సాక్షి, న్యూఢిల్లీ: ఆధార్ గోప్యతపై ఆందోళను తీవ్ర స్థాయిలో కొనసాగుతుండగానే ఆధారం సెక్యూరిటీపై షాకింగ్ విషయం వెలుగు చూసింది.
అనేక మంది వినియోగదారుల వ్యక్తిగత వివరాలు 200 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వెబ్‌సైట్లలో లీక్ అయ్యాయి. దాదాపు 200కిపైగా వెబ్ సైట్లలో ఆధార్ డేటా లీక్ అయింది. వీటిలొ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సంస్థలతో పాటు పలు విద్యాసంస్థలు ఉన్నాయి. సమాచార హక్కు చట్టం ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చిందని పిటిఐ నివేదించింది.
ఆధార్ వివరాలు చాలా సెక్యూర్డ్‌గా ఉంటాయని కేంద్రం పదే పదే హామి ఇస్తున్నప్పటికీ వందల మంది వినియోగదారుల వ్యక్తిగత వివరాలు భారీగా లీక్ అయ్యాయన్న వార్త సంచలనం రేపింది. మరోవైపు ఈ లీక్‌వ్యవహారంపై యూనిక్ ఐడెంటిటీ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు స్పందించారు. సమాచార లీక్ అంశం బహిర్గతం కావడంతో ఆ డేటాను వెబ్‌సైట్లనుంచి తొలగించినట్టు అధికారులు తెలిపారు. వినియోగదారుడి వ్యక్తిగత సమాచర భద్రత కోసం యూఐడీఏఐ పలు అంచెల్లో భద్రతా ప్రమాణాలు పాటిస్తుందని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు వాటి పనితీరును అధికారులు సమీక్షిస్తారని ముఖ్యంగా డేటా సెంటర్లను కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు. డేటా భద్రత, గోప్యతను బలోపేతం చేయడానికి సెక్యూరిటీ ఆడిట్లను క్రమ పద్ధతిలో నిర్వహిస్తామని, డేటా సురక్షితంగా ఉండటానికి అన్ని చర్యలు తీసుకుంటామని,ఆందోళన అవసరం లేదని హామీ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment