pleads
-
హెల్త్‌కేర్ మోసాలకు పాల్పడ్డ భారత సంతతి ఫిజిషియన్
అమెరికాలో భారత సంతతికి చెందిన ఫిజిషియన్ మోనా ఘోష్ హెల్త్ కేర్ మోసానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రసూతికి సంబంధించిన స్త్రీ జననేంద్రియ సేవల్లో నైపుణ్యం కలిగిన ఆమె చికాగోలో ప్రోగ్రెసివ్ ఉమెన్స్ హెల్త్ర్ను నిర్వహిస్తున్నారు. అయితే ఆమె ప్రైవేట్ బీమా సంస్థలకు కూడా లేని సేవలకు బిల్లులు క్లయిమ్ చేసిన మోసాని పాల్పడ్డారు. ఆమె విచారణలో ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన రెండు మోసాలకు పాల్పడినట్లు అంగీకరించారు. ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఘోష్ మోసాపూరితంగా పొందిన రీయింబర్స్‌మెంట్‌లలో దాదాపు రూ.27 కోట్లకు జవాబుదారిగా ఉన్నట్లు ఆరోపించింది. అయితే ఘోష్ తన అభ్యర్థన ఒప్పందంలో రూ. 12 కోట్లకు మాత్రమే జవాబుదారిగా ఉన్నానని పేర్కొంది. ఈ మోసాలకు గానూ అమెరికా జిల్లా న్యాయమూర్తి ఫ్రాంక్లిన్ యు వాల్డెర్రామా అక్టోబర్ 22న శిక్ష ఖరారు చేశారు. ఆమె 2018 నుంచి 2022 వరకు తన ఉద్యోగులు సమర్పించిన మెడిసెడ్, ట్రైకేర్ వంటి వాటికి ఇతర బీమా సంస్థలు కూడా అందించని లేదా వైద్యపరంగా అవసరం లేని సేవలకు కూడా మోసపూరితంగా క్లెయిమ్‌లను సమర్పించారని కోర్టు పేర్కొంది.ఇదంతా రోగి అనుమతి లేకుండానే ఆమె ఈ మోసానికి పాల్పడ్డట్లు తెలిపింది. అందుకుగానూ ఆమె ఎంత మొత్తం చెల్లించాల్సిందనేది శిక్షాకాలంలో కోర్టే నిర్ణయిస్తుందని తీర్పులో పేర్కొంది. ఇక ఘోష్ కూడా అధిక రీయింబర్స్మెంట్లు పొందేందుకు టెలిమెడిసిన్ సందర్శనలు ఎక్కువగా చేసినట్లు పేషెంట్ మెడికల్ రికార్డ్లను సృష్టించానని అంగీకరించింది. అలాగే అవసరం లేని బిల్లింగ్ కోడ్లను క్లైయిమ్ చేసినట్లు కూడా ఘోష్ విచారణలో ఒప్పుకుంది.(చదవండి: నాలుగేళ్ల తరువాత ఇంటికి బయలుదేరిన యువతి: విమానంలోనే కన్నుమూత) -
అమెరికాలో సెటిలయ్యేందుకు ‘దొంగపెళ్లి’.. చుక్కలు చూపించిన అధికారులు!
అమెరికాలోని ఇల్లినాయిస్లో ఉంటున్న 35 ఏళ్ల భారతీయుడు యూఎస్‌లో స్థిరపడేందుకు, గ్రీన్ కార్డ్ సంపాదించే ఉద్దేశంతో అక్కడి మహిళను వివాహం చేసుకున్నట్టు దొంగ రుజువులు చూపి, మోసానికి పాల్పడ్డాడు. ఈ నేరానికి పాల్పడిన వివేక్ చౌహాన్‌కు ఈ కేసులో నేరం రుజువైతే గరిష్టంగా ఐదేళ్ల జైలుశిక్ష, 250,000 అమెరికన్ డాలర్ల జరిమానా విధిస్తామని యుఎస్ అటార్నీ ట్రిని ఇ రాస్ ప్రకటించారు. 2018, ఏప్రిల్ 2న చౌహాన్ మసాచుసెట్స్‌లోని వోర్సెస్టర్‌కు చెందిన అమెరికా పౌరురాలిని వివాహం చేసుకున్నాడు. అయితే వారి వివాహం నిజం కాదని పోలీసుల దర్యాప్తులో తేలింది. వివేక్ చౌహాన్ దంపతులు ఎప్పుడూ కలిసి నివసించలేదని, గ్రీన్ కార్డ్ పొందేందుకు వివేక్ చౌహాన్ ఆమెను ‘కాంట్రాక్ట్ మ్యారేజ్’ చేసుకున్నాడని కేసును విచారిస్తున్న అసిస్టెంట్ యూఎస్ అటార్నీ జాన్ డీ ఫాబియన్ పేర్కొన్నారు. 2018, జూన్ 1న వివేక్ చౌహాన్ తన భారతీయ పాస్‌పోర్ట్‌ను చూపించి, మారిన తన వైవాహిక స్థితిని పేర్కొంటూ, అమెరికాలో శాశ్వత నివాసాన్ని పొందేందుకు హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగానికి దరఖాస్తును సమర్పించాడు. ఈ నేపధ్యంలో 2019 మే నెలలో యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) అతనిని ఇంటర్వ్యూ చేసింది. ఆ సమయంలో వివేక్ చౌహాన్ ‘కాంట్రక్ట్ భార్య’ తాను చౌహాన్‌తో కలిసి ఉంటున్నట్లు అధికారులకు తెలియజేసింది. కాగా వివేక్ చౌహాన్‌ను 2021, నవంబర్‌లో యూఎస్సీఐఎస్ రెండవసారి ఇంటర్వ్యూ చేసింది. ఆ సమయంలో వివేక్ చౌహాన్ తాను తన భార్యతో కలిసి ఉంటున్నట్లు చెప్పాడు. పైగా తన భార్య గర్భవతి అని కూడా వారిని నమ్మబలికాడు. కాగా చౌహాన్‌ను వివాహం చేసుకున్న యూఎస్ మహిళ ఇటువంటి పలు మోసపూరిత వివాహాలకు పాల్పడిందని, యూఎస్సీఐఎస్ ఇంటర్వ్యూలలో అబద్దాలు చెప్పి, అధికారులను తప్పుదారి పట్టించిందని పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యింది. కాగా ఈ ఉదంతంలో చౌహాన్‌కు 2024 జనవరి 26న శిక్ష ఖరారు కానున్నదని సమాచారం. ఇది కూడా చదవండి: ఊహించని పరిస్థితుల్లో నాగసాకిపై అణుబాంబు? -
‘అయ్యయ్యో.. లోపలుండిపోయానే’.. మసాజ్ మిషన్‌లో నుంచి కేకలు..
పెద్దపెద్ద ఎలక్ట్రానిక్ స్టోర్స్‌లో మసాజ్ చైర్లు కనిపిస్తుంటాయి. ఇక్కడకు షాపింగ్‌కు వచ్చిన వినియోగదారులు ఒక్కోసారి ఇటువంటి చైర్లలో సేదతీరుతుంటారు. అయితే ఈ విధంగా మసాజ్చైర్లో కూర్చున్న వ్యక్తికి వింత అనుభవం ఎదురయ్యింది. ఈ ఉదంతం జపాన్‌లో చోటుచేసుకుంది. ఒక వినియోగదారు మసాజ్ చైర్లో సేద తీరుతూ నిద్రపోయాడు. రాత్రి కావడంతో స్టోర్ బంద్ అయిపోయింది. ఆ వ్యక్తి ఫోనులో ట్వీట్ ద్వారా సాయం అడినప్పుడు ఈ విషయం వెలుగుచూసింది. @_Asphodelus అనే పేరు కలిగిన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఈ వ్యక్తి ట్వీట్ చేశాడు. చీకటితో కూడిన ఒక ఫొటోను షేర్ చేసిన ఆయన ‘అయ్యయ్యో.. లోపలుండిపోయానే’ అని రాశాడు. కేఎస్ అనే పేరు కలిగిన స్టోర్ బంద్ అయి ఉండటాన్ని ఫోటోలో చూడవచ్చు. కాగా అనంతరం ఆ వ్యక్తి స్టోర్‌లోని అలారం మోగించగా పోలీసులకు ఈ సమాచారం అందింది. వెంటనే వారు స్టోర్ యజమానికి ఈ విషయాన్ని తెలియజేశారు. మొత్తం 10 మంది పోలీసు అధికారులు స్టోర్‌లో నుంచి అతనిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అతనిని దొంగ కాదని నిర్ధారించుకున్నారు. కాగా స్టోర్‌కు తాళాలు వేసిన సిబ్బంది మసాజ్ చైర్లో ఉండిపోయి ఇబ్బందిపడిన వ్యక్తిని క్షమాణలు కోరారు. అయితే ఈ స్టోర్‌లో ఆ వ్యక్తి ఎంతసేపు బందీ అయిపోయారన్న విషయం తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించిన పోస్టుకు 39 వేలకుపైగా షేర్లు వచ్చాయి. ఈ పోస్టు చూసిన ఒక యూజర్ ‘డిపార్ట్మెంటల్ స్టోర్‌లో బంద్కావడం అనేది తన చిన్నప్పటి కల అని అన్నారు. మరొక యూజర్ తాను అలా బందీ అయితే ‘ఎస్కేప్ ది రూమ్’ స్టయిల్ గేమ్స్ ఆడుకుంటానని అన్నారు. ఇది కూడా చదవండి: ‘ఏంట్రా ఇదంతా’..‘ఎవర్రా మీరు’.. ‘ఇదేందిది’.. వీటికి బాప్ ఈ వీడియో! え…… pic.twitter.com/AalynpL1PB — こばたつ (@afdc1257) August 15, 2016 -
రూ.కోట్ల ఆస్తులు ఉన్నా.. అనాథే..!
ఎనిమిది మంది సంతానం.. ఒకరికి మించి ఒకరిపై ప్రేమను పొంగించాడు. అందరినీ గుండెలపై పెట్టుకుని పెంచాడు... వృద్ధాప్యంలో ఎవరో ఒకరు తమ గుండె గుడిసెలో కాస్త చోటిస్తారనుకున్నాడు. చదువులు, పెళ్లిళ్ల బాధ్యతల బరువులను ఆనందంగా మోశాడు. ఇంటి దీపాలైన ఆరుగురు ఆడ బిడ్డలు వివాహమై వెళ్తుంటే కళ్ల నిండా నీటి ఒత్తులు వెలిగించుకున్నాడు. కొన్నాళ్లకు తన తోడు తనను ఒంటరిని చేసి వెళ్లిపోతే.. ఆయనిప్పుడు నీడ లేని వాడయ్యాడు. ఎనిమిది మంది సంతానానికి ఎక్కువై చివరకు అనాథాశ్రమంలో అన్నీ ఉన్నా అనాథగా మారాడు. కరోనా రక్కసి వికటాట్టాహాసానికి అనాథాశ్రమమూ ముఖం చాటేయడంతో ఏ దిక్కూలేక నడిరోడ్డుపై నీరింకిన కళ్లతో బేలగా చూస్తున్నాడు. దయ గల మారాజులెవరైనా ఆదరిస్తారేమోనని.. సత్తెనపల్లి: సత్తెనపల్లికి చెందిన గోపవరపు సత్యనారాయణ వయసు ఎనిమిది పదులు పైనే. ఆయనకు ఆరుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులున్నారు. భార్య కొన్ని సంవత్సరాల క్రితం ఆయనను ఒంటరి వాడిని చేసి అనంతలోకాలకు వెళ్లింది. ఉండటానికి, తినడానికీ లోటు లేకపోయినా కన్నపేగు బంధమే కాదు పొమ్మంది. ఎనిమిది మంది సంతానంలో ఒక కుమార్తె మరణించింది. మిగిలిన వారిలో ఇద్దరు విజయవాడలో, ఒకరు గుంటూరులో, ఒకరు తిరుపతిలో, మరొకరు సత్తెనపల్లిలో ఉంటున్నారు. కుమారులు మల్లేశ్వరరావు, ప్రసాద్ విజయవాడలో స్థిరపడ్డారు. వారెవరూ తండ్రిని చూసేందుకు ముందుకు రావడం లేదు. కాలే కడుపుకి పిడికెడు అన్నం పెట్టడానికి వీరికి మనసు రావడం లేదు. రూ.కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ ఒంటరిగా జీవించలేక సత్యనారాయణ ఏడాదిన్నర క్రితం పేరేచర్లలోని కొండప్రోలు బసవ పున్నయ్య అనాథా ఆశ్రమంలో చేరాడు. అక్కడే కాలం వెళ్లదీస్తున్న ఆయనకు కరోనా మళ్లీ పరీక్ష పెట్టింది. కరోనాతో మళ్లీ రోడ్డుపైకి... ఎనిమిది మంది సంతానం ఉండి కూడా అనాథగా మారాననే దిగులు నిత్యం వెంటాడుతుండే సత్యనారాయణకి ఆశ్రమంలో చేరాక కాస్త మనసు కుదుట పడింది. ఇంతలో కరోనా రూపంలో ఆయనకు జీవితం మరోసారి పరీక్ష పెట్టింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆశ్రమాన్ని నిర్వాహకులు మూసేశారు. దీంతో సత్యనారాయణ మళ్లీ రోడ్డున పడ్డాడు. శుక్రవారం సత్తెనపల్లి వచ్చిన ఆయన ఓ లాడ్జి వద్దకు వచ్చి దీనంగా కూర్చొని ఉన్నాడు. తన వారెవరూ ఆదరించడం లేదని, ఆస్తులు ఉన్నా ఒంటరిని చేశారని వాపోయాడు. సత్తెనపల్లిలో సొంత ఇల్లు ఉన్నప్పటికీ అద్దెకు చేరిన వ్యాపారవర్గానికి చెందిన ఓ వ్యక్తి ఇంటిని ఖాళీ చేయడం లేదు. కడుపున పుట్టిన బిడ్డలు పట్టించుకోవడం లేదు. లాడ్జిలోనైనా తలదాచుకుందామంటే కరోనాకు భయపడి నిర్వాహకులు రూములు ఇవ్వడం లేదని ఆయన కన్నీటి పర్యంత మవుతున్నాడు. ఈ విపత్కర పరిస్థితుల్లో తన ఇంటిని ఖాళీ చేయించి కాస్తంత నీడ చూపించాలని వేడుకుంటున్నాడు. చదవండి: బద్వేలులో దారుణం: పెళ్లయిన నాలుగు నెలలకే.. మెడి‘కిల్స్’: ప్రాణాల మీదకు తెస్తున్న సొంత వైద్యం -
మామ్.. డాడీతో మళ్లీ ఫ్రెండ్‌గా ఉండవా?
అట్టావా: పిల్లలు పెద్దవాళ్లలా మాట్లాడితే 'ఏంటా ఆరిందలా మాటలు' అని విసుక్కునేవారు, ముచ్చటపడి మురిసిపోయే తల్లిదండ్రులూ ఉంటారు. కెనడాకు చెందిన ఆరేళ్ల టియానా విడిపోయిన తల్లిదండ్రులను స్నేహితుల్లా ఉండాలంటూ ముద్దు ముద్దు మాటలతో హితవు చెప్పి ప్రపంచాన్నే విస్మయపరుస్తోంది. కెనడాలోని సుర్రే నగరానికి చెందిన చెరిష్ షెర్రీ అనే ఓ మహిళ తన భర్తతో విడిపోయింది. వారు మళ్లీ కలిసుండే విషయమై గొడవ పడుతుంటే టియానా తన తల్లిని ఓ గదిలోకి తీసుకెళ్లి అక్కడున్న మెట్లపై కూర్చొని ఇలా మాట్లాడింది... 'మామ్, నీవు డాడీతో మళ్లీ ఫ్రెండ్‌గా ఉండాలనుకుంటున్నావా ?' 'అవును' తల్లి సమాధానం. 'మరీ అంత పెద్దగా చెప్పొద్దు (రెండు చేతులు పెకైత్తి). ఏదైనా కింది స్థాయిలో ఉండాలన్నదే నేను కోరుకునేది. నీకు ఏ మేరకు సాధ్యమవుతుందో ఆ మేరకే ఉండు. నా మామ్, డాడీ విడిపోయి ఆ స్థానంలో వేరెవరో రావాలని నేను కోరుకోవడం లేదు. నాకు నీవు, డాడీ ఇద్దరూ కావాలి. మీరిద్దరూ ఫ్రెండ్లీగా ఉండాలి. నేను నా స్వార్థం కోసం ఈ మాటలు చెప్పడం లేదు. అందరూ ఫ్రెండ్స్‌గా ఉండాలన్నదే నా ఆలోచన. నేను నైస్‌గా ఉన్నప్పుడూ మనమందరం నైస్‌గా ఉండొచ్చు. మళ్లీ నా స్వార్థం కోసం నేను చెప్పడం లేదు. నా హృదయంలో ఉన్నది నేను చెప్పేందుకు ప్రయత్నిస్తున్నా. అంతకుమించి మరేం లేదు. నా మామ్, నా డాడ్, అందరూ ఫ్రెండ్స్‌గా ఉండాలి. అందరూ నవ్వుతూ గడపాలి. నీవు అలాగా ఉంటావని నేననుకుంటున్నా. నీవు కూడా కొంత తగ్గుతావని, పరిస్థితులు చక్కబడాలని నేను కోరుకుంటున్నా. సాధ్యమైనంత వరకు అందరు మంచిగా ఉండేందుకు ప్రయత్నించాలి. అంతకుమించి ఏమి అక్కర్లేదు' అంటూ ఆరేళ్ల ఆరింద చిన్నపాటి తన ఉపన్యాసాన్ని ముగించగానే 'థాంక్యూ, టియానా' అంటూ షెర్రీ... ముందుకొచ్చి టియానాను ఎత్తుకొని బుగ్గ మీద ముద్దు పెడుతూ ఎంతో మురిసిపోయింది. 'కూతురిచ్చిన ఈ సందేశం నాకో మేలుకొల్పు. నాకు కళ్లలో గిర్రున నీళ్లు తిరిగాయి. సిగ్గుతో కుంచించుకుపోయినట్టయింది. నాకు నా కూతురు హితోపదేశం చేయడం మరోపక్క దిగ్భ్రాంతి కలిగించింది' అంటూ షెర్రీ వ్యాఖ్యానించింది. ఆమె కూతురిచ్చిన మూడు నిమిషాల ఉపన్యాసాన్ని వీడియోలో రికార్డు చేసి 'ఫేస్బుక్'లో పోస్ట్చేయగా ఇప్పటికే 60 లక్షల మంది యూజర్లు దాన్ని వీక్షించారు.