Online Shopping App
-
ఆన్‌లైన్‌లోనూ ‘ఆప్కో’ ట్రెండ్
సాక్షి, అమరావతి: చేనేత వస్త్రాలకు చేయూతనిస్తున్న ఆప్కో మార్కెట్ పోటీలోనూ తగ్గేదే లేదంటోది. 7 ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఆన్లైన్ మార్కెట్లోనూ బ్రాండ్ బాజా మోగిస్తోంది. చేనేత వస్త్రాల విక్రయాలను మరింత విస్తృతం చేసేందుకు ఆప్కో హ్యాండ్లూమ్స్.కామ్ (apcohandlooms. com) వెబ్‌సైట్‌ను గత ఏడాది అక్టోబర్ 20న సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. అప్పటి నుంచి ఆప్కో ఆన్లైన్ విక్రయాలను చేపట్టింది. అమెజాన్, మింత్ర, ఫ్లిప్‌కార్ట్, గోకూప్, లూమ్‌ఫ్లోక్స్, మిర్రావ్, పేటీఎం ద్వారా ఆన్లైన్ అమ్మకాలు జరుపుతోంది. 2020 అక్టోబర్ నుంచి 2021 మార్చి వరకు రూ.19,13,554 విలువైన చేనేత వస్త్రాలను ఆన్లైన్ ద్వారా విక్రయించగా.. 2021 ఏప్రిల్ నుంచి 2022 జనవరి 15 వరకు రూ.40,74,129 విలువైన వస్త్రాలను విక్రయించింది. ట్రెండ్‌కు అనుగుణంగా చేనేత వస్త్రాలు ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహనరావు మాట్లాడుతూ.. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా చేనేత వస్త్రాలను రూపొందిస్తూ ఆప్కోకు ఆదరణ పెంచుతున్నామన్నారు. ఈ ఏడాది రూ.300 కోట్ల మేర టర్నోవర్ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని, అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే ఉన్న షోరూమ్‌లతోపాటు ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాల్లో మెగా షోరూమ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. -
ఆన్లైన్లో వస్తువులు కొని మోసపోయారా? అయితే వెంటనే ఇలా చేయండి?
కోవిడ్ కారణంగా ఆన్లైన్ వినియోగం పెరిగిపోయింది. మనకు కావాల్సిన నిత్యవసర సరుకుల నుంచి గాడ్జెట్స్ వరకు అన్నీ ఆన్లైన్లోనే కొనుగోలు చేస్తుంటాం. అయితే ఆన్లైన్ వినియోగం పెరగడంతో మోసాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా ఆన్లైన్లో ఫోన్ బుక్ చేస్తే ఇటుక బిళ్ల, సబ్బులు, శానిటైజర్ డబ్బాలు రావడం మనం గమనిస్తుంటాం. ఇలాంటి సమయాల్లో మీరు మోసపోయారని గుర్తిస్తే ఫిర్యాదు చేసుకోవచ్చు. మీకు తప్పక న్యాయం జరుగుతుంది. వీటితో పాటు కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం. ►అమెజాన్‌లో మీరు ప్రొడక్ట్ బుక్ చేస్తే అది ఆ సంస్థది కాదని గుర్తించాలి. అమెజాన్‌లో కోట్లాది మంది సెల్లర్స్ ఉంటారు. వాళ్ల వస్తువుల్ని అమ్మేందుకు మధ్య వర్తిగా ఈకామర్స్ ఫ్లాట్‌ఫామ్స్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్లు ఉంటాయి. ►ఇక ఈ - కామర్స్ సంస్థలకు చెందిన వస్తువులైతే ప్రొడక్ట్ పక్కన ఉదాహరణకు అమెజాన్ ఫుల్ ఫిల్, ఫ్లిప్ కార్ట్ ఎస్యూర్డ్ పేర్లు ఉంటాయి. వాటిని గుర్తించుకోవాలి. ►ప్రొడక్ట్ కొనేముందుకు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోవాలి ►మీకు డెలివరీ వచ్చిన ప్రొడక్ట్‌ను ఓపెన్ చేసే ముందు నుంచి వీడియో తీసి పెట్టుకుంటే మీకు ఒక ప్రూఫ్‌గా ఉంటుంది ►ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి మీరు ఆర్డర్ పెట్టిన ప్రొడక్ట్ మీకు వచ్చినా..ఆ ప్రొడక్ట్ పనిచేయకపోవడం,డ్యామేజ్ అవ్వడంలాంటివి జరుగుతుంటాయి. ►అలా జరిగితే ఈ - కామర్స్ ప్లాట్ ఫామ్‌లోని కొంతమంది సెల్లర్స్ మనకు డబ్బుల్నిరిటన్ చేయడం లేదంటే మీకు కావాల్సిన ఐటమ్ వారం రోజుల్లో రిప్లెస్ చేసి పంపిస్తారు. కొంత మంది పంపించరు. అలాంటి సమయాల్లో తిరిగి మీకు కావాల్సిన ప్రొడక్ట్ లేదంటే డబ్బులు తిరిగి పొందాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. ►ఈకామర్స్ కంపెనీలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ కస్టమర్ కేర్‌కి కాల్ చేస్తే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ►మీకు కస్టమర్ కేర్‌కి కాల్ చేసినా పట్టించుకోలేదంటే..మీ వైపు కరెక్ట్‌గా ఉంటే రిపోర్ట్ చేయోచ్చు. ►మీ ప్రొడక్ట్ డ్యామేజ్ అయినా లేదంటే మీరు తీసుకునే ప్రొడక్ట్ గురించి వెబ్ సైట్లో ఒకలా మీకు డెలివరీ అయిన తరువాత మరోలా ఉంటే కన్జ్యూమర్ కోర్ట్‌లో ఫిర్యాదు చేయోచ్చు. ►కన్జ్యూమర్ ప్రొటస్ట్ యాక్ట్ -2019కింద కంప్లెయింట్ చేయోచ్చు.సెక్షన్-2 లో 10,11,16,28 సెక్షన్లు ఉంటాయి. ఆ సెక్షన్లలో మీరు ఏ సెక్షన్ బాధితులో తెలుసుకోవాలి. ఉదాహరణకు ఫుడ్ డెలివరీ, బ్యాంక్ ట్రాన్సక్షన్, ఆన్లైన్ టికెట్ బుకింగ్ ఇలాంటి వాటిల్లో మీరు మోసపోతే ఫిర్యాదు చేసుకోవచ్చు. ►https://consumerhelpline.gov.in/.లో లేదంటే టోల్ ఫ్రీ నెంబర్ .1800-11-4000,14404కి ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 లోపు ఫోన్ చేయోచ్చు. ►ఎస్ఎంఎస్ అయితే 8130009809కి చేయోచ్చు. ఎన్సీహెచ్,యూఎంఏఎన్‌జీ యాప్‌లో కంప్లెయింట్ చేయోచ్చు. ఇలా డైరక్ట్‌గా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయోచ్చు. ఇలా చేస్తే మీ న్యాయం జరుగుతుంది. అలా జరగకపోతే ప్రైవేట్ సంస్థల్ని సంప్రదించొచ్చు. ►వాటిలో https://icrpc.org/,https://voxya.com/,https://www.onlinelegalindia.com/కి ఫిర్యాదు చేయోచ్చు. వీళ్లు మాత్రం ఫిర్యాదును బట్టి కంప్లెయింట్ తీసుకుంటారు. ► పై వాటితో సంబంధం లేకుండా డైరెక్ట్‌గా కోర్ట్‌లో ఫిర్యాదు చేయాలంటే ఆన్లైన్లో https://edaakhil.nic.in/index.html లో కంప్లెయింట్, అడ్వికేట్ సెక్షన్లో రిజిస్టరై ఫిర్యాదు చేయోచ్చు. కాకపోతే ఇక్కడ మీరు కంప్లెయింట్‌కు ముందుగా ఓ లాయర్‌ను నియమించుకోవాల్సి ఉంటుంది. -
అమెజాన్‌లో ఆవు పిడకలు.. ఛీ రుచిగా లేవంటూ..
న్యూఢిల్లీ: ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్‌లో దొరకని వస్తువు అంటూ ఉండదు. నిత్యావసర సరుకుల నుంచి పండగలకు వాడే సంప్రాదాయ వస్తువుల వరకు అందుబాటులో ఉన్నాయి. తాజాగా అమెజాన్ ఆవు పేడ పిడకలను కూడా అమ్ముతున్న సంగతి తెలిసిందే. విదేశాల్లోని భారతీయుల దృష్ట్యా వారు జరపుకునే సాంప్రదాయ పండగలకు, పూజల నిమిత్తం నాణ్యమైన ఆవు పేడ పిడకలను ఆమెజాన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటిని ‘కౌవ్ డంగ్ కేక్’ అనే పేరుతో విక్రయిస్తుంది. అవి చూసిన ఓ విదేశీ కస్టమర్ వీటిని కొత్తరకం కేకులు అనుకున్నాడేమో కానీ ఆర్టర్ చేసుకున్నాడు. అనంతరం అవి తిని అతడు ఇచ్చిన రివ్వూ ప్రస్తుతం నెట్టింటా నవ్వులు పూయిస్తోంది. ఇది చూసిన భారత కస్టమర్స్, నెటిజన్లు అవాక్కవుతున్నారు. డాక్టర్ సంజయ్ ఆరోరా అనే ట్వీటర్ యూజర్ అమెజాన్ యాప్‌లో అతడి రివ్యూ ఫొటోను పోస్టు చేయడంతో అసలు సంగతి వెలుగు చూసింది. ‘యే మేరా ఇండియా.. ఐ లవ్ ఇండియా’ అంటూ చేసిన ఈ ట్వీట్లో రెండు ఫొటోలు షేర్ చేశాడు. ఇందులో అమెజాన్ కౌవ్ డంగ్ కేక్ పేజీ రివ్యూతో ఉండగా మరో దాంట్లో ‘ఛీ.. వీటి రుచి అస్సలు బాగాలేదు. ఇందులో మట్టి, గడ్డి కలిసినట్టుగా ఉంది. ఇవి తిన్న తర్వాత నాకు లూజ్ మోషన్స్ కూడా అయ్యాయి. ప్లీజ్ వీటిని తయారు చేసేటప్పుడు కాస్తా శుభ్రత పాటించండి. అలాగే కొంచెం క్రంచిగా ఉండేలా కూడా చూసుకోండి’ అంటూ రివ్యూ ఇచ్చాడు. దీంతో అతడికి ఇవి ఏంటనేది స్పష్టత లేదని అర్థం అవుతోంది. అయితే ఆమెజాన్ ఈ ప్రోడక్ట్ కింద ‘ఇవి పండగలు, పూజలు ఇతర సాంప్రదాయా కార్యక్రమాలు వాడే పిడకలు. సహజమైన, నాణ్యమైన ఆవు పేడతో చేసిన కౌవ్ డంగ్ కేక్స్’ అని కూడా స్పష్టంగా రాసింది. అయినప్పటికి అతడి ఇవి ఏంటనేది స్పష్టంగా తెలియదని అర్థమౌవుతోంది. అయితే డాక్టర్ ఆరోరా చేసిన ఈ పోస్టుకు మాత్రం నెటిజన్లు అవాక్కవుతున్నారు. ‘ఇది నిజమేనా!!’,‘నిజంగానే ఇది జరిగిందా’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా మరికొందరూ ‘హహ్హహ్హ అవును కచ్చితం క్రంచీ గా ఉండాలి మరి’ అంటూ తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. Ye mera India, I love my India…. :) pic.twitter.com/dEDeo2fx99 — Dr. Sanjay Arora PhD (@chiefsanjay) January 20, 2021 -
టాటా గ్రూప్ కిట్టీలో బిగ్‌బాస్కెట్!
ముంబై, సాక్షి: దాదాపు ఐదు నెలల చర్చల అనంతరం ఆన్లైన్ గ్రోసరీ స్టార్టప్ బిగ్‌బాస్కెట్‌ను పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు వీలుగా రెండు సంస్థల మధ్య ఇప్పటికే ప్రారంభమైన చర్చలు చివరి దశకు చేరుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. బిగ్‌బాస్కెట్‌లో 80 శాతం వాటాను 1.3 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 9,600 కోట్లు)కు టాటా గ్రూప్ సొంతం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. తద్వారా బిగ్‌బాస్కెట్ విలువను 1.6 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 11,850 కోట్లు)గా మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. డీల్ ఇలా.. ఒప్పందంలో భాగంగా బిగ్‌బాస్కెట్‌లో ఇప్పటికే వాటా