Anand Rai
-
క్యూఆర్ కోడ్‌తో స్టార్ హెల్త్ పాలసీ కొనుగోలు
న్యూఢిల్లీ: ఆరోగ్య బీమా పాలసీల కొనుగోలు, రెన్యువల్ ప్రక్రియను మరింత సులభతరం చేయడంపై స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు జరిపే సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచి్చంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తోడ్పాటుతో దీన్ని రూపొందించినట్లు సంస్థ ఎండీ ఆనంద్ రాయ్ తెలిపారు. దీనితో లావాదేవీకి పట్టే సమయం గణనీయంగా తగ్గగలదని వివరించారు. ప్రీమియం చెల్లింపును గుర్తు చేసేందుకు పంపించే సందేశాల్లో యూపీఐ క్యూఆర్ కోడ్ ఉంటుందని, అందులో ఎంత ప్రీమియం కట్టాలనే వివరాలు నిక్షిప్తమై ఉంటాయని సంస్థ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ చిట్టి బాబు తెలిపారు. దాన్ని స్కాన్ చేయడం ద్వారా లేదా లింక్‌ను క్లిక్ చేసి యూపీఐ యాప్ ద్వారా సెకన్లలో చెల్లింపును పూర్తి చేయొచ్చన్నారు. స్టార్ హెల్త్ కూడా సౌకర్యవంతమైన యూపీఐ ఆధారిత ప్రీమియం చెల్లింపు ఆప్షన్‌ను ప్రవేశపెట్టడం సంతోషకరమని ఎన్పీసీఐ చీఫ్ (ప్రోడక్ట్స్) కునాల్ కలావతియా చెప్పారు. -
హీరో ఎవరో తెలియదు.. నా కథ అనిపిస్తే చాలు
న్యూఢిల్లీ: భారత చెస్ దిక్సూచి విశ్వనాథన్ ఆనంద్. చదరంగంలో ఎవరూ ఊహించలేని ఎత్తులు పైఎత్తులతో అద్భుత విజయాలు సాధించిన ఆనంద్ భారత చెస్ ప్రపంచానికి ‘కింగ్’. అంకిత భావం, క్రమశిక్షణతో మెలిగే విషీ అందరికీ ప్రపంచ చాంపియన్‌గా, మేటి చెస్ క్రీడాకారుడిగానే తెలుసు. ఆట తప్ప మరో లోకం లేని ఆనంద్ తన వ్యక్తిగత జీవితం గురించి ఎన్నడూ మాట్లాడింది లేదు. అయితే ఎప్పుడూ సౌమ్యంగా ఉండే ఆనంద్ గురించి తెలుసుకోవాలనేది అభిమానులందరి ఆశ. అందుకే మనకెవరికీ తెలియని ఈ దిగ్గజ క్రీడాకారుడి వ్యక్తిగత జీవితం, సరదాలు, సంతోషాలు, ప్రొఫెషనల్ కెరీర్ గురించి త్వరలోనే సినిమా రాబోతుంది. ఈ బయోపిక్ ‘తనూ వెడ్స్ మనూ’ సినిమా తీసిన డైరెక్టర్ అనంద్ రాయ్ దర్శకత్వంలో రానుంది. ఈ సందర్భంగా తన బయోపిక్ ఎలా ఉంటుందో, ఎలా ఉండాలనుకుంటున్నాడో స్వయంగా ఆనంద్ మాటల్లోనే... 25 శాతం మాత్రమే తెలుసు... నాణ్యమైన చిత్రబృందం ఈ బయోపిక్‌ను తెరకెక్కించనుంది. కెమెరాతో వారు సృష్టించే అద్భుతాలను కనీసం నేను ఊహించలేను. అందుకే సినిమా గురించి పూర్తిగా వారికే వదిలేశా. సినిమా ఎలా ఉండబోతోంది అనే అంశంపై నాకున్న అవగాహన కేవలం 25 శాతం మాత్రమే. తెరపై చూసినప్పుడు ఇది నా కథ అనే భావన నాకు కలిగితే చాలు. కాస్త వినోదాత్మకంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. ఈ సినిమాను అభిమానులు ఎలా ఆదరిస్తారో అని తలుచుకుంటే ఆనందంగా ఉంటుంది. నా బయోపిక్ చెస్‌ను సరళమైన ఆటగా చూపించాలి కానీ ఆటలోని తీవ్రతను తీసేయకూడదు అని అనుకుంటున్నా. మేం ఏలియన్స్ కాదు.. సాధారణ వ్యక్తులమే... సినిమాలో నా వ్యక్తిగత జీవితాన్ని చూసినప్పుడు ప్రేక్షకులకు నేను కొత్తగా కనిపించవచ్చు. ఎందుకంటే సాధారణంగా నేనెప్పుడూ దాని గురించి బయటికి మాట్లాడలేదు. సినీ, క్రీడా తారలు, రాజకీయ ప్రముఖుల గురించి మనకు అంతా తెలుసు అని ప్రజలు అనుకుంటారు. నిజానికి వారి గురించి బయటివారికి ఏమీ తెలిసుండదు. చెస్ నాకెంత ముఖ్యమో తెలిసినవారంతా... నేను నిరంతరం ఆట గురించే ఆలోచిస్తా అని అనుకుంటారు. క్రీడాకారుడిగా నన్ను గమనించే వారికి వ్యక్తిగా నేనేంటో తెలియదు. ఈ చిత్రం చూశాక చెస్ ప్లేయర్లు ఏలియన్స్ (గ్రహాంతర వాసులు) కాదు సాధారణ వ్యక్తులే అనే భావనకు వస్తారు. గ్రాండ్‌మాస్టర్ జీవితాన్ని ఆవిష్కరించాలి... భారీ ప్రేక్షక గణాన్ని దృష్టిలో పెట్టుకొని సినీ నిర్మాతలు సినిమాలు చేస్తారు. దర్శకుడి ప్రతిభపై నమ్మకంతో ప్రేక్షకులు సినిమా చూస్తారు. కానీ నేను సినిమా ఎలా ఉండాలనుకుంటున్నానంటే.. సినిమా చూశాక ‘హా ఇదే కదా నేనూ అనుభవించింది’ అని నా మనసుకు అనిపించాలి. ప్రేక్షకుడికి చెస్ ప్రామాణికత, ఆటలోని తీవ్రత కచ్చితత్వంతో తెలిసేలా ఉండాలి. ఏకాగ్రత అనేది ఒక పోరాటం. అందరూ అందులో ప్రావీణ్యం సంపాదించలేరు. చెస్ ఆటగాడు బోర్డు ముందు కూర్చున్నప్పుడు అతను నిశ్శబ్ధంగా చేసే పోరాటాన్ని ప్రేక్షకుడు గ్రహించేలా సినిమా ఉండాలి. హీరో ఎవరో మరి! ఇప్పటికీ నా పాత్రను పోషించే నటుడెవరో తెలియదు. మిగతా తారాగణం, షూటింగ్ షెడ్యూల్ గురించి తెలియదు. రాయ్ దర్శకత్వం వహించిన సినిమాలు కూడా పూర్తిగా చూసింది లేదు. నిజానికి అతని సినిమాలు చూసి, ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో తెలుసుకోవాలని ఉంది. సాధారణంగా సినిమాలు పెద్దగా చూడను. వంటలకు సంబంధించిన కార్యక్రమాలకు నేను అభిమానిని. డేవిడ్ అటెన్బారో డాక్యుమెంటరీలు చూస్తా. ఈ మధ్య బాస్కెట్‌బాల్ దిగ్గజం మైకేల్ జోర్డాన్ డాక్యుమెంటరీ ‘ద లాస్ట్ డ్యాన్స్’, చెస్ వెబ్ సిరీస్ ‘ద క్వీన్స్ గాంబిట్’ వీక్షించా. (చదవండి: నీదే పిల్లాడి మనస్తత్వం అందుకే, ఇలా..) -
సీఎంతో సంభాషణ రికార్డు చేశా
వ్యాపమ్‌ను బయటపెట్టిన ఆనంద్ రాయ్ వెల్లడి * ఆనంద్ రాయ్, ఆయన భార్యను బదిలీ చేసిన ప్రభుత్వం * కొద్ది గంటల్లోనే యూ టర్న్ ఇండోర్: వ్యాపమ్ స్కామ్‌ను బయటపెట్టిన ఆనంద్ రాయ్ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో తన సంభాషణను రహస్యంగా రికార్డు చేశారనే విషయం వెలుగు చూసింది. ఆగస్టు 11న సీఎం అధికారిక నివాసంలో రాత్రి 9.45 నుంచి 10.50 దాకా చౌహాన్‌తో భేటీ అయ్యానని, తమ సంభాషణను చేతి గడియారంలోని కెమెరాతో రహస్యంగా రికార్డు చేశారని ఆనంద్ శుక్రవారం తెలిపారు. ప్రభుత్వం సీఎంతో తన భేటీని రహస్యంగా రికార్డు చేసి... వారికి పనికొచ్చే భాగాలనే విడుదల చేస్తుందనే ఉద్దేశంతోనే తానీ పని చేశానని, బ్లాక్మెయిల్ చేసేందుకు కాదని అన్నారు. స్కాంపై తన పోరాటం కొనసాగుతుందన్నారు. అయితే శుక్రవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. డాక్టర్లయిన ఆనంద్ రాయ్, గౌరి దంపతులను ప్రభుత్వం ఇండోర్ నుంచి బదిలీ చేసింది. కొద్ది గంటల్లోనే ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. పరపతి ఉన్న మంత్రులు, బీజేపీ నేతలపై తాను ఫిర్యాదు చేసినందువల్లే కక్షసాధించేందుకు ప్రభుత్వం తమను బదిలీ చేసిందని ఆనంద్ ఆరోపించారు. స్కాంలో తన పేరును, కుటుంబ సభ్యుల పేర్లను బయటపెట్టకూడదనే షరతుతో చౌహాన్ తమ బదిలీ ఉత్తర్వులను ఉపసంహరించారన్నారు. సంభాషణను బయటపెడతారా? అని విలేకర్లు అడగ్గా ‘అలా చేయడం నైతికత అనిపించుకోదు’ అని రాయ్ బదులిచ్చారు. -
'వ్యాపం' విజిల్బ్లోయర్పై బదిలీ వేటు
భోపాల్: వ్యాపం కుంభకోణాన్ని బట్టబయలు చేసిన విజిల్ బ్లోయర్, ప్రభుత్వ వైద్యుడు ఆనంద్ రాయ్ పై మధ్యప్రదేశ్ ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఇండోర్‌లో పనిచేస్తున్న ఆయనను ధార్ జిల్లాకు ట్రాన్స్ ఫర్ చేస్తున్నట్లు ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ వైద్యురాలే అయిన రాయ్ భార్యను కూడా ప్రభుత్వం గత నెలలో బదిలీ చేసింది. అయితే కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చినందుకే తనపై, తన కుటుంబంపై ప్రభుత్వం, బీజేపీ పెద్దలు కక్ష పెంచుకున్నారని రాయ్ ఆరోపిస్తున్నారు. వ్యాపం కుంభకోణంలో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత విక్రం వర్మ పాత్రపై ఈ నెల 17న రాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, బదిలీ నిలుపుదల చేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించనున్నట్లు ఆనంద్ రాయ్ మీడియాకు చెప్పారు. మరో విజిల్ బ్లోయర్ ఆశిష్ చతుర్వేది సోమవారం మీడియాతో మాట్లాడుతూ తప్పుడు వ్యక్తుల చేతుల్లో ప్రభుత్వం నడుస్తున్నదని, ఎన్ని బెదిరింపులకు పాల్పడినా భయపడేదిలేదని, వ్యాపం నిందితులకు శిక్షపడేంతవరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు.