‘వేలిముద్రలతో మృతదేహాలను గుర్తించలేం’ | Not possible to use Aadhaar biometrics to identify the dead UIDAI tells HC | Sakshi
Sakshi News home page

‘వేలిముద్రలతో మృతదేహాలను గుర్తించలేం’

Published Tue, Nov 13 2018 6:15 AM | Last Updated on Tue, Nov 13 2018 6:15 AM

Not possible to use Aadhaar biometrics to identify the dead UIDAI tells HC - Sakshi

న్యూఢిల్లీ: కేవలం వేలిముద్రలను ఉపయోగించి గుర్తు తెలియని మృతదేహాల వివరాలను కనుక్కోవడం అసాధ్యమని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఢిల్లీ హైకోర్టుకు చెప్పింది. మృతదేహాల వేలిముద్రలను మాత్రమే ఉపయోగించి 120 కోట్ల మందిలో ఆ వేలిముద్రలు ఎవరివో గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం తమ వద్ద లేదంది. ఒక వ్యక్తి ఆధార్‌ నంబర్‌ ఉన్నప్పుడు మాత్రమే.. ఆ ఆధార్‌కు అనుసంధానమై ఉన్న వేలి ముద్రలు ఆ వ్యక్తివేనా? కాదా? అన్నది తెలుసుకోవచ్చని చెప్పింది. గుర్తు తెలియని మృతదేహాల వివరాలను కనుక్కునేందుకు ఆధార్‌ను ఉపయోగించేలా ప్రభుత్వాలు, దర్యాప్తు సంస్థలను ఆదేశించాలంటూ ఓ న్యాయవాది వేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా ఈ వివరాలను యూఐడీఏఐ కోర్టుకు తెలిపింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement