న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపులు, ఫైనాన్షియల్ సర్వీసుల దిగ్గజం వన్97 కమ్యూనికేషన్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర పనితీరు చూపింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో రూ. 778 కోట్లకుపైగా నికర నష్టం ప్రకటించింది. పేటీఎమ్ బ్రాండు సర్వీసుల ఈ కంపెనీ గతేడాది(2020–21) ఇదే కాలంలో కేవలం రూ. 536 కోట్ల నష్టం ప్రకటించింది. అయితే మొత్తం టర్నోవర్ మాత్రం 88 శాతం జంప్‌చేసి రూ. 1,456 కోట్లయ్యింది. వినియోగదారులకు అందించిన పేమెంట్ సర్వీసుల ద్వారా లభించిన ఆదాయం 60 శాతం ఎగసి రూ. 406 కోట్లకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment