఆమె సాగించిన ఆడియో బయటపడడం రాష్ట్రంలో వివాదాన్ని రేపింది. విద్యార్థినులకు కళాశాలల్లో భద్రత కరువైందని ఆందోళనలు బయలు దేరాయి. దీంతో ఆమెను అరెస్టు చేసిన పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. అదే సమయంలో రాష్ట్ర గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ సైతం తానే స్వయంగా ఓ కమిటీని రంగంలోకి దించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సంతానం నేతృత్వంలో విచారణ కమిషన్ రంగంలోకి దిగడం వివాదానికి సైతం దారితీసింది. రాజ్ భవన్ చేరిన నివేదిక రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీ విచారణకు ఆదేశించిన సమయంలో గవర్నర్ ప్రత్యేక విచారణ కమిషన్‌ను రంగంలోకి దించడంతో ప్రతిపక్షాలు పలు ఆరోపణలు, విమర్శలు గుప్పించే పనిలో పడ్డాయి. అయితే, గవర్నర్ ఏ మాత్రం తగ్గలేదు. తాను నియమించిన కమిటీ ద్వారా విచారణకు చర్యలు తీసుకున్నారు. సంతానం నేతృత్వంలోని కమిషన్ మదురై చెరలో ఉన్న నిర్మలా దేవితో పాటు, ఆమెకు సహకారంగా ఉన్న మురుగన్, కరుప్ప స్వామిలను సైతం విచారించింది. అన్ని ప్రక్రియలు వీడియో చిత్రీకరణగా సాగాయి. పలు కోణాల్లో ఈ కమిటీ విచారణ చేసి నివేదికను సిద్ధంచేసి రాజ్ భవన్‌కు చేర్చింది. మంగళవారం నివేదికను సీల్డ్ కవర్లో ఉంచి రాష్ట్ర గవర్నర్‌కు సంతానం అందజేశారు. అన్ని కోణాల్లో విచారణ నిర్మలాదేవి వ్యవహారంపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టామని విచారణ కమిషన్ చైర్మన్ సంతానం తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తన విచారణ ముగిసిందని, నివేదిక రాజ్ భవన్‌కు చేరిందని వివరించారు. అన్ని కోణాల్లో విచారణ సాగిందని, ప్రధానంగా 60మంది వద్ద సాగిన విచారణలో పలు అంశాలు ఉన్నట్టు పేర్కొన్నారు. అయితే, ఈ విచారణ వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్న దృష్ట్యా, ఇతర వివరాలు వెల్లడించేందుకు వీలు లేదన్నారు. కాగా, రాజ్ భవన్‌కు సీల్డ్ కవర్లో నివేదిక చేరినా, ఎన్ని పేజీలు ఉన్నాయో, అందులోని వివరాలు ఏమిటీ అనేది గవర్నర్ సైతం తెలుసుకోలేని పరిస్థితి. ఇందుకు కారణం ఈ వ్యవహారం కోర్టులో ఉండడమే. ఈ విచారణ కమిషన్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై కోర్టు సైతం స్పందించింది. విచారణ నివేదికను సీల్డ్ కవర్లో ఉంచాలని, అందులోని అంశాలను, వివరాలను బయటపెట్టేందుకు వీలు లేదని కోర్టు ఆదేశాలు ఇచ్చి ఉండడం గమనార్హం. -
గ్యాంగ్ రేప్‌లు.. సీల్డ్ కవర్లో నివేదిక
సాక్షి, హరియానా : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముర్తల్ గ్యాంగ్ రేప్ ఘటనలకు సంబంధించి హరియానా ప్రభుత్వం ఎట్టకేలకు తుది నివేదికను రూపొందించింది. సీల్డ్ కవర్లో దర్యాప్తు వివరాలను గురువారం పంజాబ్ హరియానా హైకోర్టు బెంచ్‌కు సమర్పించింది. గత ఫిబ్రవరిలో జాట్ రిజర్వేషన్ల ఉద్యమం సందర్భంగా హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో 10 మంది మహిళలపై సామూహిక అత్యాచార కేసులు చోటు చేసుకున్నాయి. ఈ నివేదికతోపాటు దాడులు, ఆ సమయంలో దాఖలైన ఇతర కేసులకు సంబంధించి కేసు డైరీలను ప్రభుత్వం కోర్టుకు అందించింది. ఓ ఆంగ్ల దిన పత్రిక కథనాల ఆధారంగా హైకోర్టు సుమోటోగా కేసును స్వీకరించిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు పోలీస్ శాఖ దర్యాప్తు చేపట్టింది. ఇక తదుపరి విచారణను జనవరి 2018కి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 2016లో జాట్ రిజర్వేషన్ల ఉద్యమం హింసాత్మకంగా మారగా.. సోనేపట్ జిల్లాలో తారాస్థాయికి చేరుకుని మహిళలపై అఘాయిత్యాలు చోటు చేసుకున్నాయి. ఎక్కడ పడితే అక్కడ మహిళల దుస్తులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ దృశ్యాలతోపాటు కొందరు బాధితుల కథనం మేరకు ఓ ఆంగ్ల పత్రిక వరుస కథనాలు ప్రచురించింది. అల్లర్లకు సంబంధించి మొత్తం 8 జిల్లాల్లో 2,100 ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి. -
స్విస్ చాలెంజ్ లో అసలు రహస్యం !
-
ఇదీ దాపరికం
≈ ఎకరం బేసిక్ ధర రూ. 4 కోట్లకు అదనం ఎంత? ≈ సింగపూర్ కంపెనీలిచ్చిన సీల్డ్ కవర్లోని అంకె ఏమిటి? ≈ అది తెలియకుండా బిడ్డింగ్ ఏమిటి? ≈ ఎవరూ పోటీపడకుండా ఉండడం కోసమేనా ఈ గోప్యత.. ≈ సింగపూర్ కంపెనీల పెట్టుబడి రూ.306 కోట్లు ≈ ఉచితంగా ఇస్తున్న 50 ఎకరాల విలువే రూ.300 కోట్లు ≈ అంటే వాటి ఖర్చు రూ.6 కోట్లేనన్నమాట ≈ రైతుల భూముల్లో, సర్కారు సొమ్ముతో ‘రియల్’ వ్యాపారం ≈ ప్లాట్లు పొందే థర్డ్‌పార్టీ కంపెనీలేవో ఎవరికీ తెలియదు.. సాక్షి, హైదరాబాద్: ‘స్విస్ చాలెంజ్’ అంటేనే రహస్యం.. అది ఓ బ్రహ్మపదార్ధం... అంతా గోప్యం... లొసుగుల మయం... తప్పు చేయాలనుకునేవారికి ఇది అయాచిత వరం లాంటిది. ఈ విధానంలో పారదర్శకత లేదని అత్యున్నత న్యాయస్థానం ఆక్షేపించింది అందుకే... అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘స్విస్ చాలెంజ్’ విధానానికి ‘పచ్చ’జెండా ఊపింది. సింగపూర్ సంస్థలకు రెడ్ కార్పెట్ పరిచింది. రైతుల భూములతో, సర్కారు సొమ్ములతో సింగపూర్ కంపెనీలకు దోచిపెట్టి ప్రభుత్వపెద్దలు రియల్ఎస్టేట్ వ్యాపారం చేసి డెరైక్టుగా వేల కోట్లు వెనకేసుకోవడాన్నే చూశాం. ఈ దోపిడీ ఇంతటితో ఆగలేదు. రూ.306 కోట్లు పెట్టుబడిపెట్టే సింగపూర్ కంపెనీలకు వేల కోట్లు దోచిపెట్టడమే కాకుండా... ప్రభుత్వ సొమ్ముతో అభివృద్ధి చేసిన వెంచర్‌ను మార్కెటింగ్ చేసేందుకు ఓ కంపెనీని ఏర్పాటు చేయడం.. ఆ కంపెనీలో సింగపూర్ సంస్థకు మాత్రమే పూర్తి స్థాయి అజమాయిషీని కట్టబెట్టడం... రాష్ర్టప్రభుత్వం పాత్రేమీ లేకుండా నామమాత్రంగా విదిలించే వాటాకు పరిమితం కావడం వంటివి చూస్తే మనకు దిమ్మతిరగడం ఖాయం. సింగపూర్ ప్రయివేటు కంపెనీల కన్సార్టియంలో రాష్ర్ట ముఖ్యనేతదే కీలకపాత్ర కావడం వల్లనే ఇలాంటి విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. భూమి రైతులది... దాన్ని అభివృద్ధి చేయడానికి పెట్టే ఖర్చు ప్రజలది... లాభాలు మాత్రం సింగపూర్ కంపెనీలవి... రాష్ర్టప్రభుత్వానికి వచ్చే అరకొరవాటా కూడా మార్కెటింగ్ పేరుతో మరో కంపెనీకి కట్టబెట్టడం అన్నిటిలోకెల్లా విచిత్రం... ఈ మార్కెటింగ్ కంపెనీ కూడా కొత్తది అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే.. ముఖ్యనేతకు వాటాలున్న సింగపూర్ కంపెనీలు ఏర్పాటు చేసేదే ఇది. ‘స్విస్ చాలెంజ్’ విధానం కింద సింగపూర్ ప్రయివేటు కంపెనీల కన్సార్టియం, కేపిటల్‌సిటీ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ (సీసీడీఎంసీ) కలసి అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్ (ఏడీపీ)గా ఏర్పడిన సంగతి తెల్సిందే. అయితే అభివృద్ధి చేసిన లేఅవుట్లకు పబ్లిసిటీ కల్పించడానికి, వాటిని మార్కెట్ చేయడానికి గాను ఓ మేనేజ్మెంట్ కంపెనీని కూడా ఏడీపీ ఏర్పాటు చేయబోతోంది. ఇందుకు గాను ఈ కంపెనీ బ్రోకరేజీ సహా అనేకరకాల ఫీజులు వసూలు చేస్తుంది. ఇవన్నీ పోగా మిగిలిన మొత్తాన్నే సింగపూర్ కంపెనీలు 58శాతం, రాష్ర్టప్రభుత్వం 42శాతం పంచుకుంటాయి. సింగపూర్ కంపెనీలతో చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో ఇంకా ఇలాంటి అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. సీల్డ్ కవర్లోని మొత్తం ఎంత? అభివృద్ధి చేయడం కోసం సింగపూర్ కంపెనీలకు తొలిదశలో ఇస్తున్న 1,691 ఎకరాలలో ఎకరానికి రూ. 4 కోట్లను బేసిక్ ధరగా రాష్ర్టప్రభుత్వం నిర్ణయించింది. సింగపూర్ కంపెనీలు ఈ బేసిక్ ధరకు అదనంగా ఎంత ఇస్తున్నాయో ఎవరికీ తెలియదు. ఎందుకంటే అవి కోట్ చేసిన మొత్తాన్ని సీల్డ్ కవర్లో ఉంచారు. ఈ మొత్తం ఎంత అనేది తెలిస్తేనే కదా అంతకన్నా ఎక్కువ ఇవ్వడానికి అంతర్జాతీయ కంపెనీలు పోటీపడేది? ఉదాహరణకు సింగపూర్ కంపెనీలు రూ. 4.1 కోట్లను కోట్ చేశాయనుకోండి. అపుడు మిగిలిన కంపెనీలకు ఒక స్పష్టత వస్తుంది. అవి రూ.4.2 కోట్లనో అంతకన్నా ఎక్కువో కోట్ చేయడానికి వీలుంటుంది. కానీ ఇలా రహస్యంగా సీల్డ్ కవర్లో ఉంచడానికి సింగపూర్ కంపెనీలను ఎందుకు అనుమతించారో రాష్ర్టప్రభుత్వ పెద్దలకే తెలియాలి. ఈ సీల్డ్ కవర్ వ్యవహారంపైనే ప్రస్తుతం హైకోర్టులో కేసు నడుస్తోంది. ప్లాట్లు పొందేది ఎవరు? సింగపూర్ కంపెనీలు ఎకరానికి రూ. 4 కోట్లకన్నా ఎంత అదనంగా కోట్ చేశాయో ఆ మొత్తాన్ని ఇప్పటికిప్పుడు రాష్ర్టప్రభుత్వానికి చెల్లించబోవడం లేదు. రైతుల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఆ తర్వాత వచ్చే లాభాలలో ఆ మొత్తాన్ని కట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 1,691 ఎకరాలను అభివృద్ధి చేసి ప్లాట్ల రూపంలో లే అవుట్లు వేస్తుంది. ఈ లే అవుట్లకు మౌలిక సదుపాయాల కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ నుంచి రూ. 5,500 కోట్లను కేటాయిస్తుంది. మౌలిక సదుపాయాలు కల్పించిన తరువాత ఆ ప్లాట్లకు మార్కెటింగ్ కంపెనీ దేశ విదేశాల్లో మార్కెటింగ్ నిర్వహిస్తాయి. ఒక విధంగా సింగపూర్ కంపెనీలు బ్రోకర్‌గా వ్యవహరిస్తాయి. ఆ ప్లాట్లను సింగపూర్ కంపెనీలు ఏర్పాటు చేసే మార్కెటింగ్ కంపెనీయే థర్డ్‌పార్టీకి విక్రయిస్తుంది. వాటిని ఎవరికైనా, ఎంతకైనా విక్రయించవచ్చు. ఉదాహరణకి ఎకరం విస్తీర్ణంలో పాట్లను మార్కెటింగ్ కంపెనీ పది కోట్ల రూపాయలకు విక్రయించిందనుకుందాం. విక్రయం ద్వారా వచ్చిన మొత్తం నుంచి ఎకరానికి నాలుగు కోట్ల రూపాయల బేసిక్ ధరను చెల్లిస్తాయి. అలాగే తాము అదనంగా ఇస్తామన్న పది లక్షల రూపాయలను కూడా ప్రభుత్వానికి చెల్లిస్తాయి. మిగతా 5.90 కోట్ల రూపాయల్లో మార్కెటింగ్, ప్రచారం, ఇతర వ్యయాలను కూడా మార్కెటింగ్ కంపెనీ మినహాయించుకుంటుంది. ఆ తర్వాత మిగిలిన సొమ్ములో ఒప్పందం ప్రకారం సీసీడీఎంసీకి 42 శాతం ఇచ్చి 58 శాతం తాము తీసుకుంటాయి. అంటే సింగపూర్ సంస్థలు పైసా పెట్టుబడి పెట్టకుండానే ఈ రియల్ఎస్టేట్ వ్యాపారం చేసి లాభం పొందబోతున్నాయన్నమాట. రైతుల భూముల్లో, ప్రభుత్వ సొమ్ముతో (ప్రజాధనంతో) మౌలిక వసతులు కల్పించిన ప్లాట్లను తాము నచ్చినవారికి, నచ్చిన మొత్తానికి విక్రయించే ‘రియల్’ వ్యాపారం ద్వారా కోట్ల రూపాయలను ఆర్జించబోతున్నాయి. ప్లాట్లను పొందేది ఎవరనేది కూడా స్విస్ చాలెంజ్ డాక్యుమెంట్లో పేర్కొనలేదు. ప్లాట్లను వేలం వేస్తామని గానీ, ఎక్కువ మొత్తం ఇచ్చే వారికే విక్రయిస్తామని గానీ డాక్యుమెంట్లో ఎక్కడా వివరించలేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, మార్కెటింగ్ కంపెనీకి ఇష్టమైన వారికే (కంపెనీలకే) ఈ ప్లాట్లు దక్కబోతున్నాయనేది స్పష్టమౌతోంది. సింగపూర్ కంపెనీల పెట్టుబడి ఎంత? ఏడీపీలో సింగపూర్ సంస్థలు ఈక్విటీ కింద పెడుతున్న పెట్టుబడి కేవలం రూ.306 కోట్లు. కాగా రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్ సంస్థలకు ఉచితంగా ఇస్తున్న 50 ఎకరాల విలువే రూ.300 కోట్ల రూపాయలుంటుంది. అంటే సింగపూర్ సంస్థలు పెట్టే పెట్టుబడి కేవలం 6 కోట్ల రూపాయలన్నమాట. ఈ 50 ఎకరాల్లో సింగపూర్ సంస్థలే ఐకానిక్ నిర్మాణాలను చేసి విక్రయించుకుంటాయి. ఇందులో ప్రభుతానికి గానీ, ఏడీపీకిగానీ ఎలాంటి భాగస్వామ్యమూ ఉండదు. ఇది కాక మిగతా రెండు దశల్లో సింగపూర్ కంపెనీలకు 200 ఎకరాలను బేసిక్ ధరకు కేటాయిస్తారు. ఆ 200 ఎకరాలపైన కూడా సింగపూర్ సంస్థలకే హక్కు ఉంటుంది. సింగపూర్ సంస్థల ప్రాజెక్టు వ్యయం 3,137 కోట్ల రూపాయలుగా పేర్కొన్నా అందులో మార్కెటింగ్, ప్రచారం, కన్సల్టెంట్ల ఫీజులు, ఐకానిక్ టవర్ వ్యయం కలగలసి ఉన్నాయి. ఈ వ్యయాన్ని కూడా సింగపూర్ కంపెనీలు, సీఆర్డీఏలు ఈక్విటీల ద్వారా, అలాగే తొలి దశ లాభాలు, భూముల విక్ర యం ద్వారా రాబట్టనున్నారు. అంటే పైసా పెట్టుబడి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేత మౌలిక వసతుల కల్పనకు 5,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయించి కోట్ల రూపాయల లాభాలను సింగపూర్ సంస్థలు ఆర్జించనున్నాయన్నమాట. ఈ విధమైన మార్కెటింగ్, లే- అవుట్లు చేసి విక్రయించడానికి సింగపూర్ కంపెనీలు ఎందుకో సర్కారు పెద్దలకే తెలియాలి. సింగపూర్ సంస్థలు కేవలం లే అవుట్లను ప్లాట్లగా థర్డ్‌పార్టీలకు విక్రయించే బ్రోకరేజీ పని చేయనున్నాయి. భవనాలు నిర్మాణం, ప్లాట్ల అభివృద్ధి థర్డ్‌పార్టీ కంపెనీలే చేస్తాయి. రాష్ట్ర ప్రభుత్వ భవనాలను గానీ, రహదారుల నిర్మాణాల నిర్మాణాలను గానీ సింగపూర్ సంస్థలు చేయవు. వాటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవాల్సి ఉంది. మార్కెటింగ్ కోసం మేనేజ్మెంట్ కంపెనీ సింగపూర్ కంపెనీల మరో మాయాజాలం అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్ (ఏడీపీ)లో సింగపూర్ కన్సార్షియం, కేపిటల్‌సిటీ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ అండ్ కార్పొరేషన్ (సీసీడీఎంసీ) కలసి ఉన్నా అంతా సింగపూర్ కంపెనీలు చెప్పినట్లే జరుగుతోంది. సింగపూర్ కన్సార్షియంకు 58శాతం వాటా, సీసీడీఎంసీకి 42శాతం వాటా.. చూస్తేనే ఈ విషయం అర్ధమౌతోంది. అయితే స్విస్ చాలెంజ్ విధానంలో దశలవారిగా జరిగే రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రక్రియలో కార్యకలాపాల నిర్వహణ బాధ్యత అంతా చూడడం కోసం ఓ మేనేజ్మెంట్ కంపెనీని నియమించనున్నారు. మేనేజ్మెంట్, డెవలప్మెంట్, మార్కెటింగ్, ఆపరేషన్స్, ఆస్తుల నిర్వహణ వంటి వ్యవహరాలన్నీ ఈ కంపెనీయే చూస్తుంది. లేఅవుట్లు, ప్లాట్ల గురించిన ప్రచార కార్యక్రమం కూడా ఇదే నిర్వహిస్తుంది. ఒక్కో దశలో ఐదేళ్లపాటు ఈ వ్యవహారాలన్నీ ఈ కంపెనీ నెరవేరుస్తుందని స్విస్‌చాలెంజ్ ప్రతిపాదనలలో పేర్కొన్నారు. అందుకయ్యే ఖర్చులన్నిటినీ ఆ కంపెనీకి చెల్లిస్తారు. ఏఏ ఖర్చులుంటాయో వాటికి ఎంత చెల్లించాలో కూడా ఆ ప్రతిపాదనలలో ప్రస్తావించారు. వాటి వివరాలివీ.. 1. డెవలప్మెంట్ మేనేజ్మెంట్కి.. - ప్రాజెక్టు వ్యయంలో 5.5శాతం 2. మార్కెటింగ్ సర్వీసులకు... - మొత్తం అమ్మకాలలో 2శాతం లేదా థర్డ్‌పార్టీకి చెల్లించే ఫీజు + 0.75శాతం మార్జిన్లలో ఏది ఎక్కువైతే అది 3. థర్డ్‌పార్టీ ఏజెంట్లను లేదా బ్రోకర్లను నియోగిస్తే... - బ్రోకరేజీకి అయ్యే వాస్తవ ఖర్చులు + 20శాతం 4. లీజ్మేనేజ్మెంట్ సర్వీసులు.. - మొత్తం ఆదాయంలో 1శాతం 5. ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీసులు - మొత్తం ఆదాయంలో 2శాతం ఇవి కాక అద్దెకు తీసుకునే ఆస్తులకు సంబంధించిన మార్కెటింగ్ సర్వీసులకు కూడా ఫీజులు వసూలు చేయనున్నారు. ఏడీపీ పేరుతో అభివృద్ధి చేసే ప్లాట్లను థర్డ్‌పార్టీకి విక్రయించడం కోసం ప్రచారం, మార్కెటింగ్ నిర్వహించే ఈ మేనేజ్మెంట్ కంపెనీ అందుకోసం రకరకాల ఫీజుల పేరుతో భారీమొత్తంలో వసూలు చేస్తుంది. అవన్నీ పోగా మిగిలిన మొత్తాన్ని సింగపూర్ కంపెనీలు 58శాతం, సీసీడీఎంసీ 42శాతం తీసుకుంటాయి. -
సీల్డ్ కవర్లో వాంగ్మూలాలు
బొగ్గు కుంభకోణం కేసులో దర్యాప్తు పురోగతి నివేదికను ప్రత్యేక కోర్టుకు సమర్పించిన సీబీఐ సీల్డ్ కవర్ తెరిచి పరిశీలించిన న్యాయమూర్తి రెండు వారాల్లో దర్యాప్తు పూర్తిచేస్తామన్న సీబీఐ న్యూఢిల్లీ: బొగ్గు క్షేత్రాల కేటాయింపుల కుంభకోణం కేసులో కొనసాగుతున్న దర్యాప్తులో ప్రగతిపై నివేదికను, ఈ కేసుకు సంబంధించి తాజాగా సీబీఐ అధికారులు ప్రశ్నించిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్, నాటి పీఎంఓ ఉన్నతాధికారుల వాంగ్మూలాలను.. కేంద్ర దర్యాప్తు సంస్థ మంగళవారం సీబీఐ ప్రత్యేక కోర్టుకు సీల్డ్కవర్లో సమర్పించింది. ఈ కేసులో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ను కూడా ప్రశ్నించాల్సిందిగా సీబీఐని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. బొగ్గు మంత్రిత్వశాఖ మాజీ కార్యదర్శి పి.సి.పరేఖ్, పారిశ్రామికవేత్త కుమార్ మంగళం బిర్లా తదితరులు నిందితులుగా ఉన్న ఈ బొగ్గు కుంభకోణం కేసులో దర్యాప్తును పూర్తిచేసేందుకు మరో రెండు వారాల గడువును సీబీఐ కోరింది. విచారణ సందర్భంగా సీల్డ్ కవర్‌ను తెరచి.. సీబీఐ సమర్పించిన వాంగ్మూలాలు, ఇతర పత్రాలను ప్రత్యేక న్యాయమూర్తి భరత్‌పరాశర్ పరిశీలించారు. అయితే.. ఈ వాంగ్మూలాలు, పత్రాలను తదుపరి దర్యాప్తు పూర్తయ్యేవరకూ సీల్డ్ కవర్లోనే ఉంచాలని, వాటిని పరిశీలించేందుకు అనుమతించరాదని సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వి.కె.శర్మ కోర్టుకు విజ్ఞప్తిచేశారు. ఈ నేపధ్యంలో ఆయా పత్రాలన్నిటినీ మళ్లీ సీల్డ్ కవర్లో ఉంచి, కోర్టు సీల్‌తో సీల్ చేయాలని సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఆదేశించారు. దర్యాప్తును రెండు వారాల్లో పూర్తిచేస్తామని సీబీఐ పేర్కొనడంతో.. కేసు విచారణను ఫిబ్రవరి 19వ తేదీకి వాయిదా వేశారు. బొగ్గు స్కాం కేసులో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, అప్పటి ప్రధానమంత్రి కార్యాలయంలోని ఉన్నతస్థాయి అధికారులైన మన్మోహన్ ముఖ్య కార్యదర్శి టి.కె.ఎ.నాయర్, వ్యక్తిగత కార్యదర్శి బి.వి.ఆర్.సుబ్రమణ్యం తదితరులను కూడా ప్రశ్నించాల్సిందిగా ప్రత్యేక కోర్టు గత డిసెంబర్ 16వ తేదీన ఆదేశించటంతో.. సీబీఐ ఆ మేరకు వారిని ప్రశ్నించి తాజాగా పురోగతి నివేదికను, వాంగ్మూలాల పత్రాలను కోర్టుకు సమర్పించింది. ఒడిశాలోని తాలాబిరా-2 బొగ్గు క్షేత్రాన్ని 2005 సంవత్సరంలో హిందాల్కో సంస్థకు కేటాయించటంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. హిందాల్కోకు అనుకూలంగా వ్యవహరించలేదన్న మన్మోహన్! తాలాబిరా-2 కేటాయింపులో హిందాల్కోకు ఏ విధంగానూ అనుకూలంగా వ్యవహరించలేదని.. నిర్దిష్ట విధివిధానాల ప్రకారమే కేటాయింపు జరిగిందని మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ సీబీఐకి స్పష్టంచేసినట్లు తెలిసింది. ఈ కేసులో కోర్టు ఉత్తర్వుల మేరకు 10 రోజుల కిందట తనను ప్రశ్నించిన సీబీఐ అధికారులకు ఆయన పై విధంగా వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. తాలాబిరా-2 బొగ్గు క్షేత్రం కేటాయింపు జరిగినపుడు కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ నాటి ప్రధాని మన్మోహన్ పర్యవేక్షణలోనే ఉన్న విషయం తెలిసిందే. హిందాల్కో సంస్థకు తాలాబిరా-2 బొగ్గు క్షేత్రాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేస్తూ పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా 2005 మే 7, జూన్ 17 తేదీల్లో ప్రధానికి రెండు లేఖలు రాసిన తర్వాత ప్రధానమంత్రి కార్యాలయంలో చోటుచేసుకున్న పరిణామాల గురించి.. సీబీఐ అధికారులు కొద్ది రోజుల కిందట మన్మోహన్‌ను ప్రశ్నించినట్లు అభిజ్ఞవర్గాలు తెలిపాయి. -
సీల్డుకవర్లో జడ్పీ చైర్మన్?!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా పరిషత్ పీఠంపై ఎవరు? అనే చర్చకు శనివారం తెరపడనుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ సీల్డుకవర్లో జడ్పీ చైర్మన్ అభ్యర్థి పేరును పంపినట్లు తెలిసింది. ఇంతకాలం గా గుంభనంగా వ్యవహరిస్తున్న గులాబీ దళపతి కేసీఆర్ శుక్రవా రం సాయంత్రమే ఓ నిర్ణయాని కి వచ్చినట్లు తెలిసింది. జడ్పీ చై ర్మన్ ఎన్నికల ప్రక్రియ మొదల య్యే అరగంట ముందే అభ్యర్థులను వెల్లడించే విధంగా ఏర్పా ట్లు చేసినట్లు సమాచారం. అప్పటి వరకు జడ్పీ చైర్మన్, వైస్ చై ర్మన్లుగా ఎంపికయ్యే అభ్యర్థు ల పేర్లు సీల్డుకవర్లోనే భద్రం గా ఉండనున్నాయి. బీసీ జనరల్‌కు కేటాయించిన జడ్పీ పీఠంపై కలలుగంటున్న జడ్పీటీసీ సభ్యులు ఎవరికి వారే ప్రయత్నాలు చేసినా.. చివరకు మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలతో అనేక కోణాల్లో సమీక్ష, సమాలోచనలు జరిపిన పిదప కేసీఆర్ తన నిర్ణయాన్ని వెల్లడించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఆశావహుల్లో టెన్షన్... మేయర్, మున్సిపల్ చైర్మన్, ఎంపీపీల ఎన్నికలను ఎంపీలు, ఎమ్మెల్యేలకు వదిలేసిన ఆయన జడ్పీ చైర్మన్ విషయంలో తానే నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పినట్లు కూడా పార్టీలో చర్చ ఉంది. ఈ నేపథ్యంలో మొదటి నుంచి జడ్పీ రేసులో జిల్లాలో నలుగురు జడ్పీటీసీ సభ్యులున్నా.. చివరి వరకు ఇద్దరి పేర్లనే పరిశీలనలోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇదే జరిగితే ఎల్లారెడ్డి నియోజకవర్గం పరిధిలోని గాంధారి జడ్పీటీసీ సభ్యుడు హరాలే తానాజీరావు, నిజాంసాగర్ జడ్పీటీసీ దఫెదారు రాజులలో ఎవరో ఒకరికి దక్కవచ్చంటున్నారు. కోటగిరి జడ్పీటీసీ పుప్పాల శంకర్, భిక్కనూరు జడ్పీటీసీ సభ్యుడు నంద రమేష్ సైతం ప్రయత్నంలో ఉన్నామంటున్నారు. అయితే శుక్రవారం సాయంత్రం నుంచి మద్నూరు జడ్పీటీసీ సభ్యుడు బస్వరాజ్ పేరు కూడా తెరపైకి రావడం జడ్పీటీసీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే జడ్పీ వైస్ చైర్మన్ పదవిని మహిళలకు కట్టబెట్టాలన్న ఆలోచనలో టీఆర్ఎస్ అధిష్టా నం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే ధర్పల్లి జడ్పీటీసీ సుమన, మోర్తాడ్ జడ్పీటీసీ అనితలలో ఒకరికీ జడ్పీ వైస్ చైర్మన్ అవకాశం దక్కవచ్చంటున్నారు. ఇదిలా వుంటే ప్ర చారం జరగుతున్న విధంగా చైర్మన్, వైస్ చైర్మన్ రేసులో ఉన్న వీరిలో ఎవరికైనా ఇస్తారా, లేక నిజామాబాద్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్నికల్లో జరిగిన విధంగా అనూహ్యంగా కొత్త వ్యక్తిని తెరమీదకు తెస్తారా? అన్న చర్చ కూడ జరుగుతోంది. మూడోసారి.. జిల్లాలో మొత్తం 36 జడ్పీటీసీ స్థానాలకు 24 కైవసం చేసుకు న్న టీఆర్ఎస్ మూడోసారి ఇందూరు జడ్పీపై శనివారం గులా బీ జెండా ఎగుర వేయనుంది. ఇప్పటికే రెండు పర్యాయాలు జడ్పీ పీఠాన్ని అధిష్టించిన టీఆర్ఎస్ మూడోసారి ఆ పీఠాన్ని కైవసం చేసుకుని హ్యాట్రిక్ సాధించనుంది. కాగా స్థానిక సంస్థల రిజర్వేషన్లలో భాగంగా జిల్లా పరిషత్ పీఠం మరోసా రి బీసీలకు కేటాయించారు. 1995 తర్వాత మరోసారి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి బీసీలకు రిజర్వు అయ్యింది. జడ్పీకి 1995 నుంచి రిజర్వేషన్ల ప్రక్రియలో చైర్మన్లను ఎన్నుకుం టుండగా.. 1995లో బీసీ జనరల్‌కు, 2001, 2006లలో వరుసగా జనరల్‌కు రిజర్వు కాగా... ఈసారి బీసీ జనరల్‌కు దక్కింది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా టీఆర్ఎస్నే అదృష్టం వరించింది.