Foreign customers
-
వీరికి ఐటీ రిటర్నుల నుంచి మినహాయింపు
న్యూఢిల్లీ: ఆదాయపన్ను రిటర్నుల దాఖలు విషయంలో స్థానికంగా నివసించని వారు, విదేశీ ఇన్వెస్టర్లకు వెసులుబాటు కల్పిస్తూ ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. భారత్‌లో నివసించని వారు (కార్పొరేట్స్).. నిర్దేశిత ఫండ్‌లో పెట్టుబడులు మినహా ఎటువంటి ఆదాయాన్ని పొందని వారు.. గిఫ్టిసిటీలో ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కేటగిరీ–3 కిందకు వచ్చే వారు రిటర్నులు దాఖలు చేయనక్కర్లేదని సీబీడీటీ తన నోటిఫికేషనలో తెలిపింది. అర్హత కలిగిన విదేశీ ఇన్వెస్టర్లు.. జీడీఆర్, రూపీ డినామినేటెడ్ బాండ్లు, డెరివేటివ్‌లు లేదా ఎంపిక చేసిన సెక్యూరిటీలు, ఐఎఫ్ఎస్సీలోని గుర్తింపు ఉన్న స్టాక్ ఎక్సేంజ్ల్లోని లిస్టెడ్ సెక్యూరిటీల్లో లావాదేవీలు నిర్వహించిన వారు రిటర్నులు దాఖలు చేయనవసరం లేదని సీబీడీటీ స్పష్టం చేసింది. 2020–21 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ వెసులుబాటు అమల్లోకి వస్తుందని తెలిపింది. -
కరోనా వార్తలే కీలకం
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కేసుల పోకడను బట్టే దేశీయంగా గానీ, అంతర్జాతీయంగా గానీ ఈ వారం స్టాక్ మార్కెట్ల కదలికలు ఉంటాయని నిపుణులంటున్నారు. సెన్సెక్స్, నిఫ్టీలు తీవ్రమైన ఒడిదుడుకులకు గురవుతాయని వారంటున్నారు. దేశీ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, డాలర్‌తో రూపాయి మారకం విలువ కదలికలు, ముడి చమురు ధరల గమనం....ఈ అంశాలు కూడా ఈ వారం మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని విశ్లేషణ. ఫిచ్ అంచనా ప్రభావం!: 2020–21లో భారత్ జీడీపీ వృద్ధి రేటు 2 శాతానికి పడిపోతుందన్న ఫిచ్ అంచనా మార్కెట్‌పై ప్రభావం చూపవచ్చు. నేడు వెలువడే (సోమవారం) సేవల రంగం పీఎమ్ఐ గణాంకాలు, 9న ఫిబ్రవరి నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు మార్కెట్‌పై ప్రభావం చూపుతాయి. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు మంచి అవకాశం.... కాగా కరోనా వైరస్ కేసులను బట్టే దేశీ, విదేశీ స్టాక్ మార్కెట్ల తీరు ఉంటుందని మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ సిద్ధార్థ ఖేమ్కా చెప్పారు. మార్కెట్ ఇప్పటికే చెప్పుకోదగిన స్థాయిలో కరెక్షన్కు గురయిందని, దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ఇది మంచి అవకాశమని అభిప్రాయపడ్డారు. మహావీర్ జయంతి సందర్భంగా నేడు(సోమవారం) సెలవు. అలాగే గుడ్‌ఫ్రైడే (ఈ నెల 10న) సందర్భంగా కూడా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ జరగదు. దీంతో ఈ వారంలో మూడు రోజులే ట్రేడింగ్ జరగనున్నది. భారీ విదేశీ నిధులు వెనక్కి..: కరోనా వైరస్ కల్లోలం ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంట్‌ను దెబ్బతీయడంతో విదేశీ ఇన్వెస్టర్లు మన క్యాపిటల్ మార్కెట్ నుంచి గత నెలలో రూ.1.1 లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.61,973 కోట్లు, బాండ్ మార్కెట్ నుంచి రూ.56,211 కోట్లు వెరసి రూ.1.18,184 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. విదేశీ ఇన్వెస్టర్లు ఈ స్థాయిలో పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం బహుశా ఇదే మొదటిసారి. -
విదేశీ ఇన్వెస్టర్ల ‘బీమా’ మోజు!
న్యూఢిల్లీ: విదేశీ ఇన్వెస్టర్లు లిస్టెడ్ బీమా సంస్థల పట్ల ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ప్రీమియం వసూళ్లలో బలమైన వృద్ధి చూపిస్తుండడం, అదే సమయంలో ఈ కంపెనీల షేర్ల విలువలు భవిష్యత్తు వృద్ధి అవకాశాల కోణంలో ఆకర్షణీయంగా కనిపిస్తుండడంతో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) బీమా కంపెనీల్లో మార్చి నెలలో ఏకంగా రూ.6,780 కోట్ల మేర ఇన్వెస్ట్ చేశారు. అందుబాటులో ఉన్న తాజా గణాంకాలను పరిశీలించినట్టయితే మార్చి నెలలో రంగాల వారీగా ఎఫ్‌పీఐల పెట్టుబడుల్లో బీమా రంగమే అత్యధిక పెట్టుబడులను ఆకర్షించడం గమనార్హం. 2018 మార్చి తర్వాత ఒక నెలలో బీమా రంగంలోకి అధిక పెట్టుబడులు రావడం కూడా గత నెలలోనే. ప్రైమరీ, సెకండరీ మార్కెట్లలో డీల్స్ ‘‘ఎఫ్‌పీఐల పెట్టుబడులను కంపెనీల మూలాలు, ధరల పనితీరు, మొత్తం మార్కెట్ పెట్టుబడుల కోణంలో చూడాల్సి ఉంటుంది. ఫండమెంటల్స్ పరంగా చూస్తే జీవిత బీమా, సాధారణ బీమా కంపెనీలు ఫిబ్రవరి నెల ప్రీమియం వసూళ్లలో బలమైన వృద్ధిని నమోదు చేశాయి’’ అని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఎండీ, సీఈవో శిల్పా కుమార్ పేర్కొన్నారు. ఒకవైపు అధిక ఎఫ్‌పీఐల పెట్టుబడులకు తోడు బీమా రంగంలో ప్రైమరీ, సెకండరీ మార్కెట్లో ఒప్పందాలు కూడా చోటు చేసుకోవడం గమనార్హం. బ్రిటన్‌కు చెందిన ప్రుడెన్షియల్ కార్పొరేషన్ తనకు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉన్న వాటాల్లో 3.7 శాతాన్ని ఆఫర్ ఫర్ సేల్ విధానంలో విక్రయించింది. ఈ డీల్ విలువ రూ. 200 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1,400 కోట్లు). అలాగే, దీనికి ముందు హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్‌లో స్టాండర్డ్ లైఫ్ 4.93 శాతం వాటాను ఆఫర్ ఫర్ సేల్ మార్గంలోనే తగ్గించుకుంది. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఒకానొక భాగస్వామి బీఎన్పీ పారిబాస్ కార్డిఫ్ సైతం 5 శాతం మేర వాటాలను బ్లాక్ డీల్ ద్వారా రూ.3,000 కోట్లకు మార్చి నెలలో విక్రయించింది. వృద్ధి అవకాశాలు... ఆర్థిక రంగంలో బీమా కూడా అధిక వృద్ధితో కూడిన రంగమని శిల్పా కుమార్ పేర్కొన్నారు. ‘‘ప్రైవేటు బీమా సంస్థలు వార్షికంగా చూస్తే గత ఆర్థిక సంవత్సరంలో ప్రీమియం పరంగా 20 శాతానికి పైగా వృద్ధిని సాధించాయి. అదే సాధారణబీమా సంస్థలు వార్షికంగా మొత్తం మీద 13 శాతం వృద్ధిని నమోదు చేశాయి. వైద్య బీమా వ్యాపారం అయితే 40 శాతం మేర వృద్ధి చెందింది’’ అని ఆమె వివరించారు. బీమా రంగం పట్ల ఆసక్తి తిరిగి పుంజుకుందని, భౌగోళికంగా భిన్న ప్రాంతాల నుంచి... ఎఫ్‌పీఐలు, సావరీన్ వెల్త్ ఫండ్స్, ఆల్టర్నేటివ్ అస్సెట్ మేనేజర్స్, మ్యూచువల్ ఫండ్స్ నుంచి భాగస్వామ్యం ఉన్నట్టు చెప్పారు. నిజానికి దేశీ ఈక్విటీ మార్కెట్లలో గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ భాగం ఎఫ్‌పీఐలు అమ్మకాలు వైపు ఉండగా... ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈక్విటీల్లో నికరంగా రూ.51,200 కోట్లు, బాండ్ల మార్కెట్లలో నికరంగా రూ.5,964 కోట్ల పెట్టుబడులతో ఆర్థిక సంవత్సరాన్ని ముగించడం విశేషం. అంతర్జాతీయంగా లిక్విడిటీ మెరుగుపడడం, స్థిరమైన వడ్డీ రేట్లు, అధికార పార్టీయే తిరిగి మళ్లీ విజయం సాధిస్తుందన్న అంచనాలు విదేశీ ఇన్వెస్టర్లలో భారత మార్కెట్ల పట్ల ఆశావహ పరిస్థితి కారణమని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ నవీన్ కులకర్ణి తెలిపారు. ‘‘అంతర్జాతీయ వృద్ధి నిదానించడం, అంతర్జాతీయంగా సెంట్రల్ బ్యాంకుల విధానాల్లో మార్పు రావడంతోపాటు అమెరికాలో రేట్ల పెంపు అవకాశాలు లేకపోవడమే... ఎఫ్‌పీఐలకు భారత్ ఏడారిలో ఒయాసిస్‌లా మారింది’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ పీసీజీ అండ్ క్యాపిటల్ మార్కెట్స్ స్ట్రాటజీ హెడ్ వీకే శర్మ పేర్కొన్నారు. -
విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరు
రూపాయి బలపడటం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరుతో గురువారం స్టాక్ మార్కెట్ లాభపడింది. స్టాక్ సూచీలు లాభపడటం ఇది వరుసగా నాలుగో రోజు. ఆద్యంతం స్తబ్దుగా, ఒడిదుడుకులమయంగా సాగిన ట్రేడింగ్‌లో బీఎస్ఈ సెన్సెక్స్ 89 పాయింట్ల లాభంతో 36,725 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 5 పాయింట్లు పెరిగి 11,058 పాయింట్ల వద్ద ముగిశాయి,. ఈ నాలుగు రోజుల్లో సెన్సెక్స్‌మొత్తం 858 పాయింట్లు పెరిగింది. గత మూడు రోజుల లాభాల కారణంగా పెరిగిన కొన్ని షేర్లలో లాభాల స్వీకరణ జరిగినప్పటికీ, స్టాక్ సూచీలు స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. కీలకమైన స్థాయిలపైననే ముగియగలిగాయి. 239 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్... డాలర్‌తో రూపాయి మారకం 28 పైసలు పెరగడం సానుకూల ప్రభావం చూపించింది. సెన్సెక్స్ లాభాల్లోనే ఆరంభమైంది. మధ్యాహ్నం వరకూ లాభాలు కొనసాగాయి. ఆ తర్వాత నష్టాల్లోకి జారిపోయింది. స్వల్ప కాలమే స్వల్పంగా నష్టపోయిన సెన్సెక్స్ మళ్లీ లాభాల బాట పట్టింది. ఒక దశలో 45 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ మరో దశలో 194 పాయింట్ల వరకూ లాభపడింది.రోజంతా 239 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ముడి చమురు ధరలు ఒక శాతం మేర పెరగడం ఒకింత ప్రతికూల ప్రభావం చూపించింది. ► దేశీయ సంస్థల నుంచి భారీ ఆర్డర్లు సాధించడంతో ఎల్అండ్ టీ షేర్ 2.7 శాతం లాభపడి రూ.1,351 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా పెరిగిన షేర్ ఇదే. ► డాలర్‌తో రూపాయి మారకం రెండు నెలల గరిష్టానికి చేరడంతో ఐటీ షేర్లు నష్టపోయాయి. ► పంచదార మిల్లులకు అదనపు నిధులు కేటాయించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో సంబంధిత షేర్లు పరుగులు పెట్టాయి. -
ప్రచారంతో ప్రోత్సాహం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏదైనా సంస్థ నిలబడాలంటే.. ఓ మంచి ఆలోచన, ప్రజలకు ఉపయోగపడే సేవలు, దాన్ని నిలబెట్టుకోవాలనే తపన ఉంటే చాలదు. వాటికి ప్రచారం కూడా అవసరమే మరి. అందుకే ఇలాంటి స్టార్టప్స్ సంస్థలను ప్రోత్సహించేందుకు ‘స్టార్టప్ డైరీ’ పేరుతో ప్రతి శనివారం ‘సాక్షి’ ఓ ప్రత్యేక కథనాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. విద్య, వైద్యం, ఆరోగ్యం, షాపింగ్, మొబైల్స్.. ఇలా ప్రతి విభాగానికి సంబంధించిన ఓ కొత్త స్టార్టప్‌ను ఎంపిక చేసి.. ఆ సంస్థ ఆవిర్భావం నుంచి మొదలుపెడితే అందిస్తున్న సేవలు.. నిధుల సమీకరణ.. భవిష్యత్తు ప్రణాళిక.. వంటి సమస్త సమాచారాన్ని పాఠకులకు సవివరంగా సాక్షి సవివరంగా అందిస్తోంది. ప్రతి కంపెనీ సేవలు వేటికదే ప్రత్యేకం. సరికొత్త ఆలోచనలతో.. ప్రజలకు ఉపయోగపడే సేవలు అందిస్తోన్న కంపెనీల వివరాలు చూసిన పాఠకులు స్పందిస్తూ ఆయా స్టోరీలను సోషల్ మీడియాల్లో పోస్ట్ చేశారు. తమకు పాఠకులు మెయిళ్లు, ఫోన్లు చేసి అభినందించడంతో పాటు తమ స్టార్టప్స్‌ను ప్రోత్సహించేందుకు ముందుకు వస్తున్నట్లు ఆయా కంపెనీల యజమానులు ‘సాక్షి’కి చెపుతున్నారు. ఆ వివరాలు... విదేశీ కస్టమర్లు పెరిగారు.. ఇప్పటివరకు ఈకిన్‌కేర్.కామ్‌లో చాలా వరకు కస్టమర్లు స్థానికులు. కానీ, సాక్షి స్టార్టప్ డైరీలో మా సంస్థ అందిస్తున్న సేవలను ప్రచురించాక.. విదేశీ కస్టమర్ల సంఖ్య చాలా వరకు పెరిగిందని ఈకిన్‌కేర్.కామ్ సీఈఓ కిరణ్ కే కలకుంట్ల చెప్పారు. దాదాపు 350-400 మంది ఎన్నారైలు ఈకిన్‌కేర్. కామ్‌లో రిజిస్టర్ అయ్యారు. ఎన్నారైలు ఇక్కడున్న వారి తల్లిదండ్రులు, కుటుంబీకుల ఆరోగ్య సంరక్షణ కోసం వారి మెడికల్ రికార్డ్లను ఈకిన్‌కేర్.కామ్‌లో రిజిస్టర్ చేసుకున్నారు. దీంతో వారికొచ్చిన వ్యాధేంటి.. అది ఏ స్థాయిలో ఉంది? వాటి తాలుకు వివరాలను గ్రాఫులు, రంగుల రూపంలో తెలుసుకోవచ్చు. దీంతో వ్యాధి తీవ్రం కాకముందే నివారణ చర్యలు తీసుకోవచ్చు. పాఠశాలలు కదిలొచ్చాయ్.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువులంటే ఎందకో చిన్న చూపు. కారణం.. టీచర్లు, వసతులు సరిగా ఉండవని. అయితే సాక్షి స్టార్టప్ డైరీలో smartur3d.com గురించి వార్తా కథనం ప్రచురితమయ్యాక.. చాలా మందిలో అప్పటివరకున్న అభిప్రాయం తప్పనిపించిందంటున్నాడు సంస్థ సీఈఓ నీరజ్ జువెల్కర్. ‘‘మా పాఠశాలల్లోని విద్యార్థులకు కూడా టఝ్చట్టఠట3ఛీ.ఛిౌఝ ద్వారా విద్యా బోధన చేస్తాం.. మీ సాఫ్ట్‌వేర్‌ను మాకు అందించండని’’ పలు పాఠశాలల ప్రిన్సిపల్స్ మా కంపెనీకి మెయిల్స్, ఫోన్లు చేశారు. నావరకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడం వెనక కారణం కూడా ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు ఉపయోగపడితే చాలని. రూ.10-12 లక్షల వ్యాపారం జరిగింది.. ఈ-కామర్స్ వ్యాపారాన్ని ఎం-కామర్స్ ఎలా అధిగమించనుంది.. భవిష్యత్తులో ఎం-కామర్స్ సైట్లకు డిమాండ్ ఎలా ఉండబోతోందన్న విషయాన్ని సాక్షి స్టార్టప్ డైరీ చాలా విపులంగా వివరించింది. దీంతో చాలా మంది వ్యాపారులు ఎం-కామర్స్ సైట్‌ను డిజైన్ చేయించుకునేందుకు ఆసక్తి చూపించారంటున్నారు మార్ట్‌మోబీ.కామ్ సీఈఓ సత్యక్రిష్ణ గన్ని. రూ.3 వేల ఖర్చుతో ఒక్క రోజులోనే ఎం-కామర్స్ సైట్‌ను రూపొందిస్తున్న మార్ట్‌మోబీ సేవలను చూసిన సుమారు 30-40 కంపెనీలు ఎం-కామర్స్ సైట్‌ను రూపొందించుకునేందుకు సంప్రదించాయి. వీటి ద్వారా మా సంస్థకు సుమారు రూ.10-12 లక్షల వ్యాపారం జరిగింది.