అమెరికాలో భారత సంతతికి చెందిన ఫిజిషియన్ మోనా ఘోష్ హెల్త్ కేర్ మోసానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రసూతికి సంబంధించిన స్త్రీ జననేంద్రియ సేవల్లో నైపుణ్యం కలిగిన ఆమె చికాగోలో ప్రోగ్రెసివ్ ఉమెన్స్ హెల్త్‌ర్‌ను నిర్వహిస్తున్నారు. అయితే ఆమె ప్రైవేట్ బీమా సంస్థలకు కూడా లేని సేవలకు బిల్లులు క్లయిమ్ చేసిన మోసాని పాల్పడ్డారు. ఆమె విచారణలో ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన రెండు మోసాలకు పాల్పడినట్లు అంగీకరించారు.
ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఘోష్ మోసాపూరితంగా పొందిన రీయింబర్స్‌మెంట్‌లలో దాదాపు రూ.27 కోట్లకు జవాబుదారిగా ఉన్నట్లు ఆరోపించింది. అయితే ఘోష్ తన అభ్యర్థన ఒప్పందంలో రూ. 12 కోట్లకు మాత్రమే జవాబుదారిగా ఉన్నానని పేర్కొంది. ఈ మోసాలకు గానూ అమెరికా జిల్లా న్యాయమూర్తి ఫ్రాంక్లిన్ యు వాల్డెర్రామా అక్టోబర్ 22న శిక్ష ఖరారు చేశారు. ఆమె 2018 నుంచి 2022 వరకు తన ఉద్యోగులు సమర్పించిన మెడిసెడ్, ట్రైకేర్ వంటి వాటికి ఇతర బీమా సంస్థలు కూడా అందించని లేదా వైద్యపరంగా అవసరం లేని సేవలకు కూడా మోసపూరితంగా క్లెయిమ్‌లను సమర్పించారని కోర్టు పేర్కొంది.
ఇదంతా రోగి అనుమతి లేకుండానే ఆమె ఈ మోసానికి పాల్పడ్డట్లు తెలిపింది. అందుకుగానూ ఆమె ఎంత మొత్తం చెల్లించాల్సిందనేది శిక్షాకాలంలో కోర్టే నిర్ణయిస్తుందని తీర్పులో పేర్కొంది. ఇక ఘోష్ కూడా అధిక రీయింబర్స్‌మెంట్‌లు పొందేందుకు టెలిమెడిసిన్ సందర్శనలు ఎక్కువగా చేసినట్లు పేషెంట్ మెడికల్ రికార్డ్‌లను సృష్టించానని అంగీకరించింది. అలాగే అవసరం లేని బిల్లింగ్ కోడ్‌లను క్లైయిమ్ చేసినట్లు కూడా ఘోష్ విచారణలో ఒప్పుకుంది.
(చదవండి: నాలుగేళ్ల తరువాత ఇంటికి బయలుదేరిన యువతి: విమానంలోనే కన్నుమూత)
Comments
Please login to add a commentAdd a comment