న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో తమ ప్లాట్‌ఫామ్ ద్వారా జరిగిన స్థూల అమ్మకాలు (జీఎంవీ) 40 శాతం వృద్ధి చెందాయి. విలువపరంగా క్రితం క్యూ4లో రూ. 2.59 లక్షల కోట్లుగా ఉండగా ఈసారి రూ. 3.62 లక్షల కోట్లకు పెరిగాయి.
సమీక్షాకాలంలో నెలవారీ లావాదేవీలు నిర్వహించే యూజర్ల సంఖ్య (ఎంటీయూ) 27 శాతం పెరిగి 9 కోట్లకు చేరిందని పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ తెలిపింది. పేమెంట్ డివైజ్‌ల కోసం చందా చెల్లించే వ్యాపారుల సంఖ్య 2022 డిసెంబర్ క్వార్టర్‌తో పోలిస్తే 10 లక్షలు పెరిగి 68 లక్షలకు చేరినట్లు వివరించింది. పేటీఎం ప్లాట్‌ఫాం ద్వారా రుణ వితరణ పరిమాణం రూ. 3,553 కోట్ల నుంచి మూడు రెట్లు పెరిగి రూ. 12,554 కోట్లకు ఎగిసిందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment