ప్రపంచంలోనే అందమైన శిరోజాలు కావాలని అందరు కోరుకుంటారు. మనిషికి అందాన్నిచ్చేవి శిరోజాలే. అలాంటిది జుట్టు రోజూ కొద్దికొద్దిగా రాలిపోతుంటే.. బట్టతల వస్తుందనే ఆందోళన మొదలవుతుంది. పౌష్టికాహార లోపం, మానసిక ఒత్తిడి కారణంగా కొందరికి జుట్టు రాలడం సర్వసాధారణమయింది. ఈ క్రమంలో మెరుగైన జీవనశైలిని ఆచరించడం వల్ల జుట్టురాలే సమస్యకు చెక్ పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయిదు నియమాలు పాటించినట్లయితే ఒత్తైన జుట్టును సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు.
ఆహార నియమాలు
మనం తీసుకునే ఆహార నియమాల ద్వారానే మెరుగైన శిరోజాలను సొంతం చేసుకోవచ్చని పోషకాహార నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇందుకోసం కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు, విటమిన్లలతో కూడిన సమతుల ఆహారమే దివ్యౌషదమని వైద్యులు సూచిస్తున్నారు. జుట్టు రాలడాన్ని నివారించడంలో విటమిన్ ఏ, విటమిన్ ఇ, బయోటిన్, ప్రొటీన్, జింక్ తదితర పోషకాలు ముఖ్య పాత్ర పోషిస్తాయని డాక్టర్లు చెబుతున్నారు.
నిత్యం తలకు నూనె వాడడం
చాలామంది తలకు నూనె రాయడాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. క్రమం తప్పకుండా నూనెను వాడడం వల్ల జుట్టు రాలే సమస్యను నివారించవచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు. మీ శిరోజాల రకానికి అనుగుణమమైన ఏ నూనె అయినా ఎంచుకోవచ్చు.
హేర్‌స్టైల్
అందంగా కనిపించడానికి చక్కటి హేర్‌స్టైల్ ఉండడం అవసరమే, కానీ స్టైల్ కోసమని విపరీతంగా కెమికల్స్ వాడడం వల్ల జుట్టు రాలే సమస్య మరింత పెరుగుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
కండీషనర్ వాడడం
తలస్నానం చేశాక కండీషనర్‌ను వాడడం తప్పనిసరిగా చేయాలి. జుట్టుకు పోషణ ఇవ్వడంతో పాటు మృదువుగా చేయడంలో కండీషనర్ ఎంతో మేలు చేస్తుంది. జుట్టు రాలే వాటిని నివారించడంలో కండీషనర్‌ను ముఖ్య పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
మానసిక ఒత్తిడి
జుట్టు రాలే సమస్యకు మానసిక ఒత్తిడి ప్రధాన కారణమని డాక్టర్లు చెబుతున్నారు. కేవలం జుట్టు రాలే సమస్యే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న అనేక వ్యాధులకు మానసిక ఒత్తిడి ప్రధాన కారణమని ప్రపంచ ఆహార సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment