లంబసింగిలో యూత్‌హాస్టల్స్ ట్రెక్కింగ్ క్యాంప్
లంబసింగిలో యూత్‌హాస్టల్స్ ట్రెక్కింగ్ క్యాంప్
Published Fri, Nov 11 2016 5:46 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 PM
భీమవరం : భీమవరం యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో డిసెంబర్‌లో లంబసింగి, భద్రాచలం, కొల్లేరు తదితర ప్రాంతాల్లో ట్రెక్కింగ్ క్యాంప్ నిర్వహించనున్నట్టు యూత్ హాస్టల్స్ అసోసియేషన్ భీమవరం శాఖ అధ్యక్షుడు డాక్టర్ మట్లమూడి చెప్పారు. భీమవరంలో శుక్రవారం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్యాంప్ వివరాలను వెల్లడించారు. ఇటీవల పట్టణంలో యూత్ హాస్టల్స్ అసోసియేషన్ నాయకులు డాక్టర్ వీవీజె సోమరాజు, డాక్టర్ సతీష్, డాక్టర్ ఉష, డాక్టర్ రమేష్, మైథిలీ బృందం కాంచనగంగ, పాండిమ్‌గొలుచా పర్వతాలపై ట్రెక్కింగ్ నిర్వహించారన్నారు. డిసెంబర్‌లో నిర్వహించే ట్రెక్కింగ్‌లో పాల్గొనే వారు 94926 89575 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని మట్లపూడి కోరారు. సమావేశలో డాక్టర్ సోమరాజు, సతీష్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement