ఉద్యోగుల వివరాలు పంపేందుకు 5 వరకు గడువు | govt employee's will send details till january 5th | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల వివరాలు పంపేందుకు 5 వరకు గడువు

Published Sun, Dec 22 2013 1:16 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాల సేకరణకోసం మానవ వనరుల డేటా పేరుతో ఇచ్చిన నమూనా పత్రాలను పూర్తి చేసి పంపించేందుకు వచ్చే నెల(జనవరి) 5వ తేదీని తుదిగడువుగా నిర్ణయించారు.

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాల సేకరణకోసం మానవ వనరుల డేటా పేరుతో ఇచ్చిన నమూనా పత్రాలను పూర్తి చేసి పంపించేందుకు వచ్చే నెల(జనవరి) 5వ తేదీని తుదిగడువుగా నిర్ణయించారు. ఇందులో.. ఉద్యోగి పుట్టిన తేదీ, ఎక్కడ పుట్టారు, ఏ జిల్లా, ఏ మండలం, ఏ గ్రామం వివరాలతోపాటు రాష్ర్టపతి ఉత్తర్వుల మేరకు స్థానికత ఎక్కడ అనే వివరాలు పొందుపరిచేందుకు వీలుగా ఒక కాలమ్‌ను రూపొందించారు. మానవ వనరుల డేటా, ఉద్యోగుల ఆరోగ్య కార్డులకు సంబంధించిన వివరాల సేకరణ ఉత్తర్వుల్లో భాగంగా దీనిని జారీ చేసినప్పటికీ.. రాష్ట్ర విభజన సమయంలో ఉపయోగించుకునేందుకు అనువుగా స్థానికతను తెలుసుకునేందుకే ఈ ప్రత్యేక కాలమ్‌ను పొందుపరిచారు. ఈ వివరాలను పూర్తి చేసి జనవరి ఐదో తేదీలోగా ఆన్ లైన్‌లో పంపించాలని ఆర్థిక శాఖ సూచించింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement