పేటీఎం నుంచి కొత్త ఆన్‌లైన్ షాపింగ్ యాప్
పేటీఎం మాల్’ ఆవిష్కరణ
ముంబై: వన్97 కమ్యూనికేషన్స్‌కు చెందిన ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్ విభాగం ‘పేటీఎం ఈ–కామర్స్’ తాజాగా కొత్త ఆన్‌లైన్ షాపింగ్ యాప్ ‘పేటీఎం మాల్’ (మాల్ అండ్ బజార్ ఆన్‌లైన్ షాపింగ్)ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. పేటీఎం మాల్‌లో ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, ఫ్యాషన్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, మొబైల్స్, కిచెన్, ఫుట్‌వేర్, ఫిట్‌నెస్ అండ్ స్పోర్ట్స్ వంటి పలు కేటగిరిలు ఉన్నాయని కంపెనీ పేర్కొంది. ఇందులో 1,40,000 విక్రయదారులకు చెందిన దాదాపు 6.8 కోట్ల ప్రొడక్టులను అందుబాటులో ఉంచామని తెలిపింది.
కస్టమర్లకు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు అందిస్తున్నామని పేర్కొంది. పేటీఎం ఎప్పటి నుంచో తన వాలెట్, ఈ–కామర్స్ బిజినెస్‌లను ఒకే వేదికగా (యాప్) నిర్వహిస్తూ వస్తోంది. వాలెట్ బిజినెస్‌ను పేమెంట్స్ బ్యాంక్‌లో కలిపేస్తుండటంతో కంపెనీ ఆన్‌లైన్ షాపింగ్‌కు ప్రత్యేకమైన యాప్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. కాగా పేటీఎం తన ఈ–కామర్స్ బిజినెస్ కోసం ఇటీవలనే అలీబాబా నుంచి 200 మిలియన్ డాలర్లను సమీకరించింది. అలీబాబాకు స్నాప్‌డీల్‌లో కూడా వాటాలున్నాయి.