కలిగిన ఇన్వెస్టర్ల నుంచి టాటా గ్రూప్ 50-60 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇన్వెస్టర్లలో చైనీస్ ఈకామర్స్ దిగ్గజం అలీబాబా తదితర సంస్థలున్నాయి. బిగ్‌బాస్కెట్‌లో అలీబాబా 26 శాతం వాటాను కలిగి ఉంది. అంతేకాకుండా బిగ్‌బాస్కెట్ తాజాగా జారీ చేయనున్న మరో 20-30 శాతం వాటాను సైతం టాటా గ్రూప్ కొనుగోలు చేయనుంది. తద్వారా బిగ్‌బాస్కెట్‌లో మొత్తం 80 శాతం వాటాను టాటా గ్రూప్ సొంతం చేసుకునే వీలున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. సూపర్-యాప్.. గ్రూప్‌లోని కన్జూమర్ బిజినెస్‌లన్నిటినీ కలుపుతూ ఇటీవల టాటా గ్రూప్ సూపర్ యాప్‌ను రూపొందిస్తోంది. డీల్ ద్వారా బిగ్‌బాస్కెట్‌ను సైతం సూపర్ యాప్‌లో భాగం చేసే యోచనలోఉన్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో హౌస్‌హోల్డ్, గ్రోసరీ విభాగంలో పలు ప్రొడక్టులను అందించేందుకు వీలుంటుందని తెలియజేశారు. టాటా సన్స్ వార్షిక సమావేశంలో భాగంగా గతేడాది చైర్మన్ చంద్రశేఖరన్ సూపర్‌యాప్ ప్రస్తావన తీసుకొచ్చిన విషయం విదితమే. సూపర్ యాప్ ద్వారా గ్రోసరీ, ఫ్యాషన్, ఫుడ్, ఎలక్ట్రానిక్స్, బీమా, ఫైనాన్షియల్, ఎడ్యుకేషన్ తదితర పలు సర్వీసులకు తెరతీయనున్నట్లు పేర్కొన్నారు. కొంతకాలంగా దేశీ ఈకామర్స్ మార్కెట్లో అమెజాన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఫ్లిప్‌కార్ట్ తదితర దిగ్గజాలు వేగవంతంగా కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తగినంత మార్కెట్ వాటాను సొంతం చేసుకునేందుకు టాటా గ్రూప్ సైతం పటిష్ట ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. అయితే డీల్‌పై ఇటు టాటా గ్రూప్, అటు బిగ్‌బాస్కెట్ పెదవి విప్పకపోవడం గమనార్హం! -
నెట్టింటి నుంచి నట్టింట్లోకి..
సాక్షి,సిటీబ్యూరో: నగర జీవనం బిజీ అయిపోయింది. ఇంట్లో పిల్లలు స్కూళ్లకు,కాలేజీలకు వెళితే.. పెద్దవారు ఆఫీసుల దారి పడుతుంటారు. ఇంట్లోకి ఏం కావాలన్నా ఎవరో ఒకరిని బతిమాలి తెచ్చుకునే రోజులు పోయాయి. మనకు కావాల్సిన మందులు, దుస్తులు వంటివి ఆన్లైన్లో ఆర్డరిచ్చేస్తే ఇంటికి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఆ దారిలో కిరాణా సరుకులు కూడా చేరాయి. ఇంట్లో శుభకార్యం.. తరలివచ్చే బంధు, మిత్రులు.. అందరికీ మర్యాదలు చేయాలంటే ఏర్పాట్లు ఘనంగా ఉండాలి. మంచి విందు ఏర్పాటు చేయాలి. ఇలాంటప్పుడు రోజుల తరబడి షాపింగ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే..ఓ వస్తువు ఒక దగ్గర ఉంటే మరొకటి ఇంకోచోట దొరుకుతుంది. అన్నీ ఒక్కచోటేఉంటే ఎంత బాగుంటుందో అనుకుంటాం. ఇప్పుడు అలాంటి రోజు వచ్చేసింది.అదే ‘దుకాన్‌లైన్’. ఆర్డర్ ఇచ్చేసి ఇంట్లో కూర్చొంటే చాలు.. సాధారణంగా కిరాణ షాపునకు పోయేప్పుడు ఇంట్లో కావాల్సినవన్నీ ఓ చీటీ రాసుకుని బయలుదేరుతాం. వాటిలో చాలా వస్తువులు ఒకే షాపులో దొరకడం కష్టమే. పిల్లలకు కావాల్సిన వాటిని కిడ్స్ స్టోర్‌లో, మరికొన్ని మెడికల్ స్టోర్‌లో వెతకాలి. తాలింపు గింజలు, నూనెలు, బియ్యం, పప్పులు వంటివన్నీ కిరాణా స్టోర్‌లో దొరుకుతాయి. ఇక బ్యూటీ బ్రాండ్స్ కావాలంటే మరోచోటుకు పోవాల్సిందే. చిన్న మొత్తాల్లో కొనాలంటేనే రెండు మూడు షాపులు తిరగాలి. ఇక పెద్ద మొత్తంలో అయితే మరీ కష్టం. పైగా పెద్ద మొత్తంలో సరుకులు కొంటే తెచ్చుకోవడానికి ఏ ఆటోనో కిరాయికి పెట్టుకోవాలి. ఇలాంటి సమస్యలేవీ లేకుండా మనకు కావాల్సిన సరుకులను కావాల్సిన మొత్తంలో ఆర్డరిస్తే ఎంచక్కా ఇంటికే తీసుకొస్తుంది దుకాన్‌లైన్. మనకు కావాల్సినవి ‘ఆన్లైన్లో బుకింగ్’ చేసుకుంటే చాలు.. అన్ని కిరాణా సరుకులను ఇది ఇంటికి సరఫరా చేస్తుంది. వంటకు ఉపయోగించే సరుకులే కాదు.. సబ్బులు, క్రీములు కూడా అందిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లో దుకాణం.. మీ వద్ద స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు కావాల్సిన సరుకులు నెట్లో ఆర్డరిచ్చి తెప్పించుకోవచ్చు. ‘దుకాన్‌లైన్’ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని ఎంచక్కా కావాల్సిన వాటిని ఆర్డర్ చేయొచ్చు. ఏ రోజు ఏయే వస్తువులపై ఎంత డిస్కౌంట్ ఉందో కూడా ఈ యాప్ సాయంతో చూసుకోవచ్చు. అంతేకాదు.. ఎంత మొత్తంలో కొంటే ఎంత తగ్గింపు వర్తిస్తుందో కూడా చూపిస్తుంది. ఈ డిస్కౌంట్ అవకాశాన్ని కేవలం గృహ వినియోగదారులే కాదు చిన్న స్థాయి కిరాణా వ్యాపారులూ ఉపయోగించుకోవచ్చు. రోజువారీగా షాపులో అయిపోయిన కిరాణా సరుకులు కోసం డీలర్ల దగ్గరకు పరుగుతీయకుండా నేరు ఈ దుకాన్‌లైన్ నుంచి కొనుక్కోవచ్చు. సరుకులు చేరాకే పేమెంట్.. మనకు కావాల్సిన కిరాణా సరుకులను సాయంత్రం 6 గంటల్లోగా ఆర్డర్ చేస్తే మరుసటి రోజు ఉదయం 10 గంటల్లోపు ఇంటికి చేరుస్తుంది దుకాన్‌లైన్. సరుకులు వచ్చాక అన్నీ సరిచూసుకుని తర్వాత డబ్బులు కట్టవచ్చు. కనీసం రూ.2 వేలకు పైగా మొత్తానికి డెలివరీ కూడా ఉచితమే. అంతేకాదు.. ప్రతి రోజూ మార్కెట్లో ధరలు తగ్గే సరుకుల వివరాలను దుకాన్‌లైన్ మెసేజ్ చేస్తుంది. -
పేటీఎం నుంచి కొత్త ఆన్లైన్ షాపింగ్ యాప్
పేటీఎం మాల్’ ఆవిష్కరణ ముంబై: వన్97 కమ్యూనికేషన్స్‌కు చెందిన ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్ విభాగం ‘పేటీఎం ఈ–కామర్స్’ తాజాగా కొత్త ఆన్లైన్ షాపింగ్ యాప్ ‘పేటీఎం మాల్’ (మాల్ అండ్ బజార్ ఆన్లైన్ షాపింగ్)ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. పేటీఎం మాల్లో ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, ఫ్యాషన్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, మొబైల్స్, కిచెన్, ఫుట్‌వేర్, ఫిట్నెస్ అండ్ స్పోర్ట్స్ వంటి పలు కేటగిరిలు ఉన్నాయని కంపెనీ పేర్కొంది. ఇందులో 1,40,000 విక్రయదారులకు చెందిన దాదాపు 6.8 కోట్ల ప్రొడక్టులను అందుబాటులో ఉంచామని తెలిపింది. కస్టమర్లకు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు అందిస్తున్నామని పేర్కొంది. పేటీఎం ఎప్పటి నుంచో తన వాలెట్, ఈ–కామర్స్ బిజినెస్‌లను ఒకే వేదికగా (యాప్) నిర్వహిస్తూ వస్తోంది. వాలెట్ బిజినెస్‌ను పేమెంట్స్ బ్యాంక్‌లో కలిపేస్తుండటంతో కంపెనీ ఆన్లైన్ షాపింగ్‌కు ప్రత్యేకమైన యాప్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. కాగా పేటీఎం తన ఈ–కామర్స్ బిజినెస్ కోసం ఇటీవలనే అలీబాబా నుంచి 200 మిలియన్ డాలర్లను సమీకరించింది. అలీబాబాకు స్నాప్‌డీల్‌లో కూడా వాటాలున్నాయి.