
న్యూఢిల్లీ: కోవిడ్–19 టీకా తీసుకున్న రోగుల్లో మరణాలు 81 శాతం, ఐసీయూలో చేరాల్సిన పరిస్థితులు 66 శాతం మేర తగ్గినట్లు ఆరోగ్య బీమా సంస్థ స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ ఒక అధ్యయన నివేదికలో వెల్లడించింది. దీనితో టీకా తీసుకున్న రోగుల ఆస్పత్రి వ్యయాలు 24 శాతం తగ్గినట్లు పేర్కొంది. టీకా తీసుకోని వారి ఆస్పత్రి వ్యయాలు సగటున రూ. 2.77 లక్షలుగా ఉండగా, తీసుకున్న వారి వ్యయాలు రూ. 2.1 లక్షలుగా ఉందని సంస్థ ఎండీ ఎస్ ప్రకాష్ తెలిపారు. కోవిడ్–19 టీకాల ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు .. దేశీయంగా వేక్సినేషన్ మొదలైన 42 రోజుల తర్వాత ఈ అధ్యయనం నిర్వహించారు. 45 ఏళ్లు పైబడి, ఆస్పత్రిలో చేరిన 3,820 మందిపై దీన్ని నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